వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చడం లోనూ, గ్రామాలను మరింత సుసంపన్నం చేయడంలోనూ విద్యార్థులు, యువత పాత్ర కీలకం:  శ్రీతోమర్


నియామ్, అగ్రి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ స్నాతకోత్సవాన్ని ప్రారంభించినకేంద్ర వ్యవసాయ మంత్రి

నియామ్ లో 60 సీట్లు పెంచుతామని, హాస్టల్ లో తప్పనిసరి బసను రద్దు చేస్తామని ప్రకటన

Posted On: 19 FEB 2023 3:33PM by PIB Hyderabad

జైపూర్ లోని చౌదరి చరణ్ సింగ్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ (సిసిఎస్-ఎన్ఐఎఎం), అగ్రి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ కు చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ నాలుగో స్నాతకోత్సవాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ ఈ రోజు ముఖ్య అతిథిగా ప్రారంభించారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ కైలాష్ చౌదరి ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ తోమర్ మాట్లాడుతూ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం లో ప్రభుత్వం వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం వివిధ పథకాల ద్వారా నిర్విరామంగా

ప్రయత్నాలు చేస్తోందన్నారు. దేశంలో వ్యవసాయ రంగానికి మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడానికి, గ్రామాలను మరింత సుభిక్షంగా మార్చడానికి, వ్యవసాయంతో సంబంధం ఉన్న విద్యార్థులు, యువత కూడా నిర్మాణాత్మక సహకారం అందించాలని అన్నారు. నియామ్ లో 60 సీట్లను పెంచుతామని, హాస్టల్ లో తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను రద్దు చేస్తామని తోమర్ ప్రకటించారు.

 

 

Description: C:\Users\admin\Desktop\AGRI, RD & PR\AGRI\Photo_1_AM_NIAM_Jaipur_Convocation_19_Feb._2023.jpeg

 

కేంద్ర మంత్రి శ్రీ తోమర్ మాట్లాడుతూ, వ్యవసాయ రంగం ప్రధానమైనదని, ఈ రంగం పట్ల ప్రతి ఒక్కరి ఆసక్తి పెరగాలని, యువత కూడా వ్యవసాయ రంగం వైపు ఆకర్షితులవ్వాలని, ఇది మనందరి బాధ్యత అని అన్నారు. ‘‘వ్యవసాయ రంగంలో జీవనోపాధి ఉంది, రైతుల దేశభక్తి కూడా ఉంది, వ్యవసాయ ఉత్పత్తి లేకపోతే అంతా ఆగిపోతుంది. వ్యవసాయ రంగంలో అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి రాష్ట్రాల సహకారంతో విజయవంతంగా పరిష్కరించేందుకు ముందుకు వెడుతోంది‘‘ అన్నారు. లాభసాటి పంటల వైపు అడుగులు వేయడం, పంటల వైవిధ్యం, ఉత్పత్తుల అమ్మకాల్లో దళారుల నిర్మూలన వంటి అనేక సవాళ్లను ప్రణాళికాబద్ధంగా పరిష్కరిస్తునట్టు చెప్పారు. వ్యవసాయ రంగంలో శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, రైతుల అలుపెరగని కృషితో పాటు, ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు అనుకూల విధానాల వల్ల వ్యవసాయంలో అపూర్వ పురోగతి సాధించామని శ్రీ తోమర్ అన్నారు. ‘‘అత్యధిక వ్యవసాయోత్పత్తుల పరంగా, భారతదేశం నేడు ప్రపంచంలో నంబర్ వన్ లేదా రెండవ స్థానంలో ఉంది, దీనిని మనమందరం కలిసి అగ్రగామిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకోవాలి. భారతదేశం నుండి ఆహార ధాన్యాల కోసం గురించి ప్రపంచం చాలా ఆశలు పెట్టుకుంది, మనం వాటిని నెరవేరుస్తున్నాము. భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాము. వ్యవసాయ పరిశోధన అనేది నిరంతర కృషి . అలాగే రైతుల కృషి, ప్రభుత్వ కృషి కూడా ఏమాత్రం తగ్గడం లేదు. జీవనోపాధికి ఉద్యోగాలు అవసరం, కానీ అదే సమయంలో వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడం కూడా అవసరం, ఎందుకంటే దేశ జనాభాలో 56 శాతం మంది దానిపై ఆధారపడి ఉన్నారు‘‘ అని శ్రీ తోమర్ పేర్కొన్నారు.

