వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పంట కాలం 2022-23లో కర్ణాటకలని వేలం ప్లాట్‌ఫారమ్‌లలో నమోదిత సాగుదారులు ఉత్పత్తి చేసిన అదనపు పొగాకు, నమోదు చేసుకోని సాగుదారులు ఉత్పత్తి చేసిన అనధికార పొగాకును ఎటువంటి జరిమానా లేకుండా విక్రయించేందుకు అనుమతించాలన నిర్ణయించిన ప్రభుత్వం
Posted On:
18 FEB 2023 1:33PM by PIB Hyderabad
కర్ణాటక పంట కాలం 2022-2023లో తక్కువ ఉత్పత్తిని పరిగణనలోకి తీసుకుని, వేలం ప్లాట్‌ఫారమ్‌లలో నమోదు చేసుకున్న సాగుదారులు ఉత్పత్తి చేసిన అదనపు ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకును, నమోదు చేసుకోని లేదా నమోదుకానీ సాగుదారులు ఉత్పత్తి చేసిన అనధికారిక ఫ్లూ క్యూర్డ్ పొగాకును ఎలాంటి జరిమానా లేకుండా విక్రయించడానికి అనుమతించాలని కేంద్ర వాణిజ్య & పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయెల్ నిర్ణయించారు.
ప్రస్తుత పంటకాలంలో కర్ణాటకలోని 40,207మంది రైతులు 60,782 హెక్టార్ల ఎఫ్‌సివి పొగాకును సాగు చేశారు. జూన్, జులై 2022 నెలల్లో ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా, టొబాకో బోర్డు నిర్ణయించిన 100.00 మిలియన్ కిలోల పంట పరిమాణానికి వ్యతిరకంగా కర్ణాటకలో ఎఫ్‌సివి పొగాకు మొత్తం ఉత్పత్తి 59.78 మిలియన్ కేజీలుగా ఉంది.
అదనపు ఎఫ్‌సివి పొగాకు అమ్మకాలపై జరిమానా వేయకూడదన్న నిర్ణయం, ఈ పంట కాలంలో తక్కువ కారణంగా వచ్చిన నష్టాల నుంచి కర్ణాటక రైతులు బయిటపడే అవకాశమిచ్చి గొప్పగా లబ్ధి చేకూరుస్తుంది. తక్కువ ఉత్పత్తి, తక్కువ ఆదాయం కారణంగా ఎఫ్‌సివి పొగాకు రైతులు ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న సమయంలో వారికి తోడ్పాటునందించాలన్న నిర్ణయం, సాగుదారులు తమ జీవనోపాధిని కొనసాగించేందుకు ఎంతగానో తోడ్పడుతుంది.
***
(Release ID: 1900444)
Visitor Counter : 197