శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సరికొత్త జియోస్పేషియల్ టెక్నాలజీని కలిగి ఉండేలా సివిల్ సర్వెంట్లు సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలన్న కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
డాక్టర్ సింగ్ హైదరాబాద్‌లోని ఎన్‌ఐజిఎస్‌టి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ & టెక్నాలజీ)ని సందర్శించి అధ్యాపకులు మరియు ట్రైనీలతో సంభాషించారు. అనంతరం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు
నేషనల్ జియోస్పేషియల్ పాలసీ (ఎన్‌జీపి) 2022 ప్రకారం జియోస్పేషియల్ సైన్స్ & టెక్నాలజీ రంగాలలో ఆన్‌లైన్ కోర్సులు ఐజీఒటి కర్మయోగి ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు.
ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు ఎన్‌ఐజిఎస్‌టి పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని..సామర్థ్య విస్తరణ మరియు శిక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు ప్రారంభించామని కేంద్ర మంత్రి చెప్పారు.
Posted On:
16 FEB 2023 3:21PM by PIB Hyderabad
కేంద్ర సైన్స్ & టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత); ఎర్త్ సైన్సెస్ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) ; పీఎంవో, సిబ్బంది, పబ్లిక్ గ్రీవెన్స్, పెన్షన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞాన ఆధారిత పాలనపై ప్రధాని నరేంద్ర మోదీ అభిరుచికి అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యంత ఇటీవలి సాంకేతికతలతో సివిల్ సర్వెంట్ల సామర్థ్యం పెంపుదలలో సరికొత్త జియోస్పేషియల్ టెక్నాలజీని కలిగి ఉంటారని ఈ రోజు ప్రకటించారు.
డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ తాను పనిలో విస్తృత ఏకీకరణ గురించి మరియు ప్రభుత్వ భావన గురించి చెబుతున్నానన్నారు. ఈ రోజు తనతో అనుబంధించబడిన రెండు ముఖ్యమైన మంత్రిత్వ శాఖలైన పర్సనల్/డిఓపిటి మరియు సైన్స్ & టెక్నాలజీ/ డీఎస్‌టి మధ్య ఏకీకరణను చూసేందుకు తాను సంతోషిస్తున్నానని అన్నారు.
సివిల్ సర్వీస్‌ను నిర్మించడంలో కీలక పాత్ర పోషించడానికి జియోస్పేషియల్ టెక్నాలజీలలో ఎన్‌ఐజిఎస్‌టి (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జియో-ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ & టెక్నాలజీ)కి సామర్థ్యం మరియు నైపుణ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నేషనల్ జియోస్పేషియల్ పాలసీ (ఎన్‌జిపి) 2022 ప్రకారం జియోస్పేషియల్ సైన్స్ & టెక్నాలజీ రంగాలలో ఆన్‌లైన్ కోర్సులను ఐజీఒటి కర్మయోగి ప్లాట్‌ఫారమ్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలని ఆయన అన్నారు.
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌లో ఉన్న సౌకర్యాలను పరిశీలించిన మంత్రి అక్కడి అధ్యాపకులు, శిక్షణార్థులతో ముచ్చటించారు. ఎన్‌ఐజిఎస్‌టి మరియు దానిలోని వివిధ సౌకర్యాలు, నిర్వహించిన కోర్సులు మొదలైన వాటి గురించి కేంద్ర మంత్రికి వివరణాత్మక ప్రదర్శనను అందించారు.
ఎన్‌ఐజిఎస్‌టిలో తన ఇంటరాక్షన్ సందర్భంగా, ప్రాథమిక జిఐఎస్, డ్రోన్ సర్వే & మ్యాపింగ్, జిఐఎస్ విశ్లేషణ, ల్యాండ్ సర్వేయింగ్, కాడాస్ట్రల్ మ్యాపింగ్, జిఎన్‌ఎస్‌ఎస్ సర్వేయింగ్, డిజిటల్ మ్యాపింగ్, లైడర్ మ్యాపింగ్, యుటిలిటీ మ్యాపింగ్, 3డీ-సిటీ మ్యాపింగ్, జియోయిడ్ మోడలింగ్,సిఒఆర్‌ఎస్ నెట్‌వర్క్ మొదలైన రంగాలలో సామర్థ్యాలు & పాత్ర ఆధారిత విద్యతో ఎన్‌ఐజిఎస్‌టి పౌర సేవా శిక్షణ పర్యావరణ వ్యవస్థను పెంపొందించగలదని డాక్టర్ సింగ్ చెప్పారు.