 

ప్రస్తుతాన్ని అందంగా మార్చడమే కాకుండా, వందేళ్ల స్వాతంత్ర సంవత్సరాన్ని జరుపుకునే నాటికి భారత దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని ప్రధాన మంత్రి శ్రీ మోదీ పదే పదే చెప్పడాన్ని శ్రీ తోమర్ ప్రస్తావిస్తూ, ఇది భారత దేశానికి ఒక బంగారు, చారిత్రాత్మక అవకాశం అని, దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత కొత్త తరంపై ఉందని అన్నారు. 2047లో దేశ భవిష్యత్తు ప్రపంచానికి భారత్ దిక్సూచిగా నిలిచేలా ఉండాలని, ఈ దిశగా ప్రధాని మోదీ నాయకత్వంలో కార్యక్రమాలు, పథకాలు నిరంతరం రూపు దిద్దుకుంటున్నాయని చెప్పారు. రేపటి వరకు వేచి చూడటం వృధా అని, ఈ రోజు చేయగలిగిన పనిని మనం ఇప్పుడే చేయాలని కేంద్ర మంత్రి అన్నారు. అగ్రి స్టార్టప్స్ ను అభినందించిన తోమర్ దేశంలో చాలా మంచి ప్రయోగాలు జరిగాయని అన్నారు. 2014లో అధికారంలోకి వచ్చాక అన్ని రంగాల్లో కలిపి 32 స్టార్టప్ లు వచ్చాయి. దేశంలో స్టార్టప్ లను ప్రధాన మంత్రి శ్రీ మోదీ నిరంతరం ప్రోత్సహిస్తున్నారని, దీని వల్ల ఒక్క అగ్రి స్టార్టప్ ల సంఖ్య ఇప్పుడు 2,000కు పెరిగిందని, ఇతర రంగాలతో కలిపి 10,000కు పైగా స్టార్టప్ లు పనిచేస్తున్నాయని తెలిపారు. వాటి బలంతో భవిష్యత్తులో భారత్ ప్రపంచ గురువుగా ఎదుగుతుందన్నారు.

 

 

Description: C:\Users\admin\Desktop\AGRI, RD & PR\AGRI\Photo_2_AM_NIAM_Jaipur_Convocation_19_Feb._2023.jpeg

 

కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శ్రీ చౌదరి కూడా ప్రసంగించారు. పార్లమెంటు సభ్యులు శ్రీ రాంచరణ్ బోహ్రా, కల్నల్ రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ దినేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మార్కెటింగ్ శాఖ సంయుక్త కార్యదర్శి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెగ్యులేషన్ డాక్టర్ విజయలక్ష్మి నాదెండ్ల స్వాగతోపన్యాసం చేశారు. నియామ్ డైరెక్టర్ డాక్టర్ రమేష్ మిట్టల్ ధన్యవాదాలు తెలిపారు.

 

స్నాతకోత్సవం సందర్భంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా-అగ్రి బిజినెస్ మేనేజ్ మెంట్ విద్యార్థులకు డిప్లొమాలు, ప్రతిభావంతులైన విద్యార్థులకు పతకాలు అందజేశారు. నియామ్ ద్వారా శిక్షణ, నిధులు పొందిన స్టార్టప్ ల ఉత్పత్తులను కూడా శ్రీ తోమర్ ప్రారంభించారు, నిధుల చెక్కులను పంపిణీ చేశారు. స్టార్టప్ ఎగ్జిబిషన్, ప్రొడక్ట్స్ ప్రదర్శన కూడా నిర్వహించారు, ఇందులో నియామ్ ద్వారా శిక్షణ పొందిన, నిధులు సమకూర్చిన స్టార్టప్ లు పాల్గొన్నాయి.

 

ఈ సందర్భంగా స్టార్టప్ శిక్షణ, నిధుల్లో పనితీరు ఆధారంగా నియామ్ భాగస్వామ్య సంస్థలకు అవార్డులు ప్రదానం చేశారు. శ్రీ కరణ్ నరేంద్ర అగ్రికల్చరల్ యూనివర్సిటీ, జాబ్నర్ కు ప్లాటినం అవార్డు, కటక్ (ఒడిశా) లోని నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ కు డైమండ్ అవార్డు, బిహార్ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సాబౌర్ ను గోల్డ్ అవార్డుతో సత్కరించారు. అగ్రి ఇన్నోవేషన్ అండ్ ఇంక్యుబేషన్ సెంటర్ వెబ్ సైట్ ను శ్రీ తోమర్ ప్రారంభించారు, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ బిజినెస్ స్కూల్, స్మార్ట్ క్లాస్ రూమ్ లను ప్రారంభించారు ఇండో-జర్మన్ ప్రాజెక్ట్ స్టేటస్ రిపోర్ట్ ను అందించారు. ఈ కార్యక్రమంలో నియాం కు చెందిన తొమ్మిది ప్రచురణలను కూడా విడుదల చేశారు.

 

*****


(Release ID: 1900677) Visitor Counter : 172