ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

స్కాన్ అండ్ షేర్ సర్వీస్ ద్వారా 365 ఆస్పత్రులలో సత్వర ఒపిడి రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పించిన ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్


5 లక్షల మందికి పైగా పేషెంట్లు ఈ సదుపాయాన్ని ఉపయోగించుకుని వరుసలో నిలబడవలసిన అవసరం లేకుండా ఒపిడి రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని ఉపయోగించుకున్నారు.

Posted On: 23 FEB 2023 4:20PM by PIB Hyderabad

జాతీయ ఆరోగ్య సంస్థ (ఎన్.హెచ్.ఎ) , ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ఎబిడిఎం) కింద సత్వరం, ఒపిడి రిజిస్ట్రేషన్ పొందేందుకు 2022 అక్టోబర్లో  స్కాన్ , షేర్ సర్వీసును ప్రారంభించింది.

దీనిని ప్రవేశపెట్టిన ఐదు నెలల లోపల , ఈ సర్వీసును 365 ఆస్పత్రులు అందిపుచ్చుకున్నాయి. క్యుఆర్ కోడ్  ఆధారిత సత్వర రిజిస్ట్రేషన్ సర్వీసును సుమారు 5 లక్షల మందికి పైగా రోగులు ఉపయోగించుకున్నారు.
దీని ద్వారా  ఔట్  పేషెంట్  విభాగంలో, స్కాన్,  షేర్ సదుపాయం కలిగిన ఆస్పత్రులలోని  ఒపిడి రిజిస్ట్రేషన్  ప్రాంతంలో , వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గింది.

 

 ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద , క్యూలేకుండా సత్వరం
ఒపిడి రిజిస్ట్రేషన్  పొందే సదుపాయం అందుబాటులోకి రావడాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి  అభినందించారు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్  చేశారు. ఈ క్యూ ఆర్  కోడ్ సదుపాయం కింద, ఇందులో పాల్గొనే ఆస్పత్రులు  పేషెంట్ రిజిస్ట్రేషన్ ప్రాంతంలో క్యు.ఆర్. కోడ్ ను ప్రదర్శిస్తాయి. దీనితో పేషెంట్లు క్యు.ఆర్. కోడ్ను తమ వద్ద గల ఎబిహెచ్ ఎ యాప్ లేదా ఆరోగ్య సేతు   యాప్ , ఎకా కేర్, డి.ఆర్.ఐ.ఇ.ఎఫ్ కేస్, బజాజ్ హెల్త్, పేటిఎం వంటి  యాప్ అప్లికేషన్లను  ఉపయోగించుకుని క్యు.ఆర్. కోడ్ ను  స్కాన్ చేసుకుని తమ ఎబిహెచ్ఎ ప్రొఫైల్ను షేర్  చేయవచ్చు.  పేరు, వయసు, స్త్రీ లేదా పురుషుడు, ఎబిహెచ్ ఎ సంఖ్య వంటి వివరాలను  ఆయా ఆస్పత్రుల హెల్త్  మేనేజ్ మెంట్
ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (హెచ్.ఎం.ఐ.ఎస్)  లో నమోదు చేయవచ్చు. దీనితో కాగిత రహిత రిజిస్ట్రేషన్  సదుపాయం , అప్పటికప్పుడే టోకన్ను పొందే వీలు ఉంటుంది. ఈ సదుపాయం వల్ల పేషెంట్కు తమ పేరు నమోదు చేసుకునే కౌంటర్ వద్ద వేచి ఉండాల్సిన అవసరం లేకుండా విలువైన సమయం ఆదా అవుతుంది. అలాగే ఆస్పత్రులు , ఔట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి వినియోగించే మానవ వనరులను మరింత సమర్ధంగా ఇతర పనులకు వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
పేషెంట్ ఆరోగ్య రికార్డులు డిజిటల్ రూపంలో వారి ఎ.బి.హెచ్.ఎ (ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్)కు డిజిటల్గా అనుసంధానం అవుతుంది. దీనిని వారు తమ ఫోన్  ద్వారా ఎప్పుడైనా , ఎక్కడి నుంచి అయినా   చూడవచ్చు.

