గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ
2024 నాటికి 10 కోట్ల స్వయం సహాయక సంఘాల సభ్యులను కలిగి ఉండాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యాన్ని చేరుకుంటాం: కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్
స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం బెంగళూరుకు చెందిన ఈ-కామర్స్ ఆన్ లైన్ వేదిక అయిన “మీషో”తో మంత్రి అవగాహన ఒప్పందం పై సంతకం
2014కి ముందు స్వయం సహాయక సంఘాలకు సంచిత బ్యాంకు రుణాల మొత్తం రూ. 80.000 కోట్లు, ఇది ఇప్పుడు గత 9 ఏళ్లలో 6.25 లక్షల కోట్లకు పైగా ఉంది, వీటిలో నిరర్ధక ఆస్తుల వాటా 2.08% మాత్రమే : గిరిరాజ్ సింగ్
మీషో టీమ్‌తో కలిసి కూర్చుని, ఉభయతారక ప్రతిపాదనపై పరిగానిన్చాగల విషయాలు, ఉత్పత్తులను గుర్తించాలని మంత్రి మంత్రిత్వ శాఖ అధికారులను కోరారు.
Posted On:
16 FEB 2023 4:39PM by PIB Hyderabad
2024 నాటికి 10 కోట్ల స్వయం సహాయక సంఘాల సభ్యులను(సఖులను) కలిగి ఉండాలన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరుతుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ ఈరోజు చెప్పారు.
దీనదయాళ్ అంత్యోదయ యోజన- జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం బెంగళూరుకు చెందిన ఫాష్‌నియర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యంలోని ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ “మీషో”తో మంత్రిత్వ శాఖ ఎంఓయూపై సంతకం చేసిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. -.
శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, మే, 2014లో మోదీ బాధ్యతలు స్వీకరించినప్పుడు, 2.35 కోట్ల స్వయం సహాయక సంఘాల సభ్యులు ఉండగా, గత 9 సంవత్సరాలలో గ్రామీణ పేద మహిళలకు సాధికారత కల్పించేందుకు దృష్టి సారించిన విధానంతో, స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్య 9 కోట్లకు పైగా పెరిగింది. 2024 నాటికి 10 కోట్ల మంది సభ్యులను చేర్చుకునే లక్ష్యంగా ఉంది.
శ్రీ గిరిరాజ్ సింగ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఆగస్టులో, శ్రీ శైలేష్ కుమార్ సింగ్, అదనపు కార్యదర్శి-RL శ్రీ చరణ్‌జిత్ సింగ్ మీషో సహ వ్యవస్థాపకుడు, CTO అయిన శ్రీ సంజీవ్ బర్న్ వాల్ పరస్పర ఒప్పందంపై సంతకాలు చేసి మార్పిడి చేసుకున్నారు.
2014కి ముందు స్వయం సహాయక సంఘాలకు సంచిత రుణం రూ. 80.000 కోట్లుగా ఉందని, ఇప్పుడు బ్యాంకు లింకేజీ వల్ల గత 9 ఏళ్లలో కేవలం 2.08% ఎన్‌పిఎతో 6.25 లక్షల కోట్లకు పైగా పెరిగిందని శ్రీ గిరిరాజ్ సింగ్ తెలియజేశారు. నిరర్ధక ఆస్తుల విలువ ను ఒక శాతం కంటే తక్కువకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని ఆయన చెప్పారు.
