ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
'ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు'పై కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, కేంద్ర రసాయన మరియుఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖుబాతో కలిసి 2 రోజుల చింతన్ శివిర్‌ను కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ప్రారంభించారు.
దృఢమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి సమగ్ర మరియు పరస్పర దోహద విధానాలకు సంబంధించిన మార్గాలపై చింతన్ శివిర్ చర్చిస్తుంది: డాక్టర్ మన్సుఖ్ మాండవియా
"దేశం యొక్క నియంత్రణ యంత్రాంగాలు నిష్కళంకమైన ప్రమాణాలు మరియు స్థిరమైనవని నిర్ధారించడం చాలా ముఖ్యమైనది"
"భారతదేశ నియంత్రణ వ్యవస్థలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవని నిర్ధారించుకుందాం"
రాష్ట్రాలు/యూటీల నుండి ఆరోగ్య కార్యదర్శులు మరియు డ్రగ్ రెగ్యులేటర్లు, పరిశ్రమల సభ్యులు, నీతి ఆయోగ్, ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ, ఐ సీ ఎం ఆర్ ప్రతినిధులు మేధోమథన సదస్సులో పాల్గొన్నారు.
Posted On:
26 FEB 2023 3:41PM by PIB Hyderabad
"ఔషధాలు: నాణ్యతా నిబంధనల అమలు"పై రెండు రోజుల చింతన్ శివిర్‌ను కేంద్ర ఆరోగ్య & కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు & ఎరువుల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా ఈరోజు ఇక్కడ ప్రారంభించారు. ఆయనతో పాటు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్, రసాయన మరియు ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీ భగవంత్ ఖూబా, నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మరియు, లోకాయుక్త ఉప- లోకాయుక్త మహారాష్ట్ర శ్రీ సంజయ్ భాటియా పాల్గొన్నారు. వివిధ రాష్ట్రాలు/యుటిల నుండి ఆరోగ్య కార్యదర్శులు & డ్రగ్ రెగ్యులేటర్లు మేధోమథన సమ్మేళనంలో పాల్గొంటున్నారు.
డా. మన్సుఖ్ మాండవియా తన ప్రారంభ ప్రసంగంలో, చర్చా వేదిక యొక్క లక్ష్యాన్ని నొక్కిచెప్పారు, “చింతన్ శివిర్ అనేది ఫార్మా మరియు ఆరోగ్య రంగాలలోని వాటా మరియు లబ్దిదారులందరికీ దృఢమైన నియంత్రణ వ్యవస్థలను నిర్మించడానికి సమగ్ర మరియు సమన్వయ విధానాల కోసం మార్గాలను చర్చించడానికి ఒక వేదిక. కేంద్రం మరియు రాష్ట్రాల్లోని వివిధ ఏజెన్సీలు, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం దేశంలో తయారు చేయబడిన మరియు దేశీయ మరియు అంతర్జాతీయ వినియోగదారులచే వినియోగించబడే ఔషధాలు అత్యధిక నాణ్యతతో మరియు ప్రపంచ ప్రామాణిక ఉత్పత్తి నాణ్యత ప్రమాణాలకులకు కట్టుబడి ఉండేలా చూసుకోవడంలో ముఖ్యమైన విధానాలను ఏర్పరుస్తాయి. ఇది మనం వినియోగదారులకు అత్యధిక నాణ్యతతో కూడిన ఫార్మా ఉత్పత్తులను అందిస్తాము అనే భరోసా ఇచ్చి ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్"గా పిలుబడుతున్న భారతదేశం యొక్క కీర్తిని నిలబెట్టేలా చేస్తుంది

దేశం యొక్క నియంత్రణ యంత్రాంగాలు కాలానుగుణంగా అదే సమయంలో స్థిరంగా ఉండే నిష్కళంకమైన ప్రమాణాలను కలిగి ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యమైనది అని కేంద్ర ఆరోగ్య మంత్రి చెప్పారు. కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర సంస్థలు సహకార సమాఖ్య స్ఫూర్తితో పని చేయడం, ఒకదానికొకటి బలాన్ని పెంచుకోవడం మరియు నియంత్రణ వ్యవస్థల్లోని లోపాలను తొలగించడానికి సంయుక్తంగా పని చేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. సహకార మేధోమథనం యొక్క రెండు రోజులలో చర్చలను సుసంపన్నం చేయడానికి వారి క్షేత్ర స్థాయి అనుభవం నుండి వారి జ్ఞానం మరియు అంతర్దృష్టులను పంచుకోవాలని ఆయన పాల్గొనేవారిని ప్రోత్సహించారు. “మన సామూహిక అనుభవాన్ని సమష్టి చేయడం ద్వారా మనం ఎదుర్కొనే సవాళ్లను సహకారంతో పరిష్కరించుకోవచ్చు. ఈ రెండు రోజుల ముగింపులో మంథన్ బలమైన, దృఢమైన, మరియు ప్రజలకు అనుకూలమైన యంత్రాంగాలను నిర్మించడానికి గొప్ప జ్ఞానాన్ని అందిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.
