సహకార మంత్రిత్వ శాఖ

మహారాష్ట్రలోని పూణేలో దైనిక్ సకల్ గ్రూప్ నిర్వహించిన రెండు రోజుల సహకార మహా సమ్మేళనం ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా


‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రతిపాదించిన సహకార్ సే సమృద్ధి సూత్రం తో సహకార రంగం అభివృద్ధిని ఎవరూ ఆపలేరు, ఇప్పుడు సహకార రంగానికి ఎవరూ అన్యాయం చేయలేరు.‘

‘ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సహకార రంగ సమస్యలను పరిష్కరించడానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేస్తోంది.‘

‘రాబోయే దశాబ్దం తరువాత సహకార రంగం అత్యంత వాస్తవిక రంగం అవుతుంది‘

‘మహారాష్ట్రలో సహకార సంఘాలు చాలా పురాతనమైనవి , బలమైనవి. సహకార సంఘాలు మహారాష్ట్ర స్వాభావిక వ్యవస్థలు: దేశవ్యాప్తంగా సహకార సంఘాలను విస్తరించడంలో మహారాష్ట్ర చాలా దోహదం చేసింది.‘

‘ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో రూపొందే కొత్త సహకార విధానం వచ్చే 20 సంవత్సరాలకు దేశంలోని సహకార సంఘాల దిశను నిర్ణయిస్తుంది.‘

జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్ సిడిసి) పరిమాణం, పరిధి 2025 నాటికి మూడు రెట్లు పెంపు: ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సహకార సంఘాలను ప్రభుత్వ సేకరణ కోసం జెమ్ పోర్టల్ లోకి ప్రవేశించడానికి కూడా అనుమతించింది.

‘ఈ ఏడాది బడ్జెట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సహకార సంఘాలకు

Posted On: 18 FEB 2023 9:18PM by PIB Hyderabad

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా ఈ రోజు మహారాష్ట్రలోని పూణేలో దైనిక్ సకల్ గ్రూప్ నిర్వహించిన రెండు రోజుల సహకార సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవీస్ తో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం సహకార రంగ సమస్యలను పరిష్కరించడానికి అన్ని  ప్రయత్నాలు చేస్తుందని శ్రీ అమిత్ షా తన ప్రసంగంలో తెలిపారు. నేడు దేశంలో సహకార రంగంలో మంచి పనితీరు కనబరుస్తున్న అతికొద్ది రాష్ట్రాల్లో మహారాష్ట్ర ఒకటన్నారు. మహారాష్ట్రలో సహకార సంఘాలు చాలా పురాతనమైనవని, సహకార వ్యవస్థ మహారాష్ట్ర స్వభావం అని, దేశవ్యాప్తంగా సహకార సంఘాలను వ్యాప్తి చేయడంలో ఈ రాష్ట్రం ఎంతో దోహదపడిందని ఆయన అన్నారు.

 

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్ని సహకార సమస్యలపై దృష్టి సారించేందుకు వీలుగా ఒక ప్రత్యేక సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ అమిత్ షా తెలిపారు. నేటికీ భారతదేశపు మొత్తం చక్కెర ఉత్పత్తిలో 31 శాతం సహకార చక్కెర మిల్లుల ద్వారా జరుగుతోందని, 16 శాతం పాలు, 13 శాతం గోధుమలు, 20 శాతం వరి ధాన్యం సేకరణ కూడా సహకార సంస్థల ద్వారా జరుగుతోందని, మొత్తం ఎరువులలో 25 శాతం సహకార సంఘాలు ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన చెప్పారు. సహకార సంఘాల నుంచి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద పీట వేయకపోతే అది అభివృద్ధి చెందదని ఆయన అన్నారు. మన దేశంలో సహకార పరపతి సంఘాల భారీ నెట్ వర్క్ ఉందని, ఇది దేశంలోని అట్టడుగు వర్గాల ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చిందని శ్రీ షా అన్నారు.

నేటికీ సహకార రంగం అవాస్తవికం కాదని, రాబోయే దశాబ్దం తర్వాత సహకారమే అత్యంత సముచితమైన రంగమని ఆయన అన్నారు.

 

కేంద్ర హోం,సహకార శాఖ మంత్రి మాట్లాడుతూ, మహారాష్ట్రలో సహకార రంగం పెద్దది, బలమైనది, సమగ్రమైనదని,దేశంలోని 8.5 లక్షల సహకార సంఘాలలో రెండు లక్షలు మహారాష్ట్రలోనే ఉన్నాయని పేర్కొన్నారు.

