వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వెస్ట్రన్ మరియు సెంట్రల్ జోన్ కోసం గోవాలో జరిగిన PM గతిశక్తి ప్రాంతీయ వర్క్‌షాప్


ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఉత్పత్తి - ఉపాధి & వృద్ధిని పెంచే విధంగా PM గతిశక్తి యొక్క ప్రభావవంతమైన అమలు చక్రాన్ని ప్రారంభిస్తుంది: సెక్రటరీ, పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ

Posted On: 20 FEB 2023 5:00PM by PIB Hyderabad

వెస్ట్రన్ మరియు సెంట్రల్ జోన్‌కు సంబంధించిన మొదటి ప్రధాన మంత్రి గతిశక్తి ప్రాంతీయ వర్క్‌షాప్ ఈరోజు గోవాలో జరిగింది. ఈ వర్క్‌షాప్‌లో ప్రణాళిక కోసం కేంద్ర మంత్రిత్వ శాఖలు రాష్ట్ర శాఖలు జాతీయ మాస్టర్ ప్లాన్ (NMP) స్వీకరిస్తే కలిగే ఉపయోగకర కేసులపై చర్చలు జరిగాయి. అలాగే రాష్ట్రాలు మరియు కేంద్ర మంత్రిత్వ శాఖలు/విభాగాల మధ్య పరస్పర అభ్యాసానికి వేదికగా ఈ సందర్భం పని చేసింది. కేంద్ర వాణిజ్యపరిశ్రమల మంత్రిత్వ శాఖ (డిపిఐఐటి) పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డిపిఐఐటి) ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా మరియు గుజరాత్మహారాష్ట్రగోవాఛత్తీస్‌గఢ్ మరియు మధ్యప్రదేశ్‌లోని కేంద్ర మంత్రిత్వ శాఖలు మరియు రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వర్క్‌షాప్‌ను ఉద్దేశించి డిపిఐఐటి కార్యదర్శి అనురాగ్ జైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూపిఎం గతిశక్తి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడంఉత్పత్తిఉపాధి మరియు వృద్ధిని పెంచే ప్రభావవంతమైన అమలు విధానాన్ని ప్రారంభిస్తుందని అన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు గతిశక్తి ఎన్‌ఎంపీని ప్రారంభించామని ఆయన తెలిపారు. సామాన్యులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు మూలకారణం స్థూల స్థాయి ప్రణాళిక మరియు మైక్రో లెవెల్‌లో దాని అమలు మధ్య గల విపరీతమైన డిస్‌కనెక్ట్ అని అన్నారు. అలాగే దానిని పరిష్కరించే దిశగా గతిశక్తి NMP ఒక పెద్ద ముందడుగు వేసింది అని ఆయన పేర్కొన్నారు. ఈ వేదిక ద్వారా సమీకృత ప్రణాళికసమకాలీకరణ అమలు మరియు అవస్థాపనఆర్థిక మరియు సామాజిక రంగ ప్రాజెక్టులు/పథకాల పర్యవేక్షణను నిర్ధారించడానికి సినర్జీలను నిర్మించవచ్చని కార్యదర్శి అనురాగ్ జైన్ తెలిపారు.

అక్టోబర్ 132021న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ PM గతిశక్తిని ప్రారంభించినప్పటి నుండినేషనల్ లాజిస్టిక్స్ పాలసీని ప్రారంభించడం వంటి అనేక మైలురాళ్లను సాధించామని DPIIT ప్రత్యేక కార్యదర్శి సుమితా దావ్రా చెప్పుకొచ్చారు. PM GatiShakti NMP కింద సాధించిన పురోగతిని గమనిస్తూనేటికి 1300కి పైగా లేయర్‌లు అప్‌లోడ్ అయ్యాయని అన్నారు. కేంద్ర మంత్రిత్వ శాఖల యొక్క 30 వ్యక్తిగత పోర్టల్‌లు మరియు 36 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల రాష్ట్ర మాస్టర్ ప్లాన్ పోర్టల్‌లు కూడా అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు.

కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మరియు కేంద్ర కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖల నోడల్ అధికారులు కూడా ప్రాజెక్ట్ ప్రణాళికలో తమ మెరుగైన అనుభవాలను PM గతిశక్తితో పంచుకున్నారు. సుస్థిర నగరాలను రూపొందించడంలో సిటీ లాజిస్టిక్స్ ప్లాన్ యొక్క ప్రాముఖ్యతపైఆర్థిక కార్యకలాపాల సమగ్ర ప్రణాళిక మరియు సామాజిక రంగ ప్రణాళికలో PM గతిశక్తి యొక్క వినియోగ సందర్భాలు మరియు ఉత్తమ అభ్యాసాల ప్రదర్శనతో సహా PMGలో నమోదు చేసిన రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన ప్రాజెక్టులు.. వంటి అనేక సెషన్‌లను కూడా ఈ రోజు నిర్వహించడం జరిగింది.

 

****

 

(Release ID: 1901041) Visitor Counter : 191