శ్రీ గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ, లబ్ధిదారుల బృందంలో ప్రతి మహిళా స్థానిక ఉత్పత్తుల విక్రయం ద్వారా సంవత్సరానికి కనీసం ఒక లక్ష రూపాయలు ఆదా చేసుకోవాలని, ఇది ప్రధానమంత్రి దార్శనికమన్నారు. కొన్నేళ్లలో 10 లక్షల లక్షాధికారిణిల (లఖ్పతి దీదీల) లక్ష్యాన్ని చేరుకోగలమని విశ్వాసం వ్యక్తం చేసిన ఆయన, వారిలో కొంతమంది దీదీలు కోటీశ్వరులుగా మారే రోజు ఎంతో దూరంలో లేదని అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ నాందిని ప్రస్తావిస్తూ, నేడు స్వయం సహాయక సంఘాల అత్యుత్తమ ఉత్పత్తులు వివిధ దేశాలకు ఎగుమతి అవుతున్నాయని, ఈ-కామర్స్ ద్వారా తమ సముచిత ఉత్పత్తుల గురించి స్థానికంగా, వేదికలు, ఇతర మార్గాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మరింత అవగాహన ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని శ్రీ సింగ్ అన్నారు.
ఆహార ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత మొదలైన వాటిని ఉత్పత్తి చేయడంలో నిమగ్నమై ఉన్న గ్రామీణ స్వయం సహాయక బృంద మహిళలు నిర్వహిస్తున్న వ్యాపారాలకు మద్దతుగా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ప్రభుత్వ కార్యక్రమం అనేక ప్రయత్నాలు చేస్తోందని గ్రామీణాభివృద్ధి మంత్రి తెలియజేశారు. ఉత్పత్తిదారులను మార్కెట్‌లకు అనుసంధానించే ప్రయత్నాలలో భాగంగా, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ రాష్ట్రాల ఉపాధి హామీ పధకాలు సరస్ గ్యాలరీ, స్టేట్ స్పెసిఫిక్ రిటైల్ అవుట్‌లెట్‌లు, జిఇఎమ్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వంటి బహుళ ఛానెల్‌ల ద్వారా స్వయం సహాయక్ సంఘాల సభ్యులు, వ్యవస్థాపకుల నుంచి వాణిజ్య ఉత్పత్తులు ప్రోత్సహించడానికి చర్యలు తీసుకున్నారు.
శ్రీ గిరిరాజ్ సింగ్ మీషోతో చేసుకున్న అవగాహన ఒప్పంద పత్రానికి మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి త్రైమాసికంలో సమీక్షిస్తానని మంత్రిత్వ శాఖ అధికారులకు తెలిపారు. మీషో టీమ్‌తో కలిసి కూర్చుని ఉభయ తారక ప్రతిపాదనపై తీసుకోగలవిషయాలు, ఉత్పత్తులను గుర్తించాలని మంత్రిత్వ శాఖ అధికారులను ఆయన కోరారు.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ శైలేష్ సింగ్ మాట్లాడుతూ, 97% బ్లాక్‌లలో స్వయం సహాయక సంఘాలు ఉనికిలో ఉన్నాయని, వాటిలో 85% నేరుగా మంత్రిత్వ శాఖ నెట్‌వర్క్ తో అనుసంధానమై పనిచేస్తున్నాయని చెప్పారు. ఉత్పత్తులను మెరుగుపరచడానికి వినియోగదారుల డిమాండ్‌ను అర్థం చేసుకోవాలని సంఘాలు, హస్తకళాకారులకు కూడా ఆయన సూచించారు. మార్కెటింగ్ ప్లాట్‌ఫారమ్‌ల అన్వేషణ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లను పొందేందుకు సంఘ మహిళలను సంఘటితం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదని ఆయన అన్నారు.
మీషో సహ వ్యవస్థాపకుడు, CTO శ్రీ సంజీవ్ బర్న్వాల్ మాట్లాడుతూ, మీషోతో ఈ భాగస్వామ్యం దేశవ్యాప్తంగా ఉన్న స్వయం సహాయక సంఘాలు తమ వ్యాపారాలను ప్రారంభించడానికి అంకితమైన చేయూత, కేటలాగింగ్ మద్దతును పొందేలా చేస్తుంది. వారి మొదటి ఆర్డర్‌ను ఎలా రవాణా చేయాలి, వారి ఖాతాలను ఎలా నిర్వహించాలి అనే దానిపై శిక్షణ పొందుతుంది. సంఘ ఉత్పత్తుల కోసం సిఫార్సు చేసిన విక్రేతల ఆన్-బోర్డింగ్ మద్దతు, మీషో సెల్లింగ్ ఖాతాల సృష్టితో సహా జాబితా ఉత్పత్తులు మొదలైనవి.
