సహకార మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

హర్యానా సహకార శాఖ ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం.. కేంద్రమంత్రి అమిత్ షా చేతుల మీదుగా కర్నాల్‌లో కార్యక్రమ నిర్వహణ..


కేంద్రంలో సహకారానికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ
75వ స్వాతంత్ర్య సంవ‌త్సరంలో

ఇది ప్రధాని నరేద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం..
అనేక కార్యక్రమాలకు నాంది పలికిన సహకార శాఖ..

2025లోగా ప్రతి పంచాయతీలో
పి.ఎ.సి.ఎస్. ఏర్పాటే లక్ష్యం..

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి
65 వేల పి.ఎ.సి.ఎస్.ల ఏర్పాటు..

రానున్న మూడేళ్లలో 2 లక్షల కొత్త పి.ఎ.సి.ఎస్.ల ఏర్పాటుతో..
సహకార శాఖ పరిధి విస్తరణకు బడ్జెట్‌లో ప్రకటన..


సహకార రంగం హర్యానాలో తీసుకున్న చర్యలు
నిరుపేదలకు 'సంజీవని' లాంటివని రుజువు కానున్నాయి.

సహకార సంఘాల కార్యక్రమాలకోసం హర్యానాకు
ఎన్‌.సి.డి.సి.నుంచి రూ. 10,000 కోట్లు విడుదల
రైతుల సహకార సంఘాలకు

తక్కువ వడ్డీ రుణాలకు ఈ మొత్తం వినియోగం.

ఎన్.పి.ఎ. రహితంగా జిల్లా సహకార బ్యాంకులు
లక్ష్యసాధనకోసం ప్రచారం ప్రారంభం


“సహకారిత వాణి” పేరిట ఇంటర్నెట్ రేడియో..
ఒక ఎగుమతి విభాగం ప్రారంభం
, ప్యాకేజింగ్ నుంచి బ్రాండింగ్ వరకు అన్ని సౌకర్యాలూ
రైతులకు అందించనున్న ఎగుమతి విభాగం

వ్యవసాయం, జంతువుల పెంపకం, పాల నాణ్యతపై సమాచారం ‘సహకారిత వాణి’ ద్వారా
రైతులకు ఎప్పటికప్పుడు

Posted On: 14 FEB 2023 8:43PM by PIB Hyderabad

    హర్యానాలోని కర్నాల్‌లో సహకార శాఖకు చెందిన వివిధ ప్రాజెక్టులకుకేంద్ర హోం, సహకార  మంత్రి అమిత్ షా శంకుస్థాపన చేశారు. కొన్ని ప్రాజెక్టులకు ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం కూడా జరిగింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్‌తో సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

   

  ఈ సందర్భంగా అమిత్ షా ప్రసంగిస్తూ, వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తులన్నింటినీ ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసే సహకార ఎగుమతి విభాగాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఇటీవలే నిర్ణయం తీసుకుందని అన్నారు. వివిధ మార్కెట్లు. రాష్ట్రాలు కూడా తమ సొంత ఎగుమతి విభాగాలను ఏర్పాటు చేసుకోవాలని, భారత ప్రభుత్వ ఎగుమతి సంస్థలో ఆ ఎగుమతి ఆ విభాగాలకు సభ్యత్వం ఉండాలని తాను అప్పట్లోనే విజ్ఞప్తి చేశానని అమిత్ షా చెప్పారు. ఇందుకు సంబంధించి హర్యానా ప్రభుత్వం చాలా చక్కగా కృషి చేసిందని ఆయన అన్నారు.

   దేశంలో సహకార మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనేది సహకారంతో సంబంధం ఉన్న ప్రజల చిరకాల కోరికగా ఉందని అమిత్ షా అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన 75వ సంవత్సరంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని, సహకార మంత్రిత్వ శాఖను కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారని అన్నారు. సుమారు ఏడాదిన్నర పదవీ కాలంలో భారత ప్రభుత్వ సహకార మంత్రిత్వ శాఖ అనేక రంగాల్లో కొత్త పుంతలు తొక్కిందన్నారు. దేశంలోప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల (పి.ఎ.సి.ఎస్.) పటిష్టతకు ముందుగా  శ్రీకారం చుట్టామని, వాటి కోసం అధునాతన నిబంధనలను ఏర్పాటు చేశామని, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌లు (సి.ఎస్.సి.లు)గా పి.ఎ.సి.ఎస్.లు  పని చేసేందుకు ఇటీవలే అనుమతించామని చెప్పారు. ఇప్పుడు 20 విభిన్న కార్యకలాపాలను ఇపుడు ఈ పి.ఎ.సి.ఎస్.లు   నిర్వహించగలుగుతున్నాయని ఆయన అన్నారు.

