శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

క్లీన్ ఎనర్జీ రంగంలో ఫ్రాన్స్‌తో మరింత సహకారం కోసం పిలుపునిచ్చిన భారత్; ఈవీ లు హైడ్రోజన్ శక్తి, గ్రీన్ ట్రాన్సిషన్ గా మార్చేందుకు న్యూ ఢిల్లీ ప్రణాళికల ప్రధాన ప్రస్తావన


న్యూ ఢిల్లీలోని సిఎస్ఐఆర్ – నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ (ఇన్ఫినిట్) పై
ఇండో-ఫ్రెంచ్ వర్క్‌షాప్‌ను ప్రారంభించిన కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్

సౌర విద్యుత్ ఉత్పత్తికి థార్ ఎడారిని ఉపయోగించడం ద్వారా, భారతదేశం 2,100 గిగావాట్లు వరకు
సౌర శక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా : డాక్టర్ ఎస్ చంద్రశేఖర్

గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, నిల్వ, మార్పిడి, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా శక్తి నిల్వ
మౌలిక సదుపాయాల కోసం ఫ్రాన్స్, ఇతర G20 దేశాలతో భాగస్వామ్యం అవసరం: డా. ఎన్. కలైసెల్వి

Posted On: 23 FEB 2023 8:56AM by PIB Hyderabad

క్లీన్ ఎనర్జీ రంగంలో ఫ్రాన్స్‌తో మరింత సహకారం కోసం భారతదేశం పిలుపునిచ్చింది. ఈవీలు, హైడ్రోజన్ శక్తికి గ్రీన్ ట్రాన్సిషన్ కోసం న్యూ ఢిల్లీ ప్రణాళికలను ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన పునరుత్పాదక ఇంధన రంగాల జాబితాలో భారతీయ పునరుత్పాదక రంగం 4వ స్థానంలో ఉంది. దేశంలో పునరుత్పాదక శక్తికి సౌరశక్తి అత్యంత సమృద్ధిగా ఉంది.

న్యూఢిల్లీలోని సిఎస్ఐఆర్ - నేషనల్ ఫిజికల్ లాబొరేటరీలో క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీస్ (ఇన్ఫినిటీ)పై ఇండో-ఫ్రెంచ్ వర్క్‌షాప్‌ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎస్.చంద్రశేఖర్ ప్రారంభించారు.  2022లో ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 100 GW సౌరశక్తి స్థాపిత సామర్ధ్యాన్ని 100 గిగావాట్ లు సాధించాలని 2022లో లక్ష్యంగా పెట్టినట్టు తెలిపారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి థార్ ఎడారిని ఉపయోగించడం ద్వారా భారతదేశం 2,100 జిడబ్ల్యూ  వరకు సౌరశక్తిని ఉత్పత్తి చేస్తుందని అంచనా వేస్తోంది.

 

డాక్టర్ చంద్రశేఖర్ ప్రభుత్వం మరొక చొరవ  జాతీయ జీవ ఇంధన విధానంను ప్రస్తావించారు. ఇది 2030 నాటికి పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20%,  డీజిల్‌లో 5% బయోడీజిల్‌ను మిశ్రమం చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

కార్బన్ క్యాప్చర్, స్టోరేజీపై దృష్టి సారించాలని డాక్టర్ చంద్రశేఖర్ స్పష్టం చేశారు. నీతి ఆయోగ్ అంచనా ప్రకారం  క్షీణించిన చమురు, గ్యాస్ నిక్షేపాలు, తవ్వకాలు చేయలేని బొగ్గు గనులను పరిగణనలోకి తీసుకుంటే భారతదేశం మొత్తం భౌగోళిక కార్బన్ డైయాక్సయిడ్ నిల్వ సామర్థ్యాన్ని 400-600 జీ టీ  కలిగి ఉంది. పునరుత్పాదక ఇంధన మార్కెట్‌లో దేశాన్ని వేగంగా వృద్ధి చేయడానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రభుత్వం విధానాలు, కార్యక్రమాలు, ఉదారవాద వాతావరణాన్ని రూపొందించిందని ఆయన అన్నారు. క్లీన్ ఎనర్జీ రీసెర్చ్‌పై అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించడంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కూడా ఆసక్తిగా ఉంది. "ఈ వర్క్‌షాప్‌లో చర్చించే ప్రక్రియ, సాంకేతికతలు వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించడంలో, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో అపారమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని ఆశిస్తున్నట్టు సెక్రటరీ వివరించారు. 

 

ఆమె ప్రసంగంలో, సిఎస్ఐఆర్, సెక్రటరీ డిఎస్ఐఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎన్.కలై సెల్వి మాట్లాడుతూ, పునరుత్పాదక ఇంధన సాంకేతికతలు  మౌలిక సదుపాయాల తయారీలో భారతదేశానికి భారీ వృద్ధి అవసరమని అన్నారు. గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి, నిల్వ, మార్పిడి, ముఖ్యంగా గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా మరియు శక్తి నిల్వ మౌలిక సదుపాయాల కోసం ఫ్రాన్స్, ఇతర జి20 దేశాలతో భాగస్వామ్యం అవసరమని ఆమె నొక్కి చెప్పారు. స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధనాలపై పరిశోధనలను పెంపొందించడానికి ప్రత్యేకంగా భారతదేశం, ఫ్రాన్స్ దీర్ఘకాల ద్వైపాక్షిక పరిశోధన సహకారాన్ని కలిగి ఉన్నాయని ఆమె తెలిపారు.

 ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సిఎన్ఆర్ఎస్) సీఈఓ ఆంటోయిన్ పెటిట్ రెండు దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాన్ని ప్రశంసించారు. కొత్త ద్వైపాక్షిక కార్యక్రమాల ద్వారా స్థిరమైన శక్తి పరివర్తనను సాధించడంలో సహకారం ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ రంగంలో సహకారాన్ని అభివృద్ధి చేయడానికి ఫ్రాన్స్, భారతదేశానికి చెందిన విద్యా, పారిశ్రామిక నిపుణులను ఒకచోట చేర్చేందుకు ఈ వర్క్‌షాప్ విస్తృతంగా దృష్టి సారించిందని సిఎస్ఐఆర్-సిఐఎంఎఫ్ఆర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అరవింద్ కుమార్ మిశ్రా సూచించారు. రెండు వైపులా నిర్దిష్ట పరిశోధన సమస్యలు, లక్ష్యాలను గుర్తించాలని, బయోమాస్ ఎనర్జీ, బొగ్గు నుండి మిథనాల్/క్లీన్ ఇంధనాలు, సౌరశక్తి, హైడ్రోజన్, శక్తి నిల్వ, కొత్త జ్ఞాన స్థావరాలు, ఉమ్మడి ఐపీ లు, ప్రత్యక్ష ఫలితాలను అభివృద్ధి చేయడానికి భాగస్వాములను గుర్తించాలని ఆయన అన్నారు. కార్బన్ క్యాప్చర్ వినియోగం, నిల్వ. మనం మన అనుభవాలను పంచుకోవాలి, కొత్త ఆలోచనలను అన్వేషించాలి,  విభిన్నంగా ఆలోచించేలా మనల్ని మనం సవాలు చేసుకోవాలి అని అభిప్రాయపడ్డారు. 

 

క్లీన్ అండ్ సస్టైనబుల్ ఎనర్జీ టెక్నాలజీల అభివృద్ధి, విస్తరణపై జ్ఞానం, ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలను పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఇరు దేశాల నిపుణులు, పరిశోధకులు, విధాన నిర్ణేతలు, పరిశ్రమల నాయకులను ఒకచోట చేర్చుకోవడం ఈ వర్క్‌షాప్ లక్ష్యం. వర్క్‌షాప్‌లో సౌరశక్తి, హైడ్రోజన్ శక్తి, కార్బన్ క్యాప్చర్ యుటిలైజేషన్, స్టోరేజ్, ఎలక్ట్రోకెమికల్ ఎనర్జీ స్టోరేజ్, క్లీన్ ఫ్యూయెల్స్‌కు సంబంధించిన వివిధ అంశాలపై అనేక రకాల ప్రెజెంటేషన్లు, చర్చలు ఉంటాయి.

ధన్‌బాద్‌లోని సిఎస్ఐఆర్ – సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మైనింగ్ అండ్ ఫ్యూయల్ రీసెర్చ్ (సిఐఎంఎఫ్ఆర్), ఫ్రాన్స్‌లోని ఫ్రెంచ్ నేషనల్ సెంటర్ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్ (సిఎన్ఆర్ఎస్) సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇందుకు ఇండో-ఫ్రెంచ్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ మద్దతు ఇస్తోంది. .

సిఎస్ఐఆర్  – ఎన్పిఎల్ డైరెక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ ఆచంట ఆహూతులకు స్వాగతం పలికారు.  సిఎస్ఐఆర్- సిఐఎంఎఫ్ఆర్  డైరెక్టర్ ప్రొఫెసర్ అరవింద్ కె. మిశ్రా ప్రారంభ వ్యాఖ్యలు చేశారు. వర్క్‌షాప్‌కు ముందు, 

ఇన్ఫినిటే వర్క్‌షాప్ రెండు దేశాల నిపుణులు, వాటాదారులకు ఆలోచనా మార్పిడి చేసుకోవడానికి, సహకార రంగాలను గుర్తించడానికి,  స్వచ్ఛమైన స్థిరమైన ఇంధన సాంకేతికత రంగంలో సహకారం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికి ఒక వేదికను అందిస్తుంది. ద్వైపాక్షిక వర్క్‌షాప్‌ను సిఎస్ఐఆర్ – సిఐఎంఎఫ్ఆర్ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ డా. ఆర్. ఎబిన్ మాస్టో, డాక్టర్ అబ్దేలిలా స్లౌయి, డిప్యూటీ రీసెర్చ్ డైరెక్టర్ ఇంచార్జ్ ఆఫ్ ఎనర్జీ, సిఎన్ఆర్ఎస్ , ఫ్రాన్స్ సమన్వయం చేస్తున్నారు..

 

<><><><><>



(Release ID: 1901731) Visitor Counter : 129