నీతి ఆయోగ్
సిఇఒగా బి.వి.ఆర్ సుబ్రహ్మణ్యానికి స్వాగతం పలికిన నీతి ఆయోగ్
Posted On:
25 FEB 2023 6:40PM by PIB Hyderabad
నీతి ఆయోగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా శ్రీ బి.వి.ఆర్. సుబ్రహ్మణ్యం శనివారం బాధ్యతలు స్వీకరించారు.
ఛత్తీస్‌గఢ్ కేడర్ కు చెందిన 1987 ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (భారతీయ పరిపాలనాధికారి) అఅయిన శ్రీ సుబ్రహ్మణ్యం గత మూడు దశాబ్దాలలో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జమ్ము& కాశ్మీర్‌లో ప్రముఖ బాధ్యతలను నిర్వహించడమే కాక ప్రపంచ బ్యాంకులో కూడా పని చేశారు. ఆయన వాణిజ్య & పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా, జమ్ము & కాశ్మీర్ ప్రధాన కార్యదర్శిగా, ఛత్తీస్‌గఢ్ ల ప్రధాన కార్యదర్శిగాను, ప్రధానమంత్రి కార్యాలయంలో బాధ్యతలను నిర్వహించారు.
భారత ప్రభుత్వ పబ్లిక్ పాలసీ థింక్ ట్యాంక్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ, గౌరవనీయ ప్రధానమంత్రి నాపై ఉంచి విశ్వాసం, బాధ్యతలను వినయపూర్వకంగా స్వీకరిస్తున్నాను, ఆయన అంచనాలకు తగ్గట్టుగా ఎదిగేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తానని, శ్రీ సుబ్రహ్మణ్యం అన్నారు.
****
(Release ID: 1902493)
Visitor Counter : 286