గణాంకాలు- కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ
ఎంపీలాడ్స్, 2023పై సవరించిన మార్గదర్శకాలను విడుదల చేసిన స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్
ఎంపీలాడ్స్ కింద నిధుల వినియోగంపై సవరించిన విధానాల కొత్త వెబ్ పోర్టల్‌ను కూడా ప్రారంభించిన
మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్ .
Posted On:
22 FEB 2023 5:51PM by PIB Hyderabad
స్టాటిస్టిక్స్, ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ (ఎంఓఎస్పిఐ) సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) రావు ఇంద్రజిత్ సింగ్ ఫిబ్రవరి 22న పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం (ఎంపీలాడ్స్)-2023పై సవరించిన మార్గదర్శకాలను విడుదల చేశారు. మంత్రి ఎంపీలాడ్స్ కింద నిధుల వినియోగంపై సవరించిన విధానాల అమలు కోసం కొత్త వెబ్-పోర్టల్‌ను ప్రారంభించారు. కొత్త ఎంపీలాడ్స్ మార్గదర్శకాలు, వెబ్ పోర్టల్ 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నుండి అమలులోకి వస్తాయి.
స్థానిక అవసరాల ఆధారంగా నాణ్యమైన మెరుగైన సామజిక సంపదను సృష్టించడానికి ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి సంబంధమైన పనులను సిఫార్సు చేసేందుకు గౌరవనీయులైన పార్లమెంటు సభ్యులకు వీలు కల్పించడం ఎంపీలాడ్స్ పథకం లక్ష్యం. సవరించిన మార్గదర్శకాలు, మారుతున్న అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులను సిఫార్సు చేయడానికి గౌరవ ఎంపీలు ప్రారంభించేందుకు వీలుగా పథకం పరిధిని విస్తృతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది; ఎంపీ లాడ్ పథకం పనితీరు, అమలు, పర్యవేక్షణను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది.
సవరించిన ఎంపీ లాడ్స్ మార్గదర్శకాలు, వెబ్-పోర్టల్‌ను ప్రారంభించడంతోపాటు, ఎంఓఎస్పిఐ ద్వారా 22-23 ఫిబ్రవరి 2023న కాన్స్‌టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీలో రెండు రోజుల సదస్సు నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారుల కోసం వెబ్ పోర్టల్ పాత్ర-ఆధారిత లక్షణాల పై శిక్షణ ఇస్తారు.
***
(Release ID: 1901624)
Visitor Counter : 210