కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
డిజిటల్ అనుసంధానత ఆధారంగా భవనాలు లేదా ప్రాంతాలకు రేటింగ్ అన్న అంశంపై తన సూచనలను విడుదల చేసిన ట్రాయ్
Posted On:
20 FEB 2023 4:25PM by PIB Hyderabad
డిజిటల్ అనుసంధానం కోసం భవనాలు లేదా ప్రాంతాల రేటింగ్ లపై సోమవారం టెలికాం రెగ్యులటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (టిఆర్ఎఐ - ట్రాయ్) సూచనలను విడుదల చేసింది.
గత దశాబ్దంలో డిజిటీకరణలో జరిగిన గణనీయ వృద్ధి ఆర్ధిక వ్యవస్థను, ఆవిష్కరణలను, సైన్సును, విద్య. ఆరోగ్యం, పాలన, జీవన శైలులు, స్థిరతతో సహా ప్రపంచంలో అన్నింటినీ ప్రభావితం చేసి విప్లవీకరించింది. డిజిటల్ సాంకేతికతలు వ్యాపార నమూనాలను, సంస్థలను, సమాజాన్ని ప్రధానంగా మారుస్తున్నాయి. ఇటీవలి సంవత్సరాలలో డిజిటల్ అనుసంధానతకు అనేక రెట్లు పెరిగింది, ముఖ్యంగా కోవిడ్-19 అన్ని వర్గాల ప్రజలు నుంచి వారు ఉన్న ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ వేగాన్ని ఉధృతం చేసింది.
గతంలో టెలికాం అనుసంధానత డిమాండ్లను నెరవేర్చడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్), ప్రభుత్వం వివిధ విధాన కార్యక్రమాలను చేపట్టాయి. ఈ విధాన చొరవలు అనుసంధానతను మెరుగుపరచడంలో సహాయపడ్డాయి, ఫలితంగా విస్తృత కవరేజ్, అధిక డాటా అందుబాటు వచ్చాయి.
అయితే, ఈ కృషి అంతా ఇప్పుడు ఎక్కడ నుంచైనా, ఏ సమయంలోనైనా పని చేయడానికి ఇష్టపడే వినియోగదారులకు కావలసిన స్థాయి డిజిటల్ అనుసంధానత అనుభవాన్ని అందించడంలో తగ్గింది. 5జి నెట్‌వర్క్‌ను ప్రవేశపెట్టడం అన్నది 5జి సేవలను ప్రత్యేకంగా భవనాల లోపం నిరాటంక అనుభవాన్ని అందించాల్సిన అవసరానికి మరింత ప్రేరణను ఇచ్చింది.
అనుసంధానత నాణ్యతను, అనుసంధానతను కల్పించడంలో సవాళ్ళు, ముందుకు మార్గాన్ని అంచనా వేసేందుకు ట్రాయ్ అనేక అధ్యయనాలను చేపట్టింది. ఈ అధ్యయనాల ఆధారంగా ట్రాయ్ క్వెస్ట్ ఫర్ ఎ గుడ్ క్వాలిటీ నెట్‌వర్క్ ఇన్‌సైడ్ మల్టీ స్టోరీ రెసిడెన్షియల్ అపార్ట్ మెంట్స్ః రీ ఇమాజినింగ్ వేస్ టు ఇంప్రూవ్ క్వాలిటీ (బహుళ అంతస్తుల భవనాలలో నాణ్యత కలిగిన నెట్‌వర్క్‌ను కల్పించడం కోసం అన్వేషనః నాణ్యతను మెరుగుపరచేందుకు మార్గాల పునఃకల్పన) అన్న శీర్షికతో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది.
పైన పేర్కొన్న దాని ఆధారంగా, డిజిట్ అనుసంధానత మౌలిక సదుపాయాలు అన్ని అభివృద్ధి కార్యకలాపాలలో భాగమయ్యేందుకు ఒక చట్రాన్ని అందించేందుకు సూవో మోటో ప్రాతిపదికన ట్రాయ్ సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. డిజిటల్ అనుసంధానత కోసం భవనాలు లేదా ప్రాంతాల రేటింగ్ అన్న శీర్షికతో భాగస్వాములందరి నుంచీ ఇందులో లేవనెత్తిన అంశాలపై 07 జులై 2022 నాటికి ఇన్‌పుట్లను కోరుతూ ట్రాయ్ 25 మార్చి, 2022న సంప్రదింపుల పత్రాన్ని (సిపి) జారీ చేసింది.
