వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

మూడు ఈ-వేలంల్లో 18.05 ల.మె.ట. గోధుమలు బహిరంగ మార్కెట్‌లో విక్రయం


వినియోగదార్లు, వాటాదార్ల ప్రయోజనాలను పరిరక్షించడానికి కట్టుబడిన కేంద్రం

Posted On: 24 FEB 2023 3:15PM by PIB Hyderabad

30 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలు విక్రయించడం ద్వారా దేశంలో సరఫరా పెంచాలని భారత ప్రభుత్వం 2023 జనవరి 25న నిర్ణయించిన తర్వాత, భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) బహిరంగ మార్కెట్‌లో 18.05 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను విక్రయించింది. దేశవ్యాప్తంగా పెరిగిన గోధుమలు, గోధుమపిండి ధరలను తగ్గించడం కోసం ఈ విక్రయాలు చేపట్టింది. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న దాదాపు 11 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను విజయవంతమైన బిడ్డర్లు ఇప్పటికే కొనుగోలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్న గోధుమలు, గోధుమపిండి ధరలను చల్లబరిచేందుకు దోహదం చేశాయి.

అన్ని వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది, దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా నిర్దిష్ట ధరలను తగ్గిస్తోంది. బహిరంగ మార్కెట్ విక్రయాల పథకం (ఓఎంఎస్‌ఎస్‌) కింద, అధిక రాయితీ గోధుమల విక్రయాల ప్రయోజనాన్ని వినియోగదార్లకు తగినంత బదిలీ చేస్తామని ఒక సమావేశంలో పిండి మిల్లర్లు, వ్యాపారులు హామీ ఇచ్చారు.

తన మూడో ఈ-వేలంలో 5.07 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను 23 రాష్ట్రాల్లో 620 ప్రాంతాల్లో 1269 బిడ్డర్లకు క్వింటాల్‌కు సగటు ధర రూ.2,2172 చొప్పున ఎఫ్‌సీఐ విక్రయించింది. మూడో వేలంలో, 2023 ఫిబ్రవరి 22న, 11.79 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను బహిరంగ మార్కెట్‌లో ఎఫ్‌సీఐ విక్రయించింది. ఫెయిర్ యావరేజ్ క్వాలిటీ (ఎఫ్‌ఏక్యూ) గోధుమలను క్వింటాల్‌కు సగటు ధర రూ.2,150, అండర్ రిలాక్స్‌డ్‌ స్పెసిఫికేషన్స్ (యూఆర్‌ఎస్‌) నాణ్యత గోధుమలను క్వింటాల్‌కు సగటు ధర రూ.2,125 చొప్పున విక్రయించింది.

గోధుమ లభ్యతను పెంచడానికి, వినియోగదార్ల ప్రయోజనాలను కాపాడే ప్రయత్నంలో భాగంగా ప్రతి బుధవారం, 15 మార్చి 2023 వరకు ఈ-వేలం ద్వారా గోధుమల బహిరంగ విక్రయం జరుగుతుంది.

మొదటి వేలం 2023 ఫిబ్రవరి 1, 2 తేదీల్లో నిర్వహించారు. దీనిలో 9.13 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను క్వింటాల్‌కు సగటు ధర రూ.2,474 చొప్పున 1016 మంది బిడ్డర్లకు విక్రయించారు. 15 ఫిబ్రవరి 2023న జరిగిన రెండో వేలంలో 3.85 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలను 1060 మంది బిడ్డర్లకు క్వింటాల్‌కు సగటు ధర రూ.2338 చొప్పున విక్రయించారు. పెరుగుతున్న గోధుమలు, గోధుమపిండి ధరలను నియంత్రించడానికి చిన్న, మధ్యతరహా వ్యాపారులు, మిల్లర్లు ఈ-వేలంలో చురుగ్గా పాల్గొన్నారు, ఎక్కువ మంది బిడ్డర్లు 100 మెట్రిక్‌ టన్నుల నుంచి 500 మెట్రిక్‌ టన్నుల పరిధిలో గోధుమలు కొనుగోలు చేశారు.

 

***



(Release ID: 1902307) Visitor Counter : 87