రైల్వే మంత్రిత్వ శాఖ
2022-23లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించేందుకు వేగంగా అడుగులేస్తున్న భారతీయ రైల్వే ఉత్పత్తి కర్మాగారాలు
ఎఫ్‌వై23లో జనవరి 31 వరకు 785 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల ఉత్పత్తి
ఎఫ్‌వై23లో జనవరి 31 వరకు 4,175 ఎల్‌హెచ్‌బీ బోగీల ఉత్పత్తి
Posted On:
16 FEB 2023 3:52PM by PIB Hyderabad
భారతీయ రైల్వేకు చెందిన ఉత్పత్తి కర్మాగారాలు 2022-23లో రికార్డు స్థాయి ఉత్పత్తిని సాధించేందుకు వేగంగా అడుగులేస్తున్నాయి.
భారతీయ రైల్వే ఉత్పత్తి యూనిట్లయిన చిత్తరంజన్‌లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ), వారణాసిలోని బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ), పటియాలలోని పటియాలా లోకోమోటివ్ వర్క్స్ (పీఎల్‌డబ్ల్యూ) 2022-23లో జనవరి 3వ తేదీ వరకు 785 ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లను ఉత్పత్తి చేశాయి.
2022-23లో ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ల వాస్తవ ఉత్పత్తి (జనవరి 23 వరకు)
|
చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్ (సీఎల్‌డబ్ల్యూ)
|
344
|
బనారస్ లోకోమోటివ్ వర్క్స్ (బీఎల్‌డబ్ల్యూ)
|
286
|
పటియాలా లోకోమోటివ్ వర్క్స్ (పీఎల్‌డబ్ల్యూ)
|
155
|
మొత్తం
|
785
|
ప్రయాణీకులకు సౌకర్యవంతమైన, వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు భారతీయ రైలు బోగీల ఉత్పత్తి కేంద్రాలు ఎఫ్‌వై23లో జనవరి 31 వరకు 4,175 ఎల్‌హెచ్‌బీ బోగీలను ఉత్పత్తి చేశాయి.
2022-23లో ఎల్‌హెచ్‌బీ కోచ్‌ల వాస్తవ ఉత్పత్తి (జనవరి 23 వరకు)
|
రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్)
|
1221
|
ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)
|
1891
|
మోడర్న్ కోచ్ ఫ్యాక్టరీ (ఎంసీఎఫ్)
|
1063
|
మొత్తం
|
4175
|
***
(Release ID: 1899996)
Visitor Counter : 206