సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

దివ్యాంగుల సాధికారతా విభాగం ఆధ్వర్యంలో 2023 ఫిబ్రవరి 16 నుంచి 25 వ తేదీ వరకు ముంబాయిలో ‘దివ్య కళా మేళా’


కేంద్ర సామాజిక న్యాయం సాధికారతా శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ‘దివ్య కళా మేళా’ను ఫిబ్రవరి 16న ప్రారంభిస్తారు.

24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా హస్తకళాకారులు, కళాకారులు , తమ నైపుణ్యాలను, ఉత్పత్తులను ఈమేళాలో ప్రదర్శిస్తారు.

Posted On: 14 FEB 2023 5:25PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ సామాజిక న్యాయం , సాధికారతా మంత్రిత్వశాఖ కింద గల దివ్యాంగుల సాధికారాతా విభాగం, దేశవ్యాప్తంగా గల దివ్యాంగ హస్తకళాకారులు, ఎంటర్ ప్రెన్యుయర్ల నైపుణ్యాలను, వారి ఉత్పత్తులను ప్రదర్శించేందుకు ప్రత్యేకంగా ఒక మేళాను నిర్వహించనుంది. ‘దివ్య కళా మేళా ’ పేరుతో జరిగే ఈ మేళాను ముంబాయిలోని ఎంఎంఆర్డిఎ‌‌–1 , బంద్రా కుర్లా కాంప్లెక్స్లో 2023 ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 25 వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఈ మేళా జమ్ముకాశ్మీర్, ఈశాన్య  రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన దివ్యాంగ హస్తకళాకారులుల, కళాకారుల నైపుణ్యాలను, వారి ఉత్పత్తులను చేనేత వస్త్రాలు, ఎంబ్రాయిడరీవర్క్లు, ప్యాకేజ్డ్ ఫుడ్ తదితరాలను ప్రజలముందుకు తీసుకురానుంది. ఈ మేళా సందర్శకులకు అద్భుత అనుభూతిని కలిగించనుంది.

200 మందికి పైగా దివ్యాంగ కళాకారులు, వివిధ నైపుణ్యాలు కలిగినవారు , హస్తకళాకారులు, ఎంటర్ప్రెన్యుయర్లు,24 రాష్ట్రాలు, కేంద్ర ప్రాంతాలనుంచి  వచ్చి ఈ మేళాలో పాల్గొంటారు.
వారు తమ నైపుణ్యాలను, ఉత్పత్తులను ఈ మేళాలో ప్రదర్శిస్తారు. గృహా లంకరణ, జీవన శైలికి సంబంధించిన వస్తువులు, దుస్తులు,  స్టేషనరి, పర్యావరణ హితకర ఉత్పత్తులు, పాకేజ్ డ్  ఫుడ్, ఆర్గానిక్ ఉత్పత్తులుల, ఆటబొమ్మలు, బహుమతులు , వ్యక్తిగత అవసరాలకు వాడుకునే వస్తువులు, ఆభరణాలు,      వంటి వివిధ కేటగిరీలలో వారు తమ ఉత్పత్తులను ,నైపుణ్యాలను ప్రదర్శించనున్నారు. వీరి అద్భుత నైపుణ్యాలు, వారి పట్టుదలను ఇందులో చూసి ఆయా ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు.  పది రోజుల పాటు జరిగే ఈ దివ్యాంగుల కళా మేళా ఉదయం 11 గంటలనుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచే ఉంటుంది. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. వీటిలో దివ్యాంగ కళాకారులు, ప్రముఖ వ్యక్తులు పాల్గొంటారు. ఈ ఈవెంట్ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన, తమకు ఇష్టమైన  ఆహారపదార్థాలను రుచి చూసే అవకాశం ఉంది.
   ఈ దివ్యాంగుల కళామేళాను ఫిబ్రవరి 16 వ తేదీ సాయంత్రం 5 గంటలకు కేంద్ర సామాజిక న్యాయం , సాధికారతా శాఖ మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి సామాజిక న్యాయం, సాధికారతా శాఖ సహాయమంత్రి శ్రీ రామ్దాస్ అథవాలే హాజరవుతారు. దివ్యాంగుల కళా మేళాను ప్రతి ఏడాదీ పెద్ద ఎత్తున నిర్వహించేందుకు దివ్యాంగుల సాధికారతా విభాగం పెద్ద ఎత్తున ప్రణాళికలు రూపొందిస్తోంది. దీనిని ఢిల్లీ , ముంబాయిలకే పరిమితం చేయకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో  నిర్వహించనున్నారు.

***



(Release ID: 1899260) Visitor Counter : 165


Read this release in: English , Urdu , Hindi , Punjabi