సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
పిఎంఈజిపి పథకం కింద 3083 మంది లబ్ధిదారులకు సుమారు రూ. 300 కోట్ల రుణం మంజూరు చేయబడింది
రూ.100.63 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీ పంపిణీతో దాదాపు 25,000 కొత్త ఉద్యోగాల సృష్టి
రాజస్థాన్‌లోని కరౌలిలో హిందౌన్ సిటీలో కెవిఐసి నిర్వహించిన కార్యక్రమంలో తేనెటీగల పెంపకందారులకు 300 తేనెటీగల పెట్టెలు పంపిణీ చేయబడ్డాయి
Posted On:
26 FEB 2023 7:35PM by PIB Hyderabad
రాజస్థాన్‌లోని కరౌలి జిల్లాలోని హిందౌన్ సిటీలోని కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో..ఖాదీ మరియు గ్రామ పరిశ్రమల కమిషన్ (కెవిఐసి) చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ సమక్షంలో రాజస్థాన్‌లోని కరౌలి ధోల్పూర్ లోక్‌సభ పార్లమెంటు సభ్యుడు డాక్టర్ మనోజ్ రజోరియా ఈ రోజు తేనెటీగల పెంపకందారులకు 300 తేనెటీగల పెట్టెలను పంపిణీ చేశారు.అలాగే పిఎంఈజిపి పథకం కింద 3083 మంది లబ్ధిదారులకు రూ. 100.63 కోట్ల మార్జిన్ మనీ సబ్సిడీని కూడా అందజేశారు. పిఎంఈజిపి ప్రాజెక్టులకు మంజురైన రూ. 296.19 కోట్లు దాదాపు 25,000 మందికి కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తుంది.
ఈ సందర్భంగా కెవిఐసి చైర్మన్ శ్రీ మనోజ్ కుమార్ మాట్లాడుతూ..ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ అమలు చేస్తున్న ప్రభుత్వ ప్రధాన ఫ్లాగ్‌షిప్ స్కీమ్ 'ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం' (పిఎంఈజిపి) అని తెలిపారు. పిఎంఈజిపి పథకం కింద ఇప్పటివరకు 8 లక్షలకు పైగా ప్రాజెక్టులకు ఆమోదం లభించిందని, వీటి కింద రూ.21000 కోట్లకు పైగా 'మార్జిన్ మనీ సబ్సిడీ' పంపిణీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా 68 లక్షల మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించామని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన "ఉద్యోగాన్ని కోరుకునే వ్యక్తిగా కాకుండా ఉద్యోగ ప్రదాతగా మారండి" అనే నినాదాన్ని ఆయన పునరుద్ఘాటించారు. కెవిఐసి దేశంలోని ప్రతి మూలలో అనేక ఉపాధి ఆధారిత పథకాలను అమలు చేస్తోందని, తద్వారా ఉపాధిని కోరుకునే యువకులు తమ యూనిట్లను ఏర్పాటు చేసుకోగలుగుతున్నారని చెప్పారు.
దేశంలో "తీపి-విప్లవం" కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన స్పష్టమైన పిలుపు తర్వాత కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించి, తేనెటీగల పెంపకందారుల ఆదాయాన్ని మరియు రైతుల పంటల దిగుబడిని పెంచే లక్ష్యంతో కెవిఐసి ఈ ప్రయత్నాన్ని హనీ మిషన్‌గా చేపట్టిందని శ్రీ కుమార్ చెప్పారు. ఈ పథకం కింద 17,570 మంది తేనెటీగల పెంపకందారులకు శిక్షణ ఇచ్చామని తేనెటీగల కాలనీలతో పాటు 1.75 లక్షల తేనెటీగల పెట్టెలను పంపిణీ చేశామని చెప్పారు.
కుమ్మర్ సశక్తికర్ణ్ యోజన కింద 'కుమ్మరి సాధికారత పథకం' ఆధ్వర్యంలో 24,410 మంది కుమ్మరులకు కెవిసి ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలను పంపిణీ చేసినట్లు ఛైర్మన్ తెలిపారు. అలాగే 1560 మంది అగరుబత్తీ కళాకారులకు అగరుబత్తీల తయారీకి సంబంధించిన యంత్రాలు వారి నైపుణ్యాభివృద్ధికి మరియు ఉత్పత్తి నాణ్యత మరియు ఆదాయాన్ని పెంచడానికి పంపిణీ చేయబడ్డాయి. 2014 నుండి ఖాదీ రంగ అప్‌గ్రేడేషన్ మరియు అభివృద్ధి గురించి ఆయన మాట్లాడుతూ..ప్రధానమంత్రి తీర్మానం ఈ రంగాన్ని పునరుద్ధరించిందని అన్నారు. ఆయన నిరంతర ప్రయత్నం మరియు అవిశ్రాంత కృషి కారణంగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కొత్త శిఖరాలను తాకుతోందన్నారు. ఫలితంగా స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ విక్రయాలు గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,15,000 కోట్లకు చేరుకున్నాయని ఆయన వివరించారు.
ఖాదీ రంగంలో పని చేస్తున్న కళాకారులకు ఎక్కువ వేతనాలు చెల్లించడం ద్వారా ఖాదీ కళాకారుల ఆర్థిక స్థితిని మెరుగుపరిచేందుకు ప్రధానమంత్రి అంకిత భావాన్ని నెరవేర్చేందుకు కెవిఐసి నిర్ణయం తీసుకుందని శ్రీ కుమార్ తెలిపారు. ఏకంగా దాదాపు 35% వేతనాలు పెంచాలని ఇటీవల నిర్ణయించారని..ఇది చారిత్రాత్మక అడుగని చెప్పారు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కెవిఐసి ద్వారా చేతివృత్తుల వారి వేతనాలను దాదాపు 150% పెంచారన్నారు.
ఖాదీ & విలేజ్ ఇండస్ట్రీస్ కమీషన్ గత కొన్ని సంవత్సరాలలో తన కార్యక్రమాలలో సాధించిన కొన్ని విజయాలు క్రింది విధంగా ఉన్నాయి:
• ఖాదీ-విలేజ్ ఇండస్ట్రీస్ ఉత్పత్తి సుమారు రూ. 84,290 కోట్లు మరియు విక్రయం దాదాపు రూ. 1,15,415 కోట్లు. దీని ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభించింది.
• 2 అక్టోబర్ 2022 గాంధీ జయంతి రోజున న్యూఢిల్లీలోని కన్నాట్ ప్లేస్‌లో కెవిఐసి ఫ్లాగ్‌షిప్ అవుట్‌లెట్ ఒకే రోజులో రూ.1.34 కోట్ల విక్రయంతో రికార్డు సృష్టించింది.
• అదేవిధంగా ఖాదీ పెవిలియన్ ఐఐటిఎఫ్, 2022 రికార్డు స్థాయిలో రూ. 12.6 కోట్ల విక్రయాన్ని సాధించింది.
• ప్రయాగ్‌రాజ్‌లో కెవిఐసి నిర్వహించిన మాఘమేళా సందర్భంగా ఈ సంవత్సరం 53% వృద్ధితో రూ. 5.83 కోట్ల విక్రయాలతో కొత్త రికార్డు నమోదు చేయబడింది.
• అదే ఆర్థిక సంవత్సరంలో ముంబైలో నిర్వహించిన “ఖాదీ ఫెస్ట్” కూడా 3 కోట్ల అమ్మకాలతో కొత్త రికార్డు సృష్టించింది.
*****
(Release ID: 1902668)
Visitor Counter : 178