మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హైదరాబాద్‌లో గ్రాండ్ స్టార్టప్ సదస్సు ను ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీ పురుషోత్తం రూపాలా

Posted On: 28 FEB 2023 5:03PM by PIB Hyderabad

ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా పశుసంవర్ధక, పాడి పరిశ్రమ  పశుసంవర్ధక రంగాల్లో ఇప్పటికే పనిచేస్తున్న,  అభివృద్ధి చెందుతున్న స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి  తెలంగాణ రాష్ట్ర  పశుసంవర్ధక శాఖ, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డు,  స్టార్టప్ ఇండియా, సిఐఐ సహకారంతో కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ ఈ రోజు హైదరాబాద్‌లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో   గ్రాండ్ స్టార్టప్ సదస్సు ను నిర్వహించింది.

సదస్సులో కేంద్ర మత్స్య, కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ పురుషోత్తం రూపాల ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  కేంద్ర మత్స్య, కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్.మురుగన్, తెలంగాణ రాష్ట్ర కేంద్ర మత్స్య, కేంద్ర పశుసంవర్ధక , పాడి పరిశ్రమ, చలనచిత్ర  శాఖ మంత్రి శ్రీ టి .శ్రీనివాస్ యాదవ్  కార్యక్రమంలో పాల్గొన్నారు.  

 

 

 శ్రీ పురుషోత్తం రూపాలా మాట్లాడుతూ  వ్యవసాయ కార్యక్రమాలతో పశు పోషణ చేపట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం పెంచుకోవడానికి వీలవుతుందన్నారు.   పశుసంవర్ధక రంగంలో ఈ సమయంలో   పెట్టుబడులు మరింత పెరగాలన్నారు.  పశుసంవర్ధక రంగం  మరింత అభివృద్ధి సాధించేలా చూసి,   పశు పోషణ రంగంలో ఉన్న  రైతులు, పారిశ్రామికవేత్తలకు ప్రయోజనం కలిగించి ఈ రంగం మరింత లాభదాయకంగా మార్చడానికి అన్ని వర్గాలతో   కలిసి పనిచేయడానికి కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని శ్రీ రూపాల హామీ ఇచ్చారు. 

సదస్సులో ప్రసంగించిన కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ సంజీవ్ కుమార్ బాల్యన్ దేశంలో పశుసంవర్ధక రంగం ప్రాధాన్యత, రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను  ప్రస్తావించారు. తక్కువ ఉత్పత్తి, వ్యాధుల రూపంలో పశుసంవర్ధక రంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఇతర మంత్రిత్వ శాఖలు, సంబంధిత వర్గాలతో కలిసి కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ చర్యలు అమలు చేస్తున్నదన్నారు.  సమస్యల పరిష్కారం తో పాటు వ్యవస్థాపక శక్తి, సాంకేతిక అంశాలు, డిజిటలీకరణ, వినూత్న ఆలోచనలకు మంత్రిత్వ శాఖ ప్రాధాన్యత ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు.  

పశుసంవర్ధక రంగంలో ఉన్న రైతులు, పారిశ్రామికవేత్తల ఆదాయం ఎక్కువ చేయాలన్న లక్ష్యంతో ఇతర మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో పని చేస్తూ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోంది. 

శాస్త్రీయ చర్యల ద్వారా పశుసంవర్ధక రంగంలో మార్పులు తీసుకు వచ్చి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందేలా ప్రభుత్వం చర్యలు అమలు చేయడం ప్రారంభించిందని కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ తెలిపారు. లక్ష్యాలు సాధించడానికి పడే విధంగా వేగంగా ప్రణాళిక అమలు జరిగేలా చూడడానికి అన్ని వర్గాలు సహకరించాలని డాక్టర్ మురుగన్ కోరారు. అన్ని వర్గాల నుంచి అందే సలహాలు, సూచనలు, అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నూతన విధానానికి రూపకల్పన చేస్తామన్నారు.  

