మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జార్ఖండ్‌లోని బొకారోలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చిన నమూనాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1)ని గుర్తించిన ఐసిఏఆర్ -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్

Posted On: 23 FEB 2023 10:32AM by PIB Hyderabad

 

 

 

1. ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా  నివారణ, నియంత్రణ, కట్టడి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (2021) ప్రకారం చర్యలు అమలు చేయాలని రాష్ట్రానికి సూచన 

2. సంహరించడానికి అవసరమైన పీపీఈ ఇతర సౌకర్యాలను తగినంత సంఖ్యలో సిద్ధం చేసుకోవాలని సూచనలు జారీ 

3. నివారణ, కట్టడి చర్యలు అమలు చేయడానికి రాష్ట్రానికి ఇద్దరు సభ్యుల కేంద్ర  బృందాన్ని పంపిన పశుసంవర్ధక శాఖ 

4. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని సమీక్షిస్తున్న  పశుసంవర్ధక శాఖ  

 

పరీక్షల నిమిత్తం 17 ఫిబ్రవరి 2022న జార్ఖండ్‌లోని బొకారోలోని ప్రభుత్వ పౌల్ట్రీ ఫామ్ నుంచి వచ్చిన ఒక  నమూనాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా (H5N1)ను ఐసిఏఆర్ -నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ . దీనికి సంబంధించి  202 ఫిబ్రవరి 20న  నోటిఫికేషన్‌ను జారీ చేసింది. జనవరి 2019లో ఆఖరిసారిగా  జార్ఖండ్‌లోని గొడ్డా జిల్లాలో ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా నమోదయ్యింది. 

ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా  నివారణ, నియంత్రణ, కట్టడి కోసం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక (2021) ప్రకారం చర్యలు అమలు చేయాలని రాష్ట్రానికి సూచనలు జారీ అయ్యాయి. నివారణ, కట్టడి చర్యలు అమలు చేయడానికి పశుసంవర్ధక శాఖ రాష్ట్రానికి ఇద్దరు సభ్యుల కేంద్ర  బృందాన్ని పంపింది. ప్రజలకు  వ్యాధి సోకకుండా చూడడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపింది.    

 జార్ఖండ్ రాష్ట్ర  పశుసంవర్ధక శాఖ కార్యదర్శితో కేంద్ర పశుసంవర్ధక శాఖ ప్రధాన కార్యదర్శి టెలిఫోన్ లో మాట్లాడి తాజా పరిస్థితి వివరాలు తెలుసుకున్నారు.  వ్యాధి నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి  సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖల అధికారులతో పశుసంవర్ధక కమిషనర్  చర్చించారు.  వ్యాధి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా సమర్థవంతమైన నియంత్రణ చర్యలు అమలు చేయాలని  సూచించారు. కార్యాచరణ ప్రణాళిక  ప్రకారం నియంత్రణ మరియు నియంత్రణ చర్యలను ప్రారంభించే ముందు పరిస్థితిపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని జార్ఖండ్ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సంబంధిత అధికారులతో వర్చువల్ విధానంలో నిర్వహించిన సమావేశంలో  కోసం పశుసంవర్ధక కమిషనర్ సూచించారు.

కార్యాచరణ ప్రకారం సంహరించే పౌల్ట్రీ పక్షులు, తొలగించిన గుడ్లు, పారవేసి పశు దాణాకు తగిన నష్టపరిహారం అందిస్తారు. పశుసంవర్ధక,పాడి పరిశ్రమ శాఖ, కేంద్ర ప్రభుత్వం ఏఎస్ సిఎడి లోని  ఎల్ హెచ్,డీసీపీ పథకం కింద భారత ప్రభుత్వం రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు  50:50 నిష్పత్తిలో  నిధులు అందిస్తుంది.

సంహరించడానికి అవసరమైన పీపీఈ ఇతర సౌకర్యాలను తగినంత సంఖ్యలో సిద్ధం చేసుకోవాలని రాష్ట్రానికి సూచనలు జారీ అయ్యాయి. ఆరోగ్యం, అటవీ శాఖల సిబ్బందికి  ఏవియన్ ఇన్ఫ్లుఎంజా గురించి  అవగాహన కల్పించాలని రాష్ట్రానికి సూచనలు జారీ చేశారు.అమలు చేస్తున్న  నియంత్రణ చర్యలపై ఈ విభాగానికి రోజువారీ నివేదిక సమర్పించాలని రాష్ట్రాన్ని కేంద్రం కోరింది. 

 రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న పశుసంవర్ధక విభాగం  పరిస్థితిపై నిరంతరం నిఘా ఉంచుతోంది.

 

***

 

 


(Release ID: 1901669)
Read this release in: English , Urdu , Hindi , Tamil