వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
పరిశ్రమ, వినియోగదారుల విశ్వాసం పెంపొందించే మార్గాలపై కేంద్రం చర్చ
- అంకుర & ఎంఎస్ఎంఈ సంస్థలకు ఐఎస్ 19000:2022 ప్రమాణాలను సులభంగా అందించే అంశంపై చర్చ
Posted On:
15 FEB 2023 4:36PM by PIB Hyderabad
ఐఎస్- 19000:2022 ప్రమాణాల ప్రకారం నకిలీలు లేదా వినియోగదారులను, ప్రజలను తప్పుదారి పట్టించే సమీక్షల ప్రచురణను తనిఖీ చేయడానికి ఆన్‌లైన్ కస్టమర్ సమీక్షల సేకరణ, నియంత్రణ, ప్రచురణలకు సంబంధించిన ప్రక్రియలను ధ్రువీకరించే లక్ష్యంతో ఐఎస్ 19000:2022లో స్కీమ్-కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ పథకంరూపొందించబడింది. ఈ విషయాన్ని వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు, దీనికి సంబంధించి, రోహిత్ కుమార్ ఈ రోజు ఢిల్లీలో ‘ఆన్‌లైన్ వినియోగదారుల సమీక్షలు — వాటి సేకరణ, నియంత్రణ, ప్రచురణ కోసం సూత్రాలు మరియు అవసరాలు’ పేరుతో జరిగిన ఒక సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ తెలిపారు. 'ఆన్‌లైన్ వినియోగదారు సమీక్షలు - వాటి సేకరణ, నియంత్రణ మరియు ప్రచురణకు సంబంధించిన సూత్రాలు మరియు అవసరాలు'పై ప్రామాణిక ఐఎస్ 19000:2022 ప్రకారం ప్రాసెస్ కోసం అనుగుణ్యత మంజూరు, అనుగుణ్యత అంచనా పథకం కింద ఐఎస్ 19000:2022 యొక్క అన్ని అవసరాలకు అనుగుణ్యతను ప్రదర్శించడానికి తగిన అనుగుణ్యత మంజూరు చేయబడింది. ఈ పథకం సంస్థ యొక్క ప్రమాణాలు, బాధ్యతలను మరియు ఆన్‌లైన్ కస్టమర్ సమీక్షల సేకరణ, నియంత్రణ మరియు ప్రచురణకు సంబంధించిన ప్రక్రియల కోసం ధ్రువీకరణ అవసరాల మంజూరు.. నిర్వహణ కోసం అనుబంధ అవసరాలు మరియు పేర్కొన్న ప్రక్రియ యొక్క ధ్రువీకరణకు సంబంధించిన ఛార్జీలను నిర్దేశిస్తుంది. ఈ కన్ఫర్మిటీ అసెస్‌మెంట్ స్కీమ్ ఆన్‌లైన్‌లో ప్రచురించబడిన వినియోగదారు సమీక్షల యొక్క ప్రామాణికత మరియు విశ్వసనీయతను నిర్ధారిస్తుంది మరియు వినియోగదారులకు సమాచారంతో నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది. ఈ-కామర్స్ పరిశ్రమలో వినియోగదారుల రక్షణకు మరియు న్యాయమైన వాణిజ్య పద్ధతులను ప్రోత్సహించే దిశగా ఇది ఒక ప్రధాన అడుగు. విస్తృత శ్రేణి ఉత్పత్తులు (ఉదాహరణకు బట్టలు, ఎలక్ట్రికల్ ఉపకరణాలు, బొమ్మలు, కార్లు మొదలైనవి) మరియు సేవలు (ఉదాహరణకు రెస్టారెంట్లు, హోటల్‌లు, ట్రావెల్ మరియు లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, లాయర్లు మొదలైన వాటి ద్వారా లభించే సేవలు) వినియోగదారుల సమీక్ష యొక్క వేగవంతమైన వృద్ధి సమాచార మార్పిడికి మరింత పారదర్శకమైన మరియు డైనమిక్ మార్గాన్ని సృష్టించడం ద్వారా వినియోగదారులను శక్తివంతం చేయడానికి మరియు పరిశ్రమ వృద్ధిని పెంచడానికి ఈ విధానం తగిన తోడ్పాటును అందిస్తుంది. ఈ సమావేశంలో వినియోగదారుల వ్యవహారాల శాఖ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సీనియర్ అధికారులు పాల్గొన్నారు
***
(Release ID: 1899632)
Visitor Counter : 188