యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

ఖేలో ఇండియా మహిళల వెయిట్ లిఫ్టింగ్, సైక్లింగ్ పోటీలు ఈ నెలలో జరగనున్నాయి

Posted On: 16 FEB 2023 7:33PM by PIB Hyderabad

 

సీనియర్, జూనియర్ & యూత్‌ విమెన్‌ విభాగాల్లో మూడో దశ ఖేలో ఇండియా జాతీయ ర్యాంకుల మహిళల వెయిట్ లిఫ్టింగ్ పోటీలు పట్నాలోని కంకర్‌బాగ్‌లో ఫిబ్రవరి 18-24 తేదీల్లో జరగనున్నాయి. భారత ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమం ఖేలో ఇండియాలో భాగంగా, 'ఖేలో ఇండియా స్పోర్ట్స్ ఫర్ ఉమెన్' విభాగం కింద ఈ పోటీలు జరుగుతాయి.

కేంద్ర యువజన వ్యవహారాలు & క్రీడల మంత్రిత్వ ఆధ్వర్యంలో పని చేస్తున్న క్రీడల విభాగం ఈ టోర్నమెంట్లను నిర్వహిస్తోంది. 3 విభాగాల మహిళల వెయిట్‌ లిఫ్టింగ్ టోర్నమెంట్ల కోసం మొత్తం రూ.1.47 కోట్లు మంజూరయ్యాయి. అన్ని వయసు వర్గాల్లోని 10 వెయిట్‌ లిఫ్టింగుల్లో తొలి 8 ర్యాంకులు పొందిన క్రీడాకారిణుల కోసం కేటాయించిన మొత్తం రూ.48.3 లక్షలు కూడా ఇందులో ఉన్నాయి.

పట్నాలో జరిగే వెయిట్ లిఫ్టింగ్ పోటీల 3వ దశలో దాదాపు 400 మంది క్రీడాకారిణులు పాల్గొంటారు.

ఖేలో ఇండియా యూత్/జూనియర్/ సీనియర్ జాతీయ ర్యాంకుల మహిళల వెయిట్ లిఫ్టింగ్ రెండో దశ జాతీయ టోర్నమెంట్ ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో జరిగింది. మూడు సిరీస్‌ల టోర్నమెంట్‌లో ఇది రెండోది. మొదటి టోర్నమెంట్‌ 2022 జూన్‌లో హిమాచల్ ప్రదేశ్‌లోని నగ్రోటా బగ్వాన్‌లో జరిగింది.

పశ్చిమ జోన్, దక్షిణ జోన్, ఉత్తర జోన్లలో ఈ నెలలో ట్రాక్ & రోడ్ సైక్లింగ్ పోటీలు కూడా నిర్వహించనున్నారు.

పూర్తి షెడ్యూల్:

19 - 20 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- పశ్చిమ జోన్ (రోడ్ ఈవెంట్) - సూరత్, గుజరాత్

21 - 22 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- పశ్చిమ జోన్ (రోడ్ ఈవెంట్) - బరోడా, గుజరాత్

23 - 24 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- పశ్చిమ జోన్ (రోడ్ ఈవెంట్) - అహ్మదాబాద్, గుజరాత్

25 - 26 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- దక్షిణ జోన్ (రోడ్ ఈవెంట్) - అతారీ టోల్ టాక్స్, పంజాబ్

25 - 26 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- దక్షిణ జోన్ (ట్రాక్ ఈవెంట్) – విజయనగర్

26 - 27 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- దక్షిణ జోన్ (ట్రాక్ ఈవెంట్) - జైపూర్, రాజస్థాన్

27 - 28 ఫిబ్రవరి, 2023: ఖేలో ఇండియా మహిళల సైక్లింగ్ పోటీలు- ఉత్తర జోన్ (ట్రాక్ ఈవెంట్) - అమృత్‌సర్, పంజాబ్

 

***



(Release ID: 1899993) Visitor Counter : 158


Read this release in: English , Urdu , Hindi