“భారత్‌లో తయారయ్యే ఔషధాలు పై వినియోగదారుల విశ్వాసాన్ని మనం ఎలా నిలబెట్టగలం? ఇతర దేశాలు అనుకరించే విధంగా భారతీయ ఔషధ నియంత్రణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మార్చేందుకు సుస్థిరంగా కృషి చేయాలని వాటాదారులందరినీ నేను కోరుతున్నాను”, అని ఆయన పాల్గొనేవారికి ఉద్బోధించారు.


చింతన్ శివిర్‌ను కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ (DoP) సహకారంతో నిర్వహిస్తుంది. ఈ ఈవెంట్ లబ్దిదారులను ఒకచోట చేర్చింది. కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్, రాష్ట్రాలు/యూ టీ ల ఆరోగ్య కార్యదర్శులు, రాష్ట్రాలు/యూ టీ ల డ్రగ్ కంట్రోలర్‌లు, పరిశ్రమ సంఘాలు మొదలైనవి ఉమ్మడి వేదిక లో పాల్గొన్నారు. సదస్సు లో పాల్గొనేవారు ధృడమైన నియంత్రణ వ్యవస్థను నిర్మించటానికి అవసరమయ్యే అన్ని అంశాలు గురించి వివిధ కోణాలపై ఆలోచనలు చేస్తారు. దేశీయ మరియు ప్రపంచ మార్కెట్‌లో ఔషధాల నాణ్యతపై నమ్మకం మరియు విశ్వాసాన్ని పెంపొందించడంపై చర్చలు ఉన్నాయి. అంచనా ; ఔషధాల నాణ్యత నియంత్రణలో పారదర్శకత మరియు జవాబుదారీతనం; క్షేత్ర స్థాయిలో నాణ్యత, భద్రత మరియు సమర్థత యొక్క సమర్థవంతమైన అమలు; భారతీయ ఫార్మకోపియా ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం; ఫార్మకోవిజిలెన్స్ మరియు మెటీరియోవిజిలెన్స్ ప్రోగ్రామ్‌ల కోసం బలమైన నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడం; అన్ని నియంత్రణ కార్యకలాపాల కోసం ఏకీకృత ఐ టీ ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించడం; సులభ సరళ వాణిజ్యాన్ని ప్రోత్సహించడంతోపాటు రాష్ట్రాలు మరియు కేంద్రం అంతటా నియంత్రణ సామర్థ్యాన్ని అంచనా వేయడం; మరియు ఫార్మాస్యూటికల్స్ మరియు వైద్య పరికరాల నియంత్రణ కోసం రాష్ట్రాలు మరియు జాతీయ రెగ్యులేటర్ల స్థాయిలో సామర్థ్యం పెంపుదల వంటి పలు అంశాలపై ఈ సదస్సు లో చర్చిస్తారు.
ఈ మేధోమథన సదస్సు కు తమను ఆహ్వానించినందుకు మరియు ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన జాతీయ ఫార్మా రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి తమ ఆలోచనలు, సూచనలు మరియు అంతర్దృష్టులను పంచుకోవడానికి ఏకైక అవకాశాన్ని అందించినందుకు పాల్గొనేవారు కేంద్ర ఆరోగ్య మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
శ్రీ రాజేష్ భూషణ్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి, కేంద్ర ఫార్మా సెక్రటరీ శ్రీమతి. ఎస్ అపర్ణ, ఆరోగ్య పరిశోధన విభాగం కార్యదర్శి డాక్టర్ రాజీవ్ బాహ్ల్, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీ ఎస్ గోపాలకృష్ణన్, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సీఈఓ శ్రీ జి కమల వర్ధనరావు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ డాక్టర్ అతుల్ గోయెల్ మరియు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డా.రాజీవ్ రఘువంశీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ శ్రీ రాజీవ్ వాధావన్, డాక్టర్ ఎన్ యువరాజ్, జాయింట్ సెక్రటరీ, కెమికల్ & ఫెర్టిలైజర్స్ నీతి ఆయోగ్ సీనియర్ అధికారులు మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి ఎన్ పీ పీ ఏ, డీ జీ హెచ్ ఎస్, ఐ సీ ఎం ఆర్ నైపర్లు, సెంట్రల్ డ్రగ్ లేబొరేటరీలు ప్రతినిధులు రెండు రోజుల పాటు జరిగిన సదస్సులో పాల్గొన్నారు.
***
(Release ID: 1902567)
Visitor Counter : 193