 

   హర్యానాలోని కర్నాల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో ఈ కేంద్రం నిర్మితమైందని అమిత్ షా అన్నారు. సహకార ఎగుమతి విభాగం, టెస్టింగ్, బ్రాండింగ్, బ్యాంక్ లింకేజీ, లెటర్ ఆఫ్ క్రెడిట్ నుంచి ఎగుమతి వరకు అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తామని చెప్పారు. హర్యానా కేంద్ర సహకార సమాఖ్య (హాఫెడ్) ఇప్పటి వరకు రూ.650 కోట్ల విలువైన ఎగుమతులను సాధించిందన్నారు. హర్యానా  పాడి పరిశ్రమ సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఉమ్మడి జంతు సంరక్షణ కేంద్రాన్ని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ స్థాపించారని, పశుగ్రాసం, వెటర్నరీ వైద్యం, టీకాలు వేయడం వంటి అనేక కార్యకలాపాలు ఈ కేంద్రంతో ముడిపడి ఉన్నాయని అమిత్ షా చెప్పారు. దీనితో పేదలకు పశుపోషణతో అనుబంధం ఏర్పడటమే కాకుండా, గ్రామం అంతటా పూర్తి పరిశుభ్ర వాతావరణం నెలకొంటుందని, గోబర్‌గ్యాస్‌ను కూడా ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు.

   దాదాపు రూ.200 కోట్లతో సహకార పాల ప్లాంట్‌ను కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించినట్లు అమిత్ షా తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేయగల సామర్థ్యంతో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. చాలా మంది పశువుల పెంపకందార్లకు ఇది ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. అంతే కాకుండా రూ.150 కోట్లతో ఇథనాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారని, ఇది 90 వేల లీటర్ల రోజువారీ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉందని అన్నారు.  ఇథనాల్ కలపడం వల్ల మన దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల దిగుమతులు తగ్గుతాయని, ఈ సేంద్రియ ఇంధనం వల్ల పర్యావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుందని అన్నారు. 2014లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడిన నాటికి పెట్రోల్‌లో ఇథనాల్ మిశ్రమం ఒక శాతం కంటే తక్కువగా ఉందని, అది నేడు 10శాతానికి మించి పెరిగిందని, 2025 నాటికి దాన్ని 20శాతానికి పెంచుతామని అమిత్ షా చెప్పారు. దీనివల్ల దేశంలో చక్కెర మిల్లుల ఆదాయం పెరుగుతుందని, వ్యవసాయ ఉత్పాదనలు, పశు సంతతి మార్కెట్ (ఎ.పి.ఎం.సి.) వ్యర్థాలు,  వరి ధాన్యం వ్యర్థం వినియోగంలోకి వస్తుందని అన్నారు. దిగుమతులపై దేశం చేసే ఖర్చు కూడా భారీగా తగ్గుతుందని అన్నారు.  

  సహకార సంఘాలను ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా, గ్రామీణ ఆర్థిక కార్యకలాపాలకు వెన్నెముకగా నిలిచేలా మార్చేందుకు ప్రజల్లో తగిన అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని, ఇందుకోసం ఇంటర్నెట్ రేడియో 'సహకారిత వాణి'ని కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించామని అమిత్ షా తెలిపారు. వ్యవసాయం, జంతువుల పెంపకం, పాల నాణ్యత మెరుగుదల తదితర అంశాలకు సంబంధించిన ప్రధాన శాస్త్రీయ సమాచారం,.. ‘సహకారిత వాణి’ ద్వారా ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా రైతులకు అందుబాటులోక వస్తుందని అన్నారు. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న జాతీయ సహకార అభివృద్ధి సంస్థ (ఎన్‌.సి.డి.సి.) ఈరోజు వివిధ సహకార సంఘాల పనుల కోసం హర్యానాకు రూ. 10,000 కోట్లు విడుదల చేసిందని, దీనిని రైతుల సహకార సంఘాలకు తక్కువ వడ్డీకి అందిస్తామని ఆయన చెప్పారు.

