కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
శంషాబాద్ (తెలంగాణ), కర్నూలు (ఆంధ్రప్రదేశ్), బెళగావి (కర్ణాటక), బారామతి(మహారాష్ట్ర), కిషన్ గఢ్, అజ్మీర్ (రాజస్థాన్), బాలాసోర్ (ఒడిశా), గ్రేటర్ నోయిడా(ఉత్తరప్రదేశ్)లలో ఇ ఎస్ ఐ సి కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి భూపేందర్యాదవ్ ప్రకటన
ఈశాన్య రాష్ట్రాలు, సిక్కిం రాష్ట్రానికి ఇఎస్ఐ పథకాన్ని అమలు చేయడంలో ఇ ఎస్ఐ సి ఆర్థిక మద్దతు కొనసాగిస్తుంది: 'యాక్ట్ ఈస్ట్'కు ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపునుముందుకు తీసుకు వెడతాము: శ్రీ యాదవ్
प्रविष्टि तिथि:
20 FEB 2023 4:54PM by PIB Hyderabad
కేంద్ర కార్మిక, ఉపాధి, పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ అధ్యక్షతన చండీగఢ్ లో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) 190వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కార్మిక, ఉపాధి, పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి రామేశ్వర్ తేలి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనికతను మరింత ముందుకు తీసుకెళ్తూ, శ్రమజీవులకు సామాజిక భద్రతను పటిష్ఠం చేయడంపై శ్రీ యాదవ్ 190వ ఈఎస్ఐ కార్పొరేషన్ సమావేశంలో పలు నిర్ణయాలను ప్రకటించారు.
కార్మికుల సంఖ్య పెరుగుదలను పరిగణనలోకి తీసుకున్న ఈఎస్ఐ కార్పొరేషన్ ఈ సమావేశంలో - బెళగావి (కర్ణాటక), శంషాబాద్ (తెలంగాణ), బారామతి (మహారాష్ట్ర), కిషన్ గడ్ , అజ్మీర్ (రాజస్థాన్), బాలాసోర్ (ఒడిశా) లలో 100 పడకల ఆసుపత్రులను, కర్నూలు (ఆంధ్రప్రదేశ్)లో 30 పడకల ఆసుపత్రి, గ్రేటర్ నోయిడా (ఉత్తరప్రదేశ్)లో 350 పడకల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.
వీటితో పాటు సిక్కింలోని రంగ్ పో లో కొత్తగా మంజూరైన 30 పడకల ఈఎస్ఐసీ ఆసుపత్రిని 100 పడకలకు అప్ గ్రేడ్ చేయాలని, విజయవాడలోని గుణదల (ఆంధ్రప్రదేశ్), రాంచీ (జార్ఖండ్) లోని మైథాన్ లను రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్వాధీనం చేసుకోవాలని కూడా నిర్ణయించారు. కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం, సౌకర్యాలు కల్పించేందుకు కొత్తగా స్వాధీనం చేసుకున్న ఆసుపత్రులను ఇ ఎస్ఐ సి నేరుగా నిర్వహిస్తుంది.
తక్కువ జనాభా కలిగిన ఈశాన్య ప్రాంతాన్ని ,ప్రైవేటు ఆసుపత్రులు/ డిస్పెన్సరీలు/ నర్సింగ్ హోమ్ ల కొరతను ఈశాన్య రాష్ట్రాల్లో ఈఎస్ ఐ పథకం ఆర్థిక స్థితిగతులు దృష్టిలో ఉంచుకుని
ఇ ఎస్ ఐ పథకాన్ని నిర్వహించేందుకు ఈశాన్య రాష్ట్రాలు, సిక్కింకు ఆర్థిక సహాయాన్ని కొనసాగించాలని ఇఎస్ఐసి నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి పరిమితి మేరకు అయ్యే మొత్తం ఖర్చును ఈశాన్య రాష్ట్రాల (అస్సాం మినహా) ఇఎస్ఐ కార్పొరేషన్ భరిస్తుంది.
