సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
'న్యూ దిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ 2023'లో పుస్తకాలు, జర్నల్‌ల బాండాగారాన్ని ప్రదర్శిస్తున్న 'పబ్లికేషన్స్ డివిజన్'
Posted On:
25 FEB 2023 5:03PM by PIB Hyderabad
2023 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు న్యూదిల్లీలోని ప్రగతి మైదాన్‌లో, 31వ 'న్యూ దిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్' జరుగుతోంది. భారత ప్రభుత్వ ప్రధాన ప్రచురణ సంస్థ అయిన 'పబ్లికేషన్స్ డివిజన్', తన బాండాగారంలోని పుస్తకాలు, పత్రికలను అక్కడ ప్రదర్శిస్తోంది.
కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పని చేసే పబ్లికేషన్స్ డివిజన్, న్యూదిల్లీలోని ప్రగతి మైదాన్‌లో 2023 ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5 వరకు జరుగుతున్న 31వ న్యూ దిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్‌లో పాల్గొంటోంది. ఈ 9 రోజుల భారీ ప్రదర్శనను కేంద్ర విద్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వతంత్ర సంస్థ నేషనల్ బుక్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. భారత వాణిజ్య ప్రచార సంస్థ సహకరిస్తోంది.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ స్ఫూర్తితో, భారత స్వాతంత్ర్య పోరాటం & స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రపై గొప్ప పుస్తకాలను పబ్లికేషన్స్ డివిజన్ ఈ ప్రదర్శనలో ఉంచుతోంది. ఇక్కడ కనిపించే పుస్తకాలు సందర్శకులు, పుస్తక ప్రియుల మనస్సులను దోచుకుంటాయి. ఈ ప్రదర్శనలో కళలు, సంస్కృతి, చరిత్ర, సినిమా, ప్రముఖ వ్యక్తులు &జీవిత చరిత్రలు, భూమి & ప్రజలు, గాంధేయ సాహిత్యం, బాలల సాహిత్యం వంటి అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి. పబ్లికేషన్స్ డివిజన్ ప్రత్యేకంగా ప్రచురించిన రాష్ట్రపతి భవన్, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రుల ప్రసంగాలను కూడా ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉన్నాయి.
పుస్తకాలతో పాటు, పబ్లికేషన్స్ డివిజన్‌కు చెందిన యోజన, కురుక్షేత్ర, ఆజ్‌కల్, బాల్ భారతి వంటి ప్రసిద్ధ జర్నల్‌లు కూడా స్టాల్స్‌లో అందుబాటులో ఉన్నాయి. డివిజన్ ప్రచురించిన జర్నల్‌లు, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్/రోజ్‌గార్ సమాచార్‌కు వార్షిక సభ్యత్వాలను కూడా ఇక్కడ కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేకంగా అందించే 'మన్ కీ బాత్' బుక్‌లెట్లను కూడా పబ్లికేషన్స్ డివిజన్ స్టాళ్ల నుంచి తీసుకోవచ్చు.
ప్రచురణల ప్రపంచం ఎక్కువగా ఎదురుచూసే కార్యక్రమాల్లో న్యూదిల్లీ వరల్డ్ బుక్ ఫెయిర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రచురణ సంస్థల భాగస్వామ్యాన్ని ఇది రాబడుతుంది. సందర్శకులు తమకు ఇష్టమైన పుస్తకాలను కొనుక్కోవడంతో పాటు, ఆథర్స్ కనెక్ట్, యువ కార్నర్, చైల్డ్ ఆథర్స్ కార్నర్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడ నిర్వహిస్తారు.
ప్రగతి మైదాన్ 5వ నంబర్ గదిలోని 171-186 వరకు ఉన్న స్టాళ్లలో తన పుస్తకాలు & జర్నల్‌లను పబ్లికేషన్స్ డివిజన్ ప్రదర్శిస్తోంది.
***
(Release ID: 1902486)
Visitor Counter : 143