దేశంలోని రెసిడెన్షియల్ కోఆపరేటివ్ సొసైటీలలో 67 శాతం, 35 శాతం పశుసంవర్థక సంఘాలు, 27 శాతం చక్కెర సహకార సంఘాలు, 16 శాతం మార్కెటింగ్ సొసైటీలు, 14 శాతం మత్స్య పరిశ్రమ సొసైటీలు, 11 శాతం ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీలు మహారాష్ట్రలో ఉన్నాయి. ఇంకా, దేశంలోని పిఎసిఎస్ లలో 21 శాతం, మొత్తం పట్టణ బ్యాంకులలో 32 శాతం అంటే 490 బ్యాంకులు మహారాష్ట్రలో ఉన్నాయి, అలాగే 6529 బ్యాంకు శాఖలు ఇక్కడ ఉన్నాయి, ఇది దేశంలోని మొత్తం శాఖలలో 60 శాతం. అంటే సహకార సంఘాలు మహారాష్ట్రకు ప్రధాన బలం. మహారాష్ట్రలో అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుల ద్వారా సుమారు రూ .3.25 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి, ఇది దేశంలోని మొత్తం పట్టణ బ్యాంకు డిపాజిట్లలో 62 శాతం.

 

సహకార సంఘాల ద్వారా దేశంలోని గ్రామీణ, సెమీ అర్బన్, పట్టణ ప్రాంతాల సౌభాగ్యాన్ని పెంపొందించాలనే బృహత్తర దార్శనికతతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశారని శ్రీ అమిత్ షా తెలిపారు.

అభివృద్ధి చెందిన రాష్ట్రాలు, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలు, అభివృద్ధి చెందని రాష్ట్రాలుగా దేశం మొత్తాన్ని సహకార సంఘాల కోణంలో మ్యాపింగ్ చేశామని, దీని ద్వారా ప్రతి ప్రాంత సమస్యలకు పరిష్కారాలను కనుగొనడానికి ప్రయత్నించామని ఆయన అన్నారు. ఒకప్పుడు భారీ ఉత్పత్తి అభివృద్ధికి సూత్రమని, అయితే భారీ జనాభా ఉన్న భారత్ వంటి దేశంలో నిరుద్యోగాన్ని రూపుమాపి, సామూహిక ఉత్పత్తి సూత్రం ద్వారా ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు

 

దేశంలో ప్రాథమిక సంఘాలను బలోపేతం చేస్తే తప్ప సహకార సంఘాలు బలంగా ఉండలేవని కేంద్ర సహకార మంత్రి అన్నారు. దేశంలోని 63,000 పి ఎ సి ఎస్  లను బలోపేతం చేసేందుకు వాటిని కంప్యూటరీకరణ చేయాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు.

వీటితో పాటు పి ఎ సి ఎస్  ల కొత్త మోడల్ బైలాస్ ను రూపొందించి రాష్ట్రాలకు పంపామని, ఇందులో పీఏసీఎస్ లను బహుళ ప్రయోజన కేంద్రాలుగా మార్చేందుకు అవకాశం కల్పించామన్నారు. ప్రధాన మంత్రి శ్రీ

నరేంద్ర మోదీ నాయకత్వంలోని

ప్రభుత్వం మల్టీ డైమెన్షనల్ పీఏసీఎస్ ల మోడల్  బైలాస్ కింద 30 విభిన్న కార్యకలాపాల  ద్వారా పీఏసీఎస్ లను లాభ వంతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ

నరేంద్ర మోదీ నాయకత్వంలో, ప్రతి పంచాయితీలో మల్టీడైమెన్షనల్ పిఎసిలు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని, ఇప్పుడు 3 సంవత్సరాలలో భారతదేశంలో 2 లక్షల కొత్త పిఎసిఎస్ లు తయారవుతాయని, ఆ తరువాత దేశంలోని ప్రతి పంచాయితీలో పిఎసిఎస్ లు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు.

 

పీఏసీఎస్ లకు సీ ఎస్ సీ (కామన్ సర్వీస్ సెంటర్ ) బాధ్యతలను కూడా అప్పగిస్తున్నామని, దీనికోసం నేషనల్ కోఆపరేటివ్ డేటాబేస్ ను రూపొందిస్తున్నామని, 80 శాతం పనులు పూర్తయ్యాయని అమిత్ షా తెలిపారు.

దీని ద్వారా సహకార సంఘాలను విస్తరించడంతో పాటు డ్రై ప్రాంతాలను కనుగొనగలుగుతాం. ఈ మొత్తం ప్రక్రియకు బలమైన పునాది వేయాలంటే సహకార విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందని, ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేశామని, ఇది తక్కువ సమయంలోనే సహకార విధానం ముసాయిదాను రూపొందిస్తుందని చెప్పారు. వచ్చే 20 ఏళ్ల పాటు దేశంలో సహకార సంఘాల దిశను నూతన సహకార విధానం నిర్ణయిస్తుందన్నారు.