ప్రధాని మోదీ నాయకత్వంలోని జాతీయ జియోస్పేషియల్ పాలసీ (ఎన్‌జిపి) 2022 జాతీయ అభివృద్ధి మరియు ఆర్థిక శ్రేయస్సుకు తోడ్పడేందుకు జియోస్పేషియల్ ఎకోసిస్టమ్‌కు సంబంధించిన సమగ్ర అభివృద్ధికి విస్తృతమైన ఫ్రేమ్‌వర్క్‌ను నిర్దేశించిందని డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. జియోస్పేషియల్ స్కిల్ మరియు నాలెడ్జ్ స్టాండర్డ్స్‌ను దేశవ్యాప్తంగా పెంపొందించడంపై ఇది దృష్టి సారించిందన్నారు. ఎందుకంటే జియోస్పేషియల్ నిపుణుల అవసరం ఉందని భౌగోళిక & అనుబంధ సాంకేతికతకు చెందిన విభిన్న రంగాలలో వారి శిక్షణ & అభివృద్ధి విధానంలో వివరించబడిందని తెలిపారు. జియోస్పేషియల్ సైన్స్ & టెక్నాలజీ డొమైన్‌లో ప్రత్యేక కోర్సులలో శిక్షణ అందించడానికి ఎన్‌ఐజిఎస్‌టిని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సిఒఈ)గా అభివృద్ధి చేయడం గురించి ఎన్‌జీపీ నిర్దిష్టంగా మాట్లాడుతుందని కూడా ఆయన చెప్పారు.
ప్రభుత్వం పేర్కొన్న లక్ష్యాలను సాధించేందుకు ఎన్‌ఐజిఎస్‌టి పునర్నిర్మాణ ప్రక్రియ కొనసాగుతోందని అందులో భాగంగా డిజిటల్ క్లాస్‌రూమ్‌లు, ల్యాబ్‌లు, ఫీల్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్, ప్రాక్టికల్ ఫీల్డ్,సర్వేయింగ్, హాస్టల్ సౌకర్యాల ఆధునీకరణతో సామర్థ్య విస్తరణ మరియు శిక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి చర్యలు ప్రారంభించామని కేంద్ర మంత్రి చెప్పారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ (డిఎస్‌టి) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్, బోర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ మరియు బోర్డ్ ఆఫ్ స్టడీస్‌తో కొత్త ఇన్‌స్టిట్యూషనల్ గవర్నెన్స్ సిస్టమ్‌ను ఆమోదించి, అమలు చేసిందని ఆయన పేర్కొన్నారు. ఈ బోర్డులలో ప్రముఖ నిపుణులు, ప్రీమియర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుండి ప్రముఖ సబ్జెక్ట్ నిపుణులు, పరిశ్రమ నిపుణులు మరియు ఎస్‌ఒఐ నుండి సీనియర్ అధికారులు ఉంటారు. ప్రస్తుత సాంకేతికత మరియు వినియోగదారుల క్రియాత్మక అవసరాలకు అనుగుణంగా బోర్డ్ ఆఫ్ స్టడీస్ సిలబస్ మరియు కోర్సు మాడ్యూల్‌లను సవరించిందని డాక్టర్ సింగ్ చెప్పారు. అదేవిధంగా బోర్డ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అన్ని శిక్షణల కోసం మూల్యాంకనం మరియు మూల్యాంకన ప్రక్రియలను సవరించిందని ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లు,
మెంటర్‌షిప్,టెక్నాలజీ సొల్యూషన్స్ వాడకం మొదలైన వాటిని ప్రవేశపెట్టిందని చెప్పారు.
ఎన్‌ఐజిఎస్‌టి (ఇంతకుముందు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయింగ్ & మ్యాపింగ్ లేదా ఐఐఎస్‌ఎం అని పిలిచేవారు) అనేది సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని సర్వేయింగ్ & మ్యాపింగ్ శిక్షణా సంస్థ. ఇది 50 సంవత్సరాలకు పైగా వివిధ దేశాలలో (థాయ్‌లాండ్, నేపాల్, భూటాన్, శ్రీలంక, సౌదీ అరేబియా, ఒమన్ మొదలైన) అలాగే కేంద్రం మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖలు/ఏజెన్సీలు, భద్రతా సంస్థలు, ప్రైవేట్ పరిశ్రమ మొదలైనవాటిలో స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక శిక్షణ మరియు సామర్థ్యాన్ని పెంపొందించడానికి ప్రసిద్ధి చెందింది.
***
(Release ID: 1899935)
Visitor Counter : 164