ఇందుకు సంబంధించిన సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి వెనుక ఉన్న దార్శనికత  పై ఎన్.హెచ్. ఎ .  సిఇఒ మాట్లాడుతూ,  పేషెంట్లకు మెరుగైన సేవలను అందించేందుకు సాంకేతికత ను ఏ విధంగా మెరుగైన రీతిలో వాడుకోవచ్చో  స్కాన్ అండ్ షేర్ సేవ తెలియజేస్తున్నదని ఆయన అన్నారు. ఇది పేషెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ సమర్థను గణనీయంగా పెంచుతుందని అన్నారు.   దీని వినియోగం పెరిగే కోద్ది, ఖచ్చితమైన రీతిలో, ఎలాంటి ఇబ్బందులు లేకుండా  పేషెంట్ రిజిస్ట్రేషన్ వ్యవస్థ మరింత సులభతరంగా ఉంటుందని అన్నారు.  ఎడిబిఎం ఆధారిత డిజిటల్ ఆరోగ్య సేవల ప్రభావం గరిష్ఠంగా ఉండేందుకు దృష్టిపెట్టి స్టేక్ హోల్డర్లతో  కలసి పనిచేస్తున్నట్టు ఆయన తెలిపారు.

స్కాన్, అండ్  షేర్ కు సంబంధించిన  సేవలను దేశవ్యాప్తంగా పేషెంట్లు అందుకోవడానికి ఈ సదుపాయం వీలు కల్పిస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు  పలు ప్రైవేటు ఆస్పత్రులు కూడా ఎబిహెచ్ఎ ఆధారిత రిజిస్ట్రేషన్ సదుపాయాన్ని తమ పేషెంట్లకు అందుబాటులోకి తెస్తున్నాయి.  ఈ సర్వీసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 125 జిల్లాలలో అందుబాటులో ఉంది.  కర్ణాటకలో (2.5 లక్షల టోకన్లు జారీకాగా, ఉత్తరప్రదేశ్ లో 1.1 లక్ష మంది దీనిని ఉపయోగిస్తున్నారు. ఢిల్లీలో 72 వేల మంది వాడుతున్నారు.  ఈ రాష్ట్రాలు స్కాన్ అండ్ షేర్ సదుపాయాన్ని పెషెంట్లకు అందుబాటులోకి తెచ్చిన రాష్ట్రాలలో అగ్రభాగాన ఉన్నాయి. ఇందుకు సంబంధించి ఆయా రాష్ట్రాల గణాంకాల ను https://abdm.gov.in/scan-share లో చూడవచ్చు.

ఈ వారం ప్రారంభం నాటికి ఎన్.హెచ్.ఎ. మరో మైలు రాయిని కూడా అధిగమించింది. ఇది ఆస్పత్రులు, క్లినిక్లు, డయాగ్నస్టిక్ లేబరెటరీలు, ఇమేజింగ్ సెంటర్లు, ఫార్మసీ, తదితరాలకు సంబంధించి
రెండు లక్షల ఆరోగ్య సదుపాయాలను హెల్త్ ఫెసిలిటీ రిజిస్ట్రీ (హెచ్. ఎఫ్. ఆర్) వద్ద రిజిస్టర్ చేసింది.
హెచ్.ఎఫ్.ఆర్ అనేది ఎడిబిఎం కు సంబంధించి  దేశవ్యాప్తంగా గల ఆయా ఆరోగ్య సంస్థల వాస్తవ సమాచారాన్ని అందజేసేది.  దీనిద్వారా ఆయా ఆరోగ్య సంస్థలు, సేవలకు సంబంధించి విశ్వసనీయమైన సమాచారాన్ని పొందడానికి వీలు కలుగుతుంది.
దీనిని ఈ లింక్ పై పొందవచ్చు. https://facility.abdm.gov.in/.  సరిచూసిన సంస్థలలో 75 శాతం సంస్థలు ప్రభుత్వ రంగ సంస్థలు. హెచ్.ఎఫ్.ఆర్ లో నమోదైన సంస్థలకు సంబంధించి కర్ణాటక (46,179), ఉత్తరప్రదేశ్ (31,417)
  మహారాష్ట్ర ( 13,789), ఆంధ్రప్రదేశ్ (13,345)లు అగ్రభాగాన ఉన్నాయి.  మరిన్ని గణాంకాలు  https://dashboard.abdm.gov.in/abdm/ ఈ లింక్ పైచూడవచ్చు.

***

 


(Release ID: 1901964) Visitor Counter : 223