  ఆజాది కా అమృత్ మహోత్సవ్ జరుపుకుంటున్న భారతదేశానికి రానున్న 25 సంవత్సరాలు అతి ముఖ్యమైన అమృత కాలమని డాక్టర్ మురుగన్ అన్నారు. ' 2014కు ముందు దేశంలో అతి తక్కువ సంఖ్యలో స్టార్టప్‌ సంస్థలు ఉండేవి. నేడు స్టార్టప్‌ రంగంలో భారతదేశం ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. దేశంలో లక్షకు పైగా స్టార్టప్‌ సంస్థలు పనిచేస్తున్నాయి '  అని డాక్టర్ మురుగన్ అన్నారు. 

 

 

ప్రపంచ మాంసం ఎగుమతుల రంగంలో భారతదేశం 8వ స్థానం, గుడ్ల ఎగుమతుల రంగంలో 3వ స్థానంలో ఉందని డాక్టర్ మురుగన్ తెలిపారు. దేశంలో పాడి పరిశ్రమ, పశు సంవర్ధక రంగంలో అభివృద్ధి సాధిస్తున్నాయని, ఈ రంగాల్లో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం ఎక్కువగా ఉందన్నారు. 

. హైదరాబాద్‌లో స్టార్టప్‌ల సదస్సు నిర్వహించిన మంత్రిత్వ శాఖను తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక మరియు మత్స్య శాఖ మంత్రి శ్రీ. టి.శ్రీనివాస్ యాదవ్   అభినందించారు.

భారతదేశం లో   పశు సంపద మరియు పాడి పరిశ్రమ కలిగి ఉన్న సామర్థ్యాన్ని వివరించిన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ కుమార్ సింగ్  మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉత్పాదకతను పెంపొందించడం, ఉత్పత్తి విలువ జోడింపు పశువుల ఆరోగ్యాన్ని మెరుగు పరచడం, రైతుల ఇంటి వద్ద సేవలు అందించడం వంటి అంశాల్లో  ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు వివరించారు. 

స్టార్టప్‌ల వృద్ధిని పెంపొందించేందుకు పశుసంవర్ధక శాఖ చేస్తున్న ప్రచారం, అందిస్తున్న సహకారాన్ని కేంద్ర అదనపు కార్యదర్శి శ్రీమతి వర్ష జోషి వివరించారు. 

 మంథన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా పరిశ్రమ,స్టార్టప్ రంగానికి అందిస్తున్న సహకారాన్ని వ్యూహాత్మక అలయన్స్ డివిజన్ డైరెక్టర్ డాక్టర్ సప్నా పోటి వివరించారు. 
కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న ప్రముఖులకు మరియు పాల్గొన్నవారికి చైర్మన్ శ్రీ మీనేష్ షా కృతజ్ఞతలు తెలిపారు.

 

 

సదస్సు ద్వారా ఒక వేదికపైకి వచ్చిన  వ్యవస్థాపకులు, పెట్టుబడిదారులు, పరిశ్రమ నిపుణులను తమ ఆలోచనలు,, నెట్‌వర్క్‌ను పంచుకోవడానికి గల అవకాశాలను చర్చించారు. వినూత్న ఆలోచనలు, ఉత్పత్తులను ప్రదర్శించడానికి, తోటి వ్యవస్థాపకులు, వాటాదారులతో సంబంధాలు పెంపొందించుకోవడానికి సదస్సు అద్భుతమైన అవకాశాన్ని అందించింది. ఈ కార్యక్రమంలో భాగంగా  ప్రముఖ పరిశ్రమల ప్రముఖుల ముఖ్య ప్రసంగాలు, ఇంటరాక్టివ్ సెషన్‌లు, ప్యానెల్ చర్చలు, విజయవంతమైన స్టార్టప్‌ల ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. 
సదస్సులో ఎంపిక చేసిన స్టార్టప్‌ల ప్రదర్శన, పిచ్ ఫెస్ట్, కొనుగోలుదారుల సమావేశం, స్టార్టప్‌ల కోసం వర్క్‌షాప్ నిర్వహించారు.  పశుసంవర్ధక,పాడిపరిశ్రమ రంగంలో పనిచేస్తున్న ప్రారంభ-దశ స్టార్టప్‌లకు పిచ్ చేయడం, ప్రధాన వ్యాపార కార్యక్రమాలు ప్రారంభించడం అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు సదస్సులో చర్చకు వచ్చాయి.
 
***
 

(Release ID: 1903086) Visitor Counter : 197


Read this release in: English , Urdu , Tamil