ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

2023 ఫిబ్రవరి 13 నుండి 15 వరకు లక్నోలో జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మొదటి సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించిన భారతదేశం


డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ), డిజిటల్ ఎకానమీలో సైబర్ సెక్యూరిటీ మరియు డిజిటల్ స్కిల్లింగ్‌కు సంబంధించి ప్రాధాన్యతా రంగాలపై విస్తృత చర్చలు జరిగాయి.

డిజిటల్ స్కిల్స్ గ్యాప్ కారణంగా 2028 నాటికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ $11.5 ట్రిలియన్ల వరకు నష్టపోవచ్చు: నాస్కామ్ మరియు యూనెస్కొ

జీ20 సభ్య దేశాలు మరియు 8 అతిథి దేశాలు చర్చల్లో పాల్గొన్నాయి

ఐటియు,యూఎన్‌డిపీ,ఓఈసీడి,యూనెస్కొ మరియు ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థలు కూడా నాలెడ్జ్ పార్టనర్‌లుగా పాల్గొన్నాయి.

18,000 మందికి పైగా ప్రజలు ఎగ్జిబిషన్ మరియు డిజిటల్ ఇండియా ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను సందర్శించి వాటి అనుభవాన్ని ఆస్వాదించారు

డిజిటల్ వ్యాన్ 75 కంటే ఎక్కువ ప్రాంతాలను సందర్శించింది. 120,000 కంటే ఎక్కువమందిని ఇందులో భాగస్వామ్యం చేసింది.

Posted On: 15 FEB 2023 5:53PM by PIB Hyderabad

భారతదేశంలోని మొదటి జీ20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ (డిఈడబ్ల్యూజీ) సమావేశం ఈరోజు ముగిసింది. భవిష్యత్ డిఈడబ్ల్యూజి సమావేశాలకు అవసరమైన ఉత్పాదక మరియు అర్ధవంతమైన చర్చలకు ఇది టోన్ సెట్ చేసింది. లక్నోలో జరిగిన మూడు రోజుల సమావేశం భారతదేశ  డిజిటల్ పరివర్తన ప్రయాణాన్ని ప్రదర్శించింది. అలాగే డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్‌సెక్యూరిటీ మరియు డిజిటల్ నైపుణ్యం గురించి చర్చించడానికి జీ20 సభ్యులు, కీలకమైన నాలెడ్జ్ భాగస్వాములు మరియు అతిథి దేశాలను ఒకచోట చేర్చింది.
 

image.png

డిఈడబ్ల్యూజీ సమావేశంలో జీ20 ప్రతినిధులు


డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎంఎస్‌ఎంఈల కోసం సైబర్‌ సెక్యూరిటీ సొల్యూషన్స్, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మరియు జియోస్పేషియల్ టెక్నాలజీల వినియోగానికి సంబంధించిన వివిధ అంశాలను కవర్ చేసే ఐదు వర్క్‌షాప్‌లు ప్రారంభోత్సవ రోజు నిర్వహించబడ్డాయి. వీటితో పాటు సమావేశంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర  డిజిటల్ కార్యక్రమాలను ప్రదర్శించారు.

 

image.png

 

భారతదేశ జీ20 షెర్పా, శ్రీ అమితాబ్ కాంత్ డిఈడబ్ల్యూజీ సమావేశంలో ప్రసంగించారు

 

రెండవ రోజున డిఈడబ్ల్యూజీ సమావేశం భారతదేశ  జీ20 షెర్పా శ్రీ అమితాబ్ కాంత్  కీలక ప్రసంగంతో ప్రారంభమైంది. అనంతరం ప్రతినిధులు డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మరియు సైబర్ సెక్యూరిటీ అనే రెండు ప్రాధాన్యతా రంగాలపై సుదీర్ఘంగా చర్చించారు. మరింత భాగస్వామ్య అవగాహన కోసం తదుపరి కార్యవర్గ సమావేశాలలో తదుపరి చర్చలకు తమ సుముఖత వ్యక్తం చేశారు.