అదనంగా, మీషో కేటలాగింగ్, ఆర్డర్ నిర్వహణ, ధరలనిర్ణయం ఇంకా వ్యాపారాభివృద్ధిపై శిక్షణనిస్తుందని 100 ఉత్పత్తులకు వ్యక్తిగత అమ్మకందారులకు, 300 ఉత్పత్తుల కోసం అగ్రిగేటర్లకు ఉచిత మద్దతును అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్లాట్‌ఫారమ్ ప్రస్తుతం గ్రామీణ జీవనోపాధి మిషన్ అనుబంధ విక్రేతల కోసం అన్ని ఉత్పత్తులపై జీరో కమీషన్ రుసుమును అందిస్తోంది.
NRLMపై ఒక అవగాహన
మంత్రిత్వ శాఖ తన DAY-NRLM కార్యక్రమం కింద గ్రామీణ భారతీయుల జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి స్వయం సహాయక సంగాలకు పర్యావరణ వ్యవస్థ ద్వారా జీవనోపాధిని మెరుగుపరచడానికి, వాటి సభ్యులకు వారి ఉత్పత్తులకు మెరుగైన లాభదాయకమైన మార్కెట్‌లను అందించడం ద్వారా మెరుగైన ఆదాయాన్ని అందించడానికి కృషి చేస్తోంది. జనవరి 2023 నాటికి, 34 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని 737 జిల్లాల్లో 7,054 బ్లాక్‌లలో జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ తన ఉనికిని కలిగి ఉంది. ఇది మొత్తం 8.79 కోట్ల మంది మహిళలను 81.61 లక్షల స్వయం సహాయక సంఘాలుగా సమీకరించింది, వారు 4.76 లక్షల గ్రామీణ సంస్థలుగా 31,070 క్లస్టర్ లెవల్ ఫెడరేషన్‌లుగా ఉన్నారు.
క్యాపిటలైజేషన్ మద్దతు నిధులతో పాటు కార్యక్రమం ద్వారా అందించిన రూ. 28 వేల కోట్లు, బ్యాంకు రుణాలు రూ. 6.17 లక్షల కోట్లు సంచితంగా స్వయం సహాయక సంఘాలు కూడా పొందాయి. వ్యవసాయ మరియు వ్యవసాయేతర జీవనోపాధి రంగంలో జీవనోపాధి కార్యకలాపాలను ప్రోత్సహించడానికి చాలా నిధుల్ని ఉపయోగించారు . స్వయం సహాయక సంఘ సభ్యుల నిర్వహణలోని 2.30 లక్షలకు పైగా గ్రామీణ సంస్థలు దీన్ దయాళ్ అంత్యోదయ యోజన –జాతీయ గ్రామీణ ఉపాధి పథకం, వ్యవసాయేతర జీవనోపాధి కార్యకలాపాల క్రింద నేరుగా మద్దతు పొందాయి.
ఎస్‌హెచ్‌జిలు మరియు ఎస్‌హెచ్‌జి విక్రేతలు ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లతో పరిచయం పెంచుకుంటున్నారు, కొందరు అలాంటి మరిన్ని ఎంపికలకు తమ పరిధులను విస్తరిస్తున్నారు. మరోవైపు, వారి ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం తమ ప్లాట్‌ఫారమ్‌లను అందించడం ద్వారా గ్రామీణ పేదలకు సహాయం చేయడానికి జాతీయ పధకాలతో సహకరించడానికి రంగాలలో కొత్త బృందాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి.
***
(Release ID: 1900427)
Visitor Counter : 466