సహకార సంఘాలను ప్రోత్సహించడంతో పాటు, ఈ రంగంలో సుశిక్షితులైన మానవ వనరుల అవసరాన్ని తీర్చడానికి, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఒక బహుళార్థసాధక సహకార విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిందని, ఇది సహకార సంఘాల ప్రతి విభాగానికి శిక్షణ పొందిన మానవ వనరులను అందిస్తుందని ఆయన చెప్పారు. 2025 నాటికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎన్సిడిసి) పరిమాణం ,పరిధిని మూడు రెట్లు పెంచుతామని శ్రీ షా చెప్పారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జిఇఎం పోర్ట ల్ లో ప్ర భుత్వ కొనుగోలు కోసం సహకార సంఘాలను కూడా అనుమతించిందని చెప్పారు.

 

ఈ ఏడాది బడ్జెట్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సహకార సంఘాలకు పన్నుల విషయాల్లో సమానత్వాన్ని తీసుకువచ్చిందన్నారు. చెరకు చెల్లింపుపై సహకార చక్కెర మిల్లులు చెల్లించాల్సిన రూ.10 వేల కోట్ల అదనపు ఆదాయ పన్ను మొత్తాన్ని కూడా ప్రభుత్వం రద్దు చేసిందని, ఇది అపూర్వమైన చర్య అని ఆయన అన్నారు.

వీటితో పాటు అమూల్ తరహాలో 3 మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీలు కూడా ఏర్పాటు కానున్నాయి. సేంద్రియ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ ఆర్గానిక్ సొసైటీని ఏర్పాటు చేస్తామని, ఇది భూమి ,ఉత్పత్తిని పరీక్షించడమే కాకుండా సేంద్రీయ ఉత్పత్తుల బ్రాండింగ్ కూడా చేస్తుందని ఆయన చెప్పారు. పీఏసీఎస్ ల ద్వారా రైతుల ఉత్పత్తులను ఎగుమతి చేసి, దాని లాభాలను పీఏసీఎస్ ల నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసే మల్టీ స్టేట్ ఎక్స్ పోర్ట్ హౌస్ ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని

ప్రభుత్వం పీఏసీఎస్ లకు ఎఫ్ పీ వో హోదా కూడా ఇచ్చింద ని, తద్వారా ఇప్పుడు ఎఫ్ పీవోల కు ఇచ్చే అన్ని

 ప్రయోజనాలు పీఏసీఎస్ లకు కూడా

లభ్యం అవుతాయని ఆయన తెలిపారు.

 

2025 నాటికి పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపాలని 2015లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. దీని కోసం, 2022 నవంబర్ లో 10 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని చేరుకోవాలని 2022 వరకు మధ్యంతర లక్ష్యాన్ని నిర్దేశించారు, కానీ మనం సెప్టెంబర్లోనే ఈ లక్ష్యాన్ని ముందుగానే సాధించాము, ఇది నేడు 12 శాతానికి చేరుకుంది. దీనివల్ల మన చమురు దిగుమతులు 10 శాతం తగ్గాయని, సుమారు రూ.41,500 కోట్ల విదేశీ మారకద్రవ్యం ఆదా అయిందని, ఇది మన వాణిజ్య లోటును కూడా తగ్గించిందని, ఈ 10 శాతం సహకార చక్కెర మిల్లులకు, వాటి ద్వారా రైతులకు వెళ్లిందని ఆయన అన్నారు. వీటితో పాటు ఇథనాల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు వెచ్చించి 6 శాతం వడ్డీని కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో చెల్లిస్తోందని,  10 శాతం ఇథనాల్ కలపడం ద్వారా 27 లక్షల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించగలిగామని, 20 శాతం కలపడంతో ఈ సంఖ్య రెట్టింపు అవుతుందన్నారు.

 

సహకార రంగం పనితీరుపై ఆత్మపరిశీలన చేసుకోవాలని, విశ్వసనీయతను పెంచుకోవాలని శ్రీ అమిత్ షా అన్నారు. సహకార రంగం తన వ్యవస్థలను మెరుగుపరుచుకుని స్వయంగా తన బాధ్యతలను చేపట్టాలని ఆయన అన్నారు. సహకార రంగానికి ఇప్పుడు ఎవరూ అన్యాయం చేయలేరని, సహకార మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అందించిన సహకార్ సే సమృద్ధి సూత్రంతో సహకార రంగం అభివృద్ధిని ఎవరూ ఆపలేరని శ్రీ అమిత్ షా  అన్నారు.

 

****



(Release ID: 1900526) Visitor Counter : 162