 

   సహకార వాతావరణానికి అనుగుణంగా హర్యానాను మార్చేందుకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఎంతో కృషి చేశారని అమిత్ షా అన్నారు. హర్యానా ఎప్పుడూ దేశ భద్రతతో ముడిపడి ఉంటోందని, సాయుధ బలగాల్లోని ప్రతి పదవ సైనికుడు హర్యానా రాష్ట్రానికి చెందిన వ్యక్తేనని ఆయన అన్నారు. ఇది సాహసవంతుల హృదయ వేదిక కావడం హర్యానాకు గర్వకారణమని అన్నారు. ఆహార ధాన్యాలు, పాల ఉత్పత్తిలో హర్యానా రైతు దేశంలోనే రెండవ స్థానం సాధించడం ఒక భారీ విజయమని అన్నారు. హర్యానా క్రీడాకారులు కూడా దేశానికి ఎన్నో పతకాలు సాధించి పెట్టారని అమిత్ షా అన్నారు. ఈనాడు దేశంలోనే పూర్తి విద్యావంతులైన పంచాయితీలు కలిగిన ఏకైక రాష్ట్రం హర్యానా మాత్రమేనని ఆయన అన్నారు. ప్రతి ఇంటికి గ్యాస్ స్టవ్ అందించడం ద్వారా దేశంలోనే మొదటి పొగ రహిత రాష్ట్రంగా హర్యానాను మార్చేందుకు ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఎంతో కృషి చేశారని ఆయన అన్నారు. ఇది కాకుండా, ప్రతి ఇంటికి మరుగుదొడ్ల ఏర్పాటులో కూడా హర్యానా మొదటి స్థానంలో ఉందని, బహిరంగ మల విసర్జన రహిత ప్రాంతాలను (ఒ.డి.ఎఫ్.ను) గరిష్ట సంఖ్యలో కలిగిన గ్రామాలు హర్యానాలోనే ఉన్నాయన్నారు. హర్యానాలో పారిశ్రామికోత్పత్తి వృద్ధి రేటు నేడు 10 శాతంగా ఉందన్నారు. ఇది కాకుండా, అతిపెద్ద సాఫ్ట్‌వేర్ ఎగుమతిదారు హర్యానా గా అవతరించబోతోందని, 4,119 స్టార్టప్‌లను నమోదు చేయడం ద్వారా, స్టార్టప్‌ల రంగంలో కూడా హర్యానా ముందంజలో ఉందని అన్నారు. దేశంలో తయారయ్యే మొత్తం కార్లలో 50శాతం హర్యానా ఒక్కటే ఉత్పత్తి చేస్తుందని అన్నారు. సహకార రంగం అభివృద్ధికోసం ఈ రోజున హర్యానా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టిందని, ఈ చర్యలు పేదలలోని నిరుపేదలకు ‘సంజీవని’గా పనిచేస్తాయని అమిత్ షా అన్నారు.

    జిల్లా సహకార బ్యాంకులను మొండి బాకీల రహితంగా (ఎన్.పి.ఎ. రహితంగా) మార్చేందుకు కార్యాచరణ ప్రారంభించామని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలోని స‌హ‌కార సంఘాలకోసం ఒక పెద్ద ప‌థ‌కాన్ని ఈ ఏడాది బ‌డ్జెట్‌లో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నిర్దేశించారని అమిత్ షా అన్నారు. ఈ పథకం కింద 2025వ సంవత్సరంలోగా దేశంలోని ప్రతి పంచాయతీలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పి.ఎ.సి.ఎస్.లు) ఏర్పాటవుతాయని, 2 లక్షల కొత్త పి.ఎ.సి.ఎస్.లు  తయారవుతాయని చెప్పారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశంలో 65వేల పి.ఎ.సి.ఎస్.లు ఏర్పడ్డాయని, వచ్చే మూడేళ్ల కాలంలో 2 లక్షల పి.ఎ.సి.ఎస్.లను రూపొందించాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. సహకార సంఘం ఎంత భారీ స్థాయికి చేరబోతుందన్నది  దీన్నిబట్టి తెలుస్తోందని. ప్రభుత్వం కొత్త సహకార విధానాన్ని కూడా తీసుకొచ్చిందని ఆయన తెలిపారు.

*****


(Release ID: 1899352) Visitor Counter : 208


Read this release in: English , Urdu , Punjabi