ఆర్థిక మంత్రిత్వ శాఖ

బెంగుళూరులో 1వ ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశానికి ముందు వినూత్న, స్థితిస్థాపకత, సమగ్ర వృద్ధి, సమర్థవంతమైన పాలన కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై ఉన్నత స్థాయి సింపోజియం

Posted On: 24 FEB 2023 11:43AM by PIB Hyderabad

జి20 ఇండియా ప్రెసిడెన్సీలో 1వ జి20 ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం నేపథ్యంలో, డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ)పై నిన్న సింపోజియం బెంగళూరులో జరిగింది.

 

ఈ సింపోజియంలో కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఇన్నోవేటివ్, రెసిలెంట్, ఇన్‌క్లూజివ్ గ్రోత్, ఎఫిషియెంట్ గవర్నెన్స్ కోసం డిపిఐ పై ప్యానెల్ చర్చలో పాల్గొన్నారు. రిపబ్లిక్ ఆఫ్ ఇండోనేషియా ఆర్థిక మంత్రి డా. శ్రీ ముల్యాని ఇంద్రావతి, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బ్రెజిల్ క్యాంపస్ నెటో గవర్నర్ రోబర్టో డి ఒలివేరా ; ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టెలీనా జార్జీవ, బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ జనరల్ మేనేజర్  అగస్టిన్ కార్స్టెన్స్. ప్రసంగించారు. 

 

ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి, ఆర్థిక మంత్రిత్వ శాఖ, జి20 ఫైనాన్స్ డిప్యూటీ శ్రీ అజయ్ సేథ్, ప్రముఖ ప్యానెలిస్ట్‌లను స్వాగతించారు. ఆర్థిక పరివర్తన, ఆర్థిక చేరిక, అభివృద్ధి కోసం డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారతదేశం జి20 టాస్క్‌ఫోర్స్ కో-ఛైర్ అయిన శ్రీ నందన్ నీలేకని, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏ ) మాజీ ఛైర్మన్ ఈ చర్చలను మోడరేట్ చేసారు.

***



(Release ID: 1902313) Visitor Counter : 119