కార్యక్రమంలో మిగిలిన రోజు సందర్శకులు బారా ఇమాంబారాకు విహారయాత్రను ప్రారంభించారు. ఇది ఒక నిర్మాణ కళాఖండంగా విస్తృతంగా పరిగణించబడే ఒక చారిత్రాత్మక స్మారక చిహ్నం. అతిథులు స్థానిక సంస్కృతి మరియు సంప్రదాయాలను ఆస్వాదించడానికి మరియు ఆనందించడానికి ఈ ప్రాంతం సరైన వేదికగా ఉంది. సౌండ్, లైట్ మరియు డ్యాన్స్ షోలతో అందరికి చిరస్మరణీయ వాతావరణాన్ని సృష్టిస్తూ రోజు అత్యంత ఉత్సాహంగా ముగిసింది.

చివరి మరియు మూడవ రోజు సమావేశంలో డిజిటల్ స్కిల్లింగ్ ప్రాధాన్యతపై దృష్టి సారించారు. డిజిటల్ నైపుణ్యం కలిగిన భవిష్యత్ సిద్ధంగా ఉన్న శ్రామికశక్తి కోసం భారతదేశం యంత్రాంగాలను ప్రతిపాదించింది. డిఈడబ్ల్యూజీ ఎజెండాలో డిజిటల్ నైపుణ్యాన్ని చేర్చడాన్ని సభ్య దేశాలు ప్రశంసించాయి. భారతదేశం ప్రతిపాదించిన ప్రాధాన్యతా రంగాలకు విస్తృతంగా మద్దతునిచ్చాయి. డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (డిపిఐ), సైబర్ సెక్యూరిటీ ఇన్ డిజిటల్ ఎకానమీ మరియు డిజిటల్ స్కిల్లింగ్ అనే మూడు కీలక ప్రాధాన్యతా రంగాలపై కూడా సారాంశ చర్చలు జరిగాయి. కో-చైర్ మరియు జాయింట్ సెక్రటరీ, ఎంఇఐటివై శ్రీ సుశీల్ పాల్ ముగింపు వ్యాఖ్యలు చేసారు.

 

image.png

జీ20- డిఈడబ్ల్యూజీ చైర్ మరియు సెక్రటరీ, ఎంఇఐటివై శ్రీ అల్కేష్ కుమార్ శర్మ విలేకరులతో ప్రసంగించారు

 

జీ20-డిఈడబ్ల్యూజీ చైర్ మరియు సెక్రటరీ, ఎంఇఐటివై శ్రీ అల్కేష్ కుమార్ శర్మ తన ప్రెస్ బ్రీఫ్‌లో గత మూడు రోజుల ముఖ్య విశేషాలను పంచుకున్నారు. జి20 సభ్య దేశాలు, అతిథి దేశాలు మరియు అంతర్జాతీయ సంస్థలకు ప్రాధాన్యతా రంగాలపై ఉత్తేజకరమైన సంభాషణలకు ధన్యవాదాలు తెలిపారు. డిజిటల్ మొబైల్ వ్యాన్, 75కి పైగా గమ్యస్థానాలకు ప్రయాణించిందని మరియు భారతదేశ డిజిటల్ పరివర్తన ప్రయాణంలో సుమారు 120,000 మంది వ్యక్తులకు ఇంటరాక్టివ్ మరియు లీనమయ్యే అనుభవాన్ని అందించిందని ఆయన పేర్కొన్నారు. వర్చువల్ రియాలిటీలు మరియు వినూత్న పరిష్కారాలను ప్రదర్శించే ప్రదర్శన మరియు అనుభవ కేంద్రం సుమారు 18,000 మంది సందర్శకులను ఆకర్షించింది. ఈ డిఈడబ్ల్యూజీ సమావేశాన్ని నిర్వహించడంలో అద్భుతంగా సహకరించిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలో నిర్వహించాల్సిన నాలుగు షెడ్యూల్‌లలో ఈ డిఈడబ్ల్యూజీ సమావేశం మొదటిదని, తదుపరిది హైదరాబాద్, పూణె మరియు బెంగళూరులో జరుగుతుందని ఆయన తెలిపారు.

 

***


(Release ID: 1899685) Visitor Counter : 240


Read this release in: English , Urdu , Hindi