అంతేకాక, డిస్పెన్సరీకి రూ.40 లక్షలు (త్రైమాసికానికి రూ. 10 లక్షలు) రాష్ట్ర ప్రభుత్వానికి అందించే అదనపు ఆర్థిక సహాయాన్ని కూడా ప్రారంభిస్తారు. స్టాండర్డ్ మెడికల్ కేర్ కింద రెగ్యులర్ నిధుల కేటాయింపుతో పాటు ఇది అదనపు ప్రయోజనం. కొత్త డిస్పెన్సరీలను ప్రస్తుత సూచనల మేరకు తెరిస్తే వారికి కూడా ఇది అందుబాటులో ఉంటుంది.
కోవిడ్ -19 మహమ్మారి సమయంలో నిరుద్యోగులుగా మారిన బీమా కార్మికులకు ఉపశమనం కలిగించడానికి, అటల్ బీమా శక్తికల్యాన్ యోజన కింద లభించే ప్రయోజనాలను మరో రెండేళ్ల పాటు పొడిగించే ప్రతిపాదనకు ఈ సమావేశం లో ఇఎస్ఐ కార్పొరేషన్ ఆమోదం తెలిపింది. అంగీకరించింది.
అటల్ బీమిత్ శక్తి కళ్యాణ్
యోజన (ఎబివికెవై) అనేది ఆకస్మిక నిరుద్యోగంలో కార్మికుడి జీవితకాలంలో ఒకసారి 90 రోజుల వరకు నగదు పరిహారం రూపంలో సంక్షేమ చర్య.
సామాజిక భద్రతా కోడ్ - 2020 అమలు తర్వాత ఈఎస్ఐ పథకం పరిధిలోకి వచ్చే బీమా కార్మికులు , వారిపై ఆధారపడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందని, అందుచేత ఐపి లకు, వారి లబ్ధిదారులకు ప్రాధమిక వైద్య సంరక్షణను అందించడానికి బహుముఖ వ్యూహాలను అవలంబించడం ద్వారా వైద్య సేవల మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం, విస్తరించడంపై దృష్టి పెట్టాలని శ్రీ భూపేందర్ యాదవ్ ఇఎస్ఐసి ని ఆదేశించారు.
31.03.2024 వరకు అల్వార్ (రాజస్థాన్), బిహ్తా (బీహార్) లోని ఇఎస్ఐసీ హాస్పిటల్ అండ్ మెడికల్ కాలేజిలో సాధారణ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలను విస్తరించే ప్రతిపాదనను కూడా
ఇఎస్ఐసి ఆమోదించింది. ఇఎస్ఐసి కింద మందులు/దుస్తులు, వినియోగ వస్తువుల సౌకర్యాలను కూడా వారికి ఉచితంగా అందిస్తారు. దీని వల్ల చుట్టుపక్కల ప్రాంతాల్లోని లక్షలాది మంది సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా నాణ్యమైన వైద్యం ఉచితంగా అందుతుంది.
వీటితో పాటు 2022-23 సంవత్సరానికి సవరించిన అంచనాలు, 2023-24 సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు, 2023-24 సంవత్సరానికి ఈఎస్ఐ కార్పొరేషన్ నిర్వహణ బడ్జెట్ తదితర అజెండా అంశాలను కూడా చర్చించి ఆమోదించారు.
కేంద్ర కార్మిక శాఖ మంత్రి అధ్యక్షతన జోనల్ మెడికల్ కమిషనర్లు, మెడికల్ కమిషనర్లు, ఇన్సూరెన్స్ కమిషనర్లు, ఇఎస్ఐసి రీజనల్ డైరెక్టర్లతో ప్రత్యేక సమావేశం కూడా నిర్వహించారు. రిఫరల్ వ్యవస్థలో సంస్కరణలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలలో అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకోవడం,ఇంతవరకు ప్రయోజనం పొందని (అసంఘటిత రంగ కార్మికులు) వర్గాలను చేరుకోవడం, వృత్తిపరమైన వ్యాధులు వంటి అంశాలపై చర్చించారు కార్యాచరణ అంశాలను గుర్తించారు.
ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు శ్రీమతి డోలా సేన్, శ్రీ ఖాగెన్ ముర్ము, కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీమతి ఆర్తి అహుజా, ఇఎస్ఐసి డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్య కార్యదర్శులు/కార్యదర్శులు, యాజమాన్య, ఉద్యోగ ప్రతినిధులు, వైద్య రంగ నిపుణులు హాజరయ్యారు.
******
(रिलीज़ आईडी: 1901035)
आगंतुक पटल : 216