ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

శాస్త్రీయ చర్చా గోష్టి 'నోటో సైంటిఫిక్ డైలాగ్ 2023' నిర్వహించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ


దేశంలో తొలిసారిగా ఏడాదికి 15,000కు పైగా అవయవ దానాలు జరిగాయి. 27% వార్షిక పెరుగుదల నమోదు చేసిన మార్పిడులు

సమర్థవంతమైన పాలన వ్యవస్థ , సాంకేతిక వనరుల హేతుబద్ధ సద్వినియోగం జరగాలి
అవయవ దానంపై అవగాహన ఎక్కువ చేయాలి

Posted On: 19 FEB 2023 1:11PM by PIB Hyderabad

అవయవ దానం, కణజాల మార్పిడి పై కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈరోజు నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్ (నోటో) సైంటిఫిక్ డైలాగ్ 2023 ను నిర్వహించింది. ప్రాణాలు రక్షించడానికి అవసరమైన  అవయవ,  కణజాల మార్పిడి రంగంలో వస్తున్న మార్పులు,  ఉత్తమ పద్ధతులపై అన్ని వర్గాల నుంచి ఆలోచనలు, అభిప్రాయాలు సేకరించడానికి ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  కార్యక్రమాన్ని నిర్వహించింది. 

 


ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ రాజేష్ భూషణ్ మాట్లాడుతూ అవయవ, కణజాల మార్పిడిలో అన్ని వర్గాల్లో  సానుకూల దృక్పధం కనిపిస్తోందని అన్నారు.   కోవిడ్ తర్వాత దేశంలో అవయవ దాన  కార్యకలాపాలు  పుంజుకున్నాయన్నారు.  తొలిసారిగా దేశం ఒక సంవత్సరం (2022)లో  15,000 కి మించి అవయవ దానాలు జరిగాయన్నారు. అవయవ దానం, కణజాల మార్పిడి  27 శాతం వార్షిక వృద్ధి నమోదు చేసిందని శ్రీ రాజేష్ భూషణ్ తెలిపారు. 
అవయవ దానం, కణజాల మార్పిడి కోసం తిరిగి అమర్చడం, సమాచారం, వృత్తి నైపుణ్యం ఎక్కువ చేసే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాల్సి ఉంటుందని శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు.ప్రస్తుతం అమలులో ఉన్న వ్యవస్థ, , మార్గదర్శకాలను నవీకరించాల్సిన అవసరం ఉందని  శ్రీ భూషణ్ పేర్కొన్నారు.  "జాతీయ స్థాయిలో నాటో, రాష్ట్ర స్థాయిలో ఎస్ఓటిఓలు , ప్రాంతీయ స్థాయిలో ఆర్ఓటిఓలు వంటి వివిధ పాలన వ్యవస్థలు పనిచేస్తున్నాయి. అయితే, ఈ వ్యవస్థల పనితీరు మరింత మెరుగు పడాల్సి ఉంది. దీనికోసం చర్యలు అమలు జరగాలి." అని అన్నారు.
 నూతన మార్గదర్శకాలు, నివాస ఆవశ్యకతను తొలగించడం వంటి మార్పుల పట్ల శ్రీ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు. దేశంలో అందుబాటులో  ఉన్న సాంకేతిక మానవ వనరుల హేతుబద్ధ వినియోగం, వృత్తి నైపుణ్యాలు పెంపొందించడం, శిక్షణ కార్యక్రమాలు, మానవ వనరుల సమర్ధ వినియోగం అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ సంరక్షణ సౌకర్యాలను  సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. 
దేశంలో జనాభా తో పాటు వృద్ధుల జనాభా కూడా పెరుగుతున్నదని   కేంద్ర ఆరోగ్య కార్యదర్శి అన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరచడానికి సమాచార,   అవగాహన వ్యూహాలను  నవీకరించడం ముఖ్యమన్నారు.దీనివల్ల అవయవ దానం పట్ల అవగాహన ఉన్నవారు అవయవాలను దానం చేయడానికి ముందుకు  వస్తారని పేర్కొన్నారు. శిక్షణా కార్యక్రమాలు, కొత్తగా రూపొందించిన కోర్సులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, స్థానిక భాషల పట్ల అవగాహన ఉన్న నిపుణుల కోసం డిజిటల్ విధానంలో పునఃశ్చరణ కార్యక్రమాలు నిర్వహించాలని  ఆయన సూచించారు. శిక్షణ కార్యక్రమాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం, అవగాహనతో పాటు స్థానిక భాగస్వాములు, స్వచ్ఛంద సంస్థలతో (ఎన్జీవోలు) భాగస్వామ్యం కావాలన్నారు. దీనివల్ల సమాచారం విస్తృతంగా ప్రసారం అవుతుందని అవయవ దానం చేయడానికి  ప్రజలు ముందుకు వస్తారని శ్రీ భూషణ్ అన్నారు. 

 వైద్య సంస్థల సామర్థ్యాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని  శ్రీ రాజేష్ భూషణ్ స్పష్టం చేశారు.  "640 కి పైగా  వైద్య ఆస్పత్రులు, కళాశాలలు ఉన్నప్పటికీ అవయవ మార్పిడి  కొన్ని ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ప్రత్యేక సేవ గా మిగిలిపోయింది. శస్త్రచికిత్సలు,  అవయవ దానం, కణజాల మార్పిడి చేపట్టడానికి అవసరమైన సౌకర్యాలు  అందుబాటులో ఉన్న వైద్య సంస్థల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. అందువల్ల, దేశంలో శస్త్రచికిత్సలు/మార్పిడిని పెంచడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుల కోసం  అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి మౌలిక సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలి." అని శ్రీ రాజేష్ భూషణ్ అన్నారు. అధిక కేసుల లోడ్ ఉన్న సంస్థలను గుర్తించి వాటిని నెట్ వర్క్ నాట్ ప్రోగ్రామ్ పరిధిలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. సంప్రదింపులు, చర్చలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)కు దారితీస్తాయని, తత్ఫలితంగా రాష్ట్ర, ప్రాంతీయ స్థాయిలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లను ఏర్పాటు చేసి అవసరమైన వారికి ఈ ప్రత్యేక సేవలు అందించవచ్చని ఆయన అన్నారు. 
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి వి.హెకాలి జహిమేమి  జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం (ఎన్ఓటీపీ) కింద పెరిగిన సామర్ధ్యాల గురించి,  24×7 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్, నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ రిజిస్ట్రీ, వెబ్ సైట్  వంటి అందుబాటులో ఉన్న సౌకర్యాల వివరాలు  తెలియజేశారు.

ఈ సదస్సులో నోటో డైరెక్టర్ డాక్టర్ రజనీష్ సెహై, సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్  బీఎల్ షెర్వాల్,  సీనియర్ అధికారులు, వైద్య రంగ నిపుణులు, హెల్త్ కేర్ నిపుణులు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

***



(Release ID: 1900607) Visitor Counter : 186