గనుల మంత్రిత్వ శాఖ
మార్చి 1వ తేదీన 75 వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోనున్న ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్
Posted On:
25 FEB 2023 11:10AM by PIB Hyderabad
గనుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) 1 మార్చి 2023న నాగ్‌పూర్‌లో 75వ వ్యవస్థాపక దినోత్సవమైన ఖాంజి దివస్‌ను జరుపుకోనుంది. ఒక రోజు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కేంద్ర బొగ్గు, గనులు & పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి, బొగ్గు, గనులు & రైల్వేల మంత్రిత్వ శాఖ సహాయమంత్రి శ్రీ రావ్‌సాహెబ్ పాటిల్ దాన్వే ప్రసంగించనున్నారు. భారత మైనింగ్ రంగం సాధించిన పురోగతిని, ఇటీవలి చొరవలను పట్టి చూపే ప్రత్యేక ప్రదర్శనను మధ్యాహ్నానికి ముందు జరుగనున్న సాంకేతిక సెషన్‌లో భాగంగా గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ వివేక్ భరద్వాజ్ ప్రారంభించనున్నారు.
వ్యవస్థాపక దినోత్సవాలలో ఆర్థిక సంవత్సరం 2021-22 మూల్యాంకన సంవత్సరంలో నిలకడైన మైనింగ్ పద్ధతులను నిలకడగా పెంచిపోషించిన 76 ఫైవ్ స్టార్ట్ రేటింగ్ కలిగిన గనులకు సన్మానం, వివిధ మైనింగ్ కంపెనీల ప్రెజెంటేషన్లు, ఐబిఎంపై చలనచిత్ర ప్రదర్శన, తపాలా స్టాంపులు, సావనీర్ విడుదల వంటి కొన్ని ముఖ్యాంశాలు ఉండనున్నాయి.
జాతీయ ఖనిజ విధాన సదస్సు సూచనల ఆధారంగా ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (ఐబిఎం) 1 మార్చి, 1948లో ఉనికిలోకి వచ్చింది. కేవలం సలహా సంస్థగా చిన్న స్థాయిలో అవతరించిన ఐబిఎం క్రమంగా కొన్ని ఏళ్ళలో దేశ మైనింగ్, ఖనిజ పరిశ్రమకు సంబంధించిన వివిధ అంశాలను నిర్వహించే ప్రధాన జాతీయ సంస్థగా అవతరించడమే కాక, చట్టబద్ధమైన నిబంధనలను అమలు చేయడం, వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో నిమగ్నం కావడం వంటి ద్వంద్వ పాత్రను నెరవేరుస్తోంది.
***
(Release ID: 1902422)
Visitor Counter : 163