మంత్రిమండలి

2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు రూ.4800 కోట్ల ఆర్థిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకం- “వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్” కు క్యాబినెట్ ఆమోదం

Posted On: 15 FEB 2023 3:51PM by PIB Hyderabad

గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం 2022-23 నుండి 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను రూ.4800 కోట్ల ఆర్ధిక కేటాయింపులతో కేంద్ర ప్రాయోజిత పథకం- “వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్” (వివిపి)కి  ఆమోదం తెలిపింది.

ఉత్తర సరిహద్దులోని గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయడం ద్వారా గుర్తించబడిన సరిహద్దు గ్రామాలలో నివసించే ప్రజల జీవన నాణ్యత మెరుగుపడుతుంది. సరిహద్దు ప్రాంతాల్లోని వారి స్థానిక స్థానాల్లో ఉండేలా ప్రజలను ప్రోత్సహించడంలో మరియు ఈ గ్రామాల నుండి వలసలను తిప్పికొట్టడం తోపాటు సరిహద్దు భద్రతను మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

దేశంలోని ఉత్తర భూ సరిహద్దు వెంబడి ఉన్న 19 జిల్లాలు మరియు 46 బోర్డర్ బ్లాక్‌లు మరియు 1 యూటీలో అవసరమైన మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు జీవనోపాధి అవకాశాల కల్పన కోసం ఈ పథకం నిధులను అందిస్తుంది. ఇది సమ్మిళిత వృద్ధిని సాధించడంలో మరియు సరిహద్దు ప్రాంతాలలో జనాభాను నిలుపుకోవడంలో సహాయపడుతుంది. మొదటి దశలో 663 గ్రామాల్లో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు.

ఉత్తర సరిహద్దులోని సరిహద్దు గ్రామాల్లో స్థానిక సహజ మానవ మరియు ఇతర వనరుల ఆధారంగా ఆర్థిక చోదకులను గుర్తించి అభివృద్ధి చేయడం మరియు సామాజిక వ్యవస్థాపకతను ప్రోత్సహించడం, నైపుణ్యం ద్వారా యువత మరియు మహిళల సాధికారత ద్వారా "హబ్ మరియు స్పోక్ మోడల్"లో వృద్ధి కేంద్రాలను అభివృద్ధి చేయడంలో ఈ పథకం సహాయపడుతుంది. అభివృద్ధి మరియు వ్యవస్థాపకత, కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, సహకారాలు, ఎస్‌హెచ్‌జీలు, ఎన్‌జీఓలు మొదలైన వాటి ద్వారా "ఒక గ్రామం-ఒక ఉత్పత్తి" అనే భావనపై స్థానిక సాంస్కృతిక, సాంప్రదాయ జ్ఞానం మరియు వారసత్వం మరియు స్థిరమైన పర్యావరణ-వ్యవసాయ వ్యాపారాల ప్రచారం ద్వారా పర్యాటక సామర్థ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమ లక్ష్యం.

గ్రామ పంచాయతీల సహాయంతో జిల్లా పరిపాలన ద్వారా వైబ్రెంట్ విలేజ్ యాక్షన్ ప్లాన్‌లు రూపొందించబడతాయి. కేంద్ర మరియు రాష్ట్ర పథకాలు 100% సంతృప్తతను నిర్ధారించబడతాయి.

రహదారుతో కనెక్టివిటీ, తాగునీరు, 24x7 విద్యుత్ - సౌర మరియు పవన శక్తిపై దృష్టి కేంద్రీకరించడం, మొబైల్ మరియు ఇంటర్నెట్ కనెక్టివిటీ, పర్యాటక కేంద్రాలు, బహుళ ప్రయోజన కేంద్రాలు మరియు ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు ఈ పథకం ద్వారా దృష్టి కేంద్రీకరించిన అంశాలు.

బోర్డర్ ఏరియా డెవలప్‌మెంట్ ఓరోగ్రామ్‌తో అతివ్యాప్తి ఉండదు. రూ.4800 కోట్ల ఆర్థిక కేటాయింపుల్లో రోడ్ల కోసం  రూ. 2500 కోట్ల రూపాయలను వినియోగిస్తారు.


 

***



(Release ID: 1899577) Visitor Counter : 191