సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దివ్యాంగ జనుల కు సంబంధించిన రంగం లో సహకారాని కి గాను భారతదేశాని కి మరియుదక్షిణ ఆఫ్రికా కు మధ్య ఎమ్ఒయు పై సంతకాల కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి

Posted On: 15 FEB 2023 3:49PM by PIB Hyderabad

దివ్యాంగ జనుల కు సంబంధించిన రంగం లో సహకారాని కి గాను భారతదేశ ప్రభుత్వాని కి మరియు దక్షిణ ఆఫ్రికా గణతంత్ర ప్రభుత్వాని కి మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు) పై సంతకాలు చేయడానికి గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదాన్ని ఇచ్చింది.

 ద్వైపాక్షిక అవగాహన పూర్వక ఒప్పందం దివ్యాంగ జనుల సంబంధి రంగం లో సంయుక్త కార్యక్రమాల ను అమలు పరచడం ద్వారా భారత గణతంత్ర ప్రభుత్వాని కి చెందిన దివ్యాంగ జనుల సాధికారిత విభాగాని కి మరియు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వాని కి మధ్య సహకారాన్ని ప్రోత్సహించనుంది. ఇది భారతదేశాని కి మరియు దక్షిణ ఆఫ్రికా కు మధ్య ద్వైపాక్షిక సంబంధాల ను బలోపేతం చేస్తుంది. పరస్పరం అంగీకారం కుదిరే మేరకు, రెండు దేశాల మధ్య సహకారాని కి సంబంధించిన నిర్దిష్ట ప్రతిపాదనల ను ఎమ్ఒయు చెల్లుబాటు అయ్యే కాలం లో ఆచరణ లోకి తీసుకు రావడం జరుగుతుంది.

రెండు దేశాల లో దివ్యాంగ జనులు (పిడబ్ల్యుడి స్) మరియు వార్ధక్యం బారిన పడ్డ జన సంఖ్య కు మరీముఖ్యం గా అవసరం అయ్యేటటువంటి ఆధునికమైన, విజ్ఞాన శాస్త్ర సంబంధమైన, మన్నికైన, తక్కువ ఖర్చు లో లభ్యం కాగల ఉపకరణాల ను మరియు సహాయక సాధనాల ను అందించాలి అనేది ఈ ఎమ్ఒయు యొక్క ముఖ్య ఉద్దేశ్యం గా ఉంది.

గాంధీ మహాత్ముడు ఒక వంద సంవత్సరాల కాలాని కంటే పూర్వం దక్షిణ ఆఫ్రికా లో సత్యాగ్రహ ఉద్యమాన్ని మొదలు పెట్టిన కాలం నుండి స్వాతంత్య్రం కోసం మరియు న్యాయం కోసం పోరాటం సాగిన నేపథ్యం లో దక్షిణ ఆఫ్రికా మరియు భారతదేశం ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్రాత్మక బంధాన్ని మరియు సంబంధాల ను ఏర్పరచుకొన్నాయని చెప్పాలి. జాతి విచక్షణ కు వ్యతిరేకం గా సాగిన ఉద్యమాని కి సంఘీభావాన్ని వ్యక్తపరచిన అంతర్జాతీయ సముదాయం లో భారతదేశం ముందువరుస లో నిలబడింది. స్వాతంత్య్రం సిద్ధించిన అనంతర కాలం లో, 1993 వ సంవత్సరం లో దక్షిణ ఆఫ్రికా తో దౌత్య సంబంధాల పునరుద్ధరణ చోటు చేసుకొంది. మరి ఆ తరువాత కాలం లో అంటే 1997 వ సంవత్సరం లో మార్చి మాసం లో భారతదేశం మరియు దక్షిణ ఆఫ్రికా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నెలకొల్పుకొన్నాయి. తదనంతరం, దక్షిణ ఆఫ్రికా తో ద్వైపాక్షిక స్థాయి లోను, బిఆర్ఐసిఎస్, ఐబిఎస్ఎ తదితర వేదిక ల ద్వారాను మన మధ్య సన్నిహిత, మిత్రపూర్వక సంబంధాలు దృఢ తరంగా మారాయి. ఆర్థిక సహకారం, వాణిజ్య పరమైన సహకారం, రక్షణ, సంస్కృతి, ఆరోగ్యం, మానవీయ ఒప్పందాలు, సార్వజనిక పరిపాలన, విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం వంటి విభిన్న రంగాల లో రెండు దేశాల కు మధ్య అనేక ద్వైపాక్షిక ఒప్పందాలు రూపు ను దాల్చాయి. మానవ వనరుల అభివృద్ధి లో సహకారాన్ని ప్రోత్సహించడం లో భారతదేశాని కి చెందిన టెక్నికల్ ఎండ్ ఇకానామిక్ కోఆపరేశన్ ప్రోగ్రామ్ (ఐటిఇసి) ఒక ఉపయోగకరమైనటువంటి మాధ్యం గా పాటుపడింది. కోవిడ్-19 మహమ్మారి కి ఎదురొడ్డి పోరాడడం తో పాటుగా ఇతర ప్రపంచ స్థాయి సవాళ్ళ ను పరిష్కరించడం లో దక్షిణ ఆఫ్రికా కు మరియు భారతదేశాని కి మధ్య ద్వైపాక్షిక సహకారం చెప్పుకోదగ్గది గా ఉండింది. వేరు వేరు ఇతర మంత్రిత్వ శాఖలు/విభాగాలు కూడా వాటి కి సంబంధించినటువంటి రంగాల లో సహకారం కోసం ఎమ్ఒయు ల పైన/ఒప్పంద పత్రాల పైన సంతకాలు చేశాయి. ఈ పరిణామాలు దక్షిణ ఆఫ్రికా ప్రభుత్వం తో గాఢతరమైన సంబంధాల ను చాటి చెబుతున్నాయి.

 

****


(Release ID: 1899594) Visitor Counter : 176