వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

బడ్జెట్ అనంతర వెబ్‌నార్‌కు సహ-నాయకత్వం వహించనున్న 'పరిశ్రమలు & దేశీయ వాణిజ్య ప్రోత్సాహక' విభాగం (డీపీఐఐటీ)


'అన్‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజింగ్‌ టెక్నాలజీ' అనే అంశంపై వెబ్‌నార్

Posted On: 27 FEB 2023 3:53PM by PIB Hyderabad

బడ్జెట్ ప్రకటనలు, వాటిని అమలు పరిచే వ్యూహాలపై చర్చించడానికి, 28 ఫిబ్రవరి 2023న బడ్జెట్‌-అనంతర వెబ్‌నార్ నిర్వహించనున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతికత మంత్రిత్వ శాఖ ఈ వెబినార్‌ను నిర్వహిస్తుంది. 'పరిశ్రమలు & దేశీయ వాణిజ్య ప్రోత్సాహక' విభాగం (డీపీఐఐటీ) సహకరిస్తుంది. వెబ్‌నార్‌ కోసం ఎంచుకున్న అంశం'అన్‌లీషింగ్ ది పొటెన్షియల్: ఈజ్ ఆఫ్ లివింగ్ యూజ్ టెక్నాలజీ'. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ వెబ్‌నార్‌ను ప్రారంభించనున్నారు.

నాలుగు సెషన్లుగా వెబినార్‌ను నిర్వహిస్తారు. "సాంకేతికతను ఉపయోగించి సులభతర వాణిజ్యం, ముఖ్యంగా చిన్న వ్యాపారాల కోసం నిర్వహించడం" అనే అంశంపై జరిగే మూడో సెషన్‌ను డీపీఐఐటీ నిర్వహిస్తుంది. జాతీయ ఏక గవాక్ష విధానం, వ్యాపార గుర్తింపుగా పాన్, కేవైసీ సరళీకరణ, ఏకీకృత ఫైలింగ్ ప్రక్రియ, ప్రయోగశాలల్లో తయారు చేసే వజ్రాలు, ఎంఎస్‌ఎంఈల కోసం వివాద్ సే విశ్వాస్ పథకం మొదలైన అనేక రకాల అంశాలు ఈ సెషన్‌లో ఉంటాయి.

పరిశ్రమలు, మేథావులు ఈ సెషన్‌లో పాల్గొంటారు. అంతరిక్ష విభాగానికి చెందిన ఇన్‌స్పేస్ చైర్‌పర్సన్ డాక్టర్ పవన్ గోయెంకా, ఇండియన్ వెంచర్ అండ్ ఆల్టర్నేట్ క్యాపిటల్ అసోసియేషన్ (ఐవీసీఏ) ఉపాధ్యక్షుడు అమిత్ పాండే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నేషనల్ కమిటీ ఆన్ అఫర్మేటివ్ యాక్షన్ చైర్మన్ పిరూజ్ ఖంబట్టా, టెక్నాలజీ ఆఫ్ ఎర్నెస్ట్ & యంగ్ (ఈవై) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వనాథన్ రవిచంద్రన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ మైక్రో అండ్ స్మాల్ & మీడియం ఎంటర్‌ప్రైజెస్ (FISME) సెక్రటరీ జనరల్ అనిల్ భరద్వాజ్, ఐఐటీ మద్రాస్‌ ప్రొఫెసర్‌ ఎంఎస్‌ రామచంద్రరావు, ఐఐటీ దిల్లీ నుంచి ప్రొఫెసర్‌ నీరజ్ ఖరే, సెంటర్ ఫర్ డిజిటల్ ఎకానమీ పాలసీ రీసెర్చ్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు జైజిత్ భట్టాచార్య ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

సులభతర వాణిజ్యం, జీవన సౌలభ్యం అంశాలకు సంబంధించి కేంద్ర బడ్జెట్‌ 2023లో ముఖ్యమైన ప్రకటనలు వెలువడ్డాయి. ఈ లక్ష్యాలను సాధించడంలో సాంకేతికత చాలా ఉపయోగపడుతుంది. సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించడం, ఈ లక్ష్యాలను సాధించడానికి వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, పరిశ్రమల సంఘాలు, విద్యాసంస్థల వంటి వివిధ వర్గాల మధ్య సమన్వయం, సహకారం అవసరం.

 

*******


(Release ID: 1902789)