భారత ఎన్నికల సంఘం
ఆంధ్రప్రదేశ్.. తెలంగాణ రాష్ట్రాల్లో శాసనసభ సభ్యుల
(ఎమ్మెల్యే) కోటా కింద 29.03.2023న పదవీ విరమణ చేసేశాసనమండలి సభ్యుల స్థానాల భర్తీ కోసం ద్వైవార్షిక ఎన్నిక
Posted On:
27 FEB 2023 7:05PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల శాసనమండళ్లకు శాసనసభ్యుల కోటా కింద ఎన్నికైన 10 మంది సభ్యుల పదవీకాలం 29.03.2023న ముగుస్తుంది. పదవీ విరమణ చేస్తున్న శాసన మండలి సభ్యుల వివరాలు కిందివిధంగా ఉన్నాయి:-
ఆంధ్రప్రదేశ్
వ.సం.
|
సభ్యుని పేరు
|
పదవీ విరమణ తేదీ
|
1.
|
చల్లా భగీరథ్ రెడ్డి (02.11.2022 నుంచి ఖాళీ)
|
29.03.2023
|
2.
|
నారా లోకేష్
|
”
|
3.
|
పోతుల సునీత
|
”
|
4.
|
బచ్చుల అర్జునుడు
|
”
|
5.
|
డొక్కా మాణిక్య వరప్రసాద రావు
|
”
|
6.
|
వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స
|
”
|
7.
|
గంగుల ప్రభాకర రెడ్డి
|
”
|
తెలంగాణ
|
వ.సం.
|
సభ్యుని పేరు
|
పదవీ విరమణ తేదీ
|
1.
|
ఎలిమినేటి కృష్ణారెడ్డి
|
29.03.2023
|
2.
|
గంగాధర్ గౌడ్ ఊళ్లోళ్ల
|
”
|
3.
|
కుమురయ్యగారి నవీన్ కుమార్
|
”
|
2. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలికి ఆయా శాసనసభల సభ్యుల ద్వారా పైన పేర్కొన్న సభ్యుల స్థానాల భర్తీ కోసం కింది కార్యక్రమ పట్టికకు అనుగుణంగా ద్వైవార్షిక ఎన్నిక నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం (ఇసిఐ) నిర్ణయించింది:-
వ.సం.
|
కార్యక్రమ వివరం
|
తేదీలు
|
1.
|
నోటిఫికేషన్ జారీ
|
06 మార్చి 2023 (సోమవారం)
|
2.
|
నామినేషన్ల దాఖలుకు తుది గడువు
|
13 మార్చి 2023 (సోమవారం)
|
3.
|
నామినేషన్ల పరిశీలన
|
14 మార్చి 2023 (మంగళవారం)
|
4.
|
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ
|
16 మార్చి 2023 (గురువారం)
|
5.
|
పోలింగ్ తేదీ
|
23 మార్చి 2023 (గురువారం)
|
6.
|
పోలింగ్ సమయం
|
ఉ. 09:00 నుంచి సా.4:00 గం॥
|
7.
|
ఓట్ల లెక్కింపు
|
23 మార్చి 2023 (గురువారం)
సాయంత్రం 5:00 గం॥
|
8.
|
ఎన్నిక ముగియాల్సిన తేదీ
|
25 మార్చి 2023 (శనివారం)
|
3. ఎన్నికల సంఘం 03.11.2022న జారీ చేసిన పత్రికా ప్రకటన 33వ పేరాలోగల కోవిడ్-19 విస్తృత మార్గదర్శకాలు (https://eci.gov.in/files/file/14534-general-election-to-legislative-assembly-of-gujarat-2022-reg/) ఎక్కడెక్కడ వర్తిస్తాయో ఆయా ప్రదేశాల్లో ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేవారందరూ తప్పనిసరిగా పాటించాలి.
4. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించి కోవిడ్-19 నియంత్రణ చర్యలపై ఇప్పటికే జారీ చేసిన సూచనలను పాటించేలా చూసేందుకు సంబంధిత రాష్ట్రం నుంచి ఒక సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులకు ఆదేశాలు జారీ అయ్యాయి.
*****
(Release ID: 1902962)