వారికి వచ్చిన అభిప్రాయాలు, బహిరంగ చర్చల సందర్భంగా భాగస్వాములు నిర్వహించిన చర్చలు, విశ్లేషణలతో, డిజిటల్ అనుసంధానం కోసం భవనాలు లేదా ప్రాంతాల రేటింగ్ పై ట్రాయ్ సూచనలను ఖరారు చేశారు. నీరు, విద్యుత్ లేదా అగ్నిమాపక భద్రతా వ్యవస్థ వంటి ఇతర భవన సేవల మాదిరిగానే నిర్మాణ అభివృద్ధి ప్రణాళికలో అంతర్భాగంగా డిజిటల్ అనుసంధానత మౌలిక సదుపాయాల (డిసిఐ) కోసం పర్యావరణ వ్యవస్థను కల్పించడంపై చట్రాన్ని అందించడానికి ఈ సిఫార్సులు ప్రాధాన్యతను ఇచ్చాయి. ఆస్తుల నిర్వాహకులు (స్వంతదారులు లేదా అభివృద్ధి చేసేవారు లేదా బిల్డర్లు తదితరులు), సేవలను అందించేవారు, మౌలిక సదుపాయాలను అందించే వారు, డిసిఐ ప్రొఫెషనళ్ళు, వివిధ పట్టణ/ స్థానిక సంస్థల అధకారులు సహా వివిధ వాటాదారుల మధ్య సహకార సమన్వయాల ద్వారా భవన నిర్మణరంగంతో కలిసి డిసిఐని సహరూకల్పన, కలిసి సృష్టించాలి. ఈ చట్రం యువ వృత్తిపనివారు డిసిఐ వృత్తిపనివారు అయ్యేందుకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడమే కాక డిజిటల్ అనుసంధానత మౌలిక సదుపాయల రూపకల్పన, విస్తరణ, మూల్యాంకనంలో భాగం అయ్యే అవకాశాన్ని ఇస్తుంది.
గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌యుఎ) పరిధిలోని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ ఆర్గనైజేషన్ (టిసిపిఒ) జారీ చేసిన మోడల్ బిల్డింగ్ బైలాస్, 2016 కి అనుబంధంగా భవనాలలో డిజిటల్ అనుసంధానత మౌలిక సదుపాయాలు అన్న శీర్షికతో అధ్యయాన్ని చేర్చడం ద్వారాఎంబిబిఎల్‌లో ప్రస్తుతమున్న అంశాలను మార్పులు చేయాలని, తాజాపరచాలని ట్రాయ్ ప్రతిపాదించింది.
ఆస్తుల నిర్వాహకులు (డెవలపర్లు, బిల్డర్లు తదితరులు) భవనాలలో అభివృద్ధి చేసిన డిజిటల్ అనుసంధానత మౌలిక సదుపాయాలు(డిసిఐ) అందరు సేవలను అందించేవారికీ న్యాయమైన, పారదర్శకమైన, వివక్షత లేని, ఛార్జ్ చేయలేని ప్రాతిపదికన అందుబాటుల ఉండాలని ట్రాయ్ నొక్కి చెప్పింది.
డిజిటల్ అనుసంధానత పై భవనాల రేటింగ్ కోసం చట్రాన్ని అభివృద్ధి చేయడం సహా ఈ సూచనలు ఉన్నాయి. కాగా, రేటింగ్ సర్టిఫికేషన్ జారీ చేయడం సహా భవనాల రేటింగ్‌పై తగిన నియంత్రణా చట్రాన్ని ట్రాయ్ విడిగా విడుదల చేయనుంది.
డిజిటల్ అనుసంధానత కోసం భవనాలు లేదా ప్రాంతాల రేటింగ్ పై ట్రాయ్ చేసిన సూచనలలో ముఖ్యాంశాలను ఈ ప్రతికా ప్రకటనలో అనెక్చర్ -1 పేరుతో జోడించడం జరిగింది.
ఈ సూచనలను ట్రాయ్ వెబ్‌సైట్ www.trai.gov.inలో ఉంచడం జరిగింది. ఏదైనా స్పష్టీకరణ/ సమాచారం కోసం ట్రాయ్ సలహాదారు (క్యూఒఎస్-1) శ్రీ తేజ్‌పాల్ సింగ్‌ను adv-qos1@trai.gov.in అన్న ఇమెయిల్ ద్వారా లేదా +91-11-2323-3602 అన్న టెలిఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించవచ్చు.
***
(Release ID: 1901039)
Visitor Counter : 165