వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

డిసెంబరు, 2022లో నమోదైన 4.95% నుండి 2023 జనవరి (జనవరి, 2022 కంటే) నెలలో ఆల్ ఇండియా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) ఆధారంగా 4.73% (తాత్కాలిక)కి పడిపోయిన వార్షిక ద్రవ్యోల్బణం


జనవరి, 2023 నెలలో భారతదేశంలో టోకు ధరల సూచిక సంఖ్యలు (ప్రాథమిక సంవత్సరం: 2011-12)

Posted On: 14 FEB 2023 12:32PM by PIB Hyderabad

డిసెంబరు, 2022లో నమోదైన 4.95% తో పోలిస్తే 2023, జనవరి నెల (జనవరి, 2022 కంటే) కి ఆల్ ఇండియా హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ (WPI) సంఖ్య ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం 4.73% (తాత్కాలిక) గా ఉంది. జనవరి, 2023లో ద్రవ్యోల్బణం రేటు తగ్గుదల అనేది ప్రధానంగా ఖనిజ నూనెలురసాయనాలు రసాయన ఉత్పత్తులువస్త్రాలుముడి పెట్రోలియం సహజ వాయువువస్త్రాలు మరియు ఆహార ఉత్పత్తులు ద్వారా అందించడం జరుగుతుంది. గత మూడు నెలలకు సంబంధించిన అన్ని వస్తువులు మరియు WPI భాగాల సూచిక సంఖ్యలు మరియు ద్రవ్యోల్బణం రేటు క్రింద ఇవ్వడం జరిగింది:

సూచిక సంఖ్యలు మరియు వార్షిక ద్రవ్యోల్బణం రేటు (Y-o-Y in %)*

అన్ని నిత్యావసరాలు / ప్రధాన సమూహాలు

బరువు (%)

Nov-22 (F)

Dec-22 (P)

Jan-23 (P)

సూచిక

ద్రవ్యోల్బణం

సూచిక

ద్రవ్యోల్బణం

సూచిక

ద్రవ్యోల్బణం

అన్ని నిత్యావసరాలు

100

152.5

6.12

150.4

4.95

150.6

4.73

I. ప్రాథమిక ఉత్పత్తులు

22.6

178.4

5.94

172.4

2.38

174.0

3.88

II. ఇంధనం & శక్తి

13.2

162.8

19.71

158.0

18.09

155.8

15.15

III. తయారు చేసిన ఉత్పత్తులు

64.2

141.3

3.44

141.1

3.37

141.3

2.99

ఆహార సూచిక

24.4

174.9

2.52

170.3

0.65

171.2

2.95

 

 

గమనిక: P: ప్రొవిజనల్, F: ఫైనల్, * WPI ద్రవ్యోల్బణం యొక్క వార్షిక రేటు మునుపటి సంవత్సరం సంబంధిత నెల ఆధారంగా లెక్కించడం జరుగుతుంది.

 

2. డిసెంబర్2022తో పోల్చితే జనవరి2023లో WPIలో నెలవారీ మార్పు 0.13 %గా ఉంది. గత ఆరు నెలలుగా WPIలో నెలవారీ మార్పు విలువలను సంగ్రహించి క్రింద పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది:

 

WPI సూచికలో నెలవారీగా (M-o-M in %) వచ్చిన మార్పు#

అన్ని నిత్యావసరాలు / ప్రధాన సమూహాలు

బరువు

Aug-22

Sep-22

Oct-22

Nov-22

Dec-22 (P)

Jan-23 (P)

అన్ని నిత్యావసరాలు

100.00

-0.52

-0.85

0.66

-0.26

-1.38

0.13

I. ప్రాథమిక ఉత్పత్తులు

22.62

0.68

-1.35

3.01

-1.55

-3.36

0.93

II. ఇంధనం & శక్తి

13.15

-4.44

-0.50

-0.25

3.04

-2.95

-1.39

III. తయారు చేసిన ఉత్పత్తులు

64.23

0.00

-0.70

-0.21

-0.42

-0.14

0.14

ఆహార సూచిక

24.38

1.15

-0.62

1.48

-1.58

-2.63

0.53

 

 

గమనిక: P: ప్రొవిజనల్, #నెలవారీ మార్పు రేటు అనేది నెల నెల (M-o-M) WPI ఆధారంగా గత నెలలోని విలువ ఆధారంగా లెక్కిస్తారు.

3. WPI యొక్క ప్రధాన సమూహాలలో నెలవారీ మార్పు:

       i.          ప్రాథమిక ఉత్పత్తులు (బరువు 22.62%):- డిసెంబర్ 2022 నెలలో 172.4 (తాత్కాలిక) నుండి జనవరి2023లో ఈ ప్రధాన సమూహం యొక్క సూచిక 0.93% పెరిగి 174.0 (తాత్కాలిక)కి పెరిగింది. ఖనిజాల ధరలు (2.62%)ఆహారేతర ఉత్పత్తులు (1.58%) మరియు ఆహార ఉత్పత్తులు (0.92%)  డిసెంబరు2022తో పోలిస్తే 2023 జనవరిలో పెరిగాయి. క్రూడ్ పెట్రోలియం సహజ వాయువు ధరలు డిసెంబర్ 2022తో పోలిస్తే 2023 జనవరిలో 0.85% తగ్గాయి.

      ii.          ఇంధనం శక్తి (బరువు 13.15%):- డిసెంబర్2022 నెలలో 158.0 (తాత్కాలిక) నుండి జనవరి2023లో ఈ ప్రధాన సమూహం యొక్క సూచిక 1.39% క్షీణించి 155.8 (తాత్కాలిక)కు తగ్గింది. డిసెంబర్2022తో పోలిస్తే జనవరి2023లో మినరల్ ఆయిల్స్ ధరలు 2.13% తగ్గాయి.

     iii.          తయారు చేసిన ఉత్పత్తులు (బరువు 64.23%):- ఈ ప్రధాన సమూహం యొక్క సూచిక డిసెంబర్2022 నెలలో 141.1 (తాత్కాలిక) నుండి జనవరి2023 (తాత్కాలిక) లో 0.14% పెరిగి 141.3 కి చేరింది. 22 NIC రెండు అంకెల సమూహాలలో తయారీ ఉత్పత్తులు12 గ్రూపుల ధరలు పెరగగా10 గ్రూపుల ధరలు తగ్గాయి. ధర పెరుగుదల అనేది ప్రధానంగా ప్రాథమిక లోహాలు, పొగాకు ఉత్పత్తులువిద్యుత్ పరికరాలుకంప్యూటర్ఎలక్ట్రానిక్ ఆప్టికల్ ఉత్పత్తులుమోటారు వాహనాలుట్రైలర్‌లు సెమీ ట్రైలర్‌లుఇతర రవాణా పరికరాలుముద్రణ రికార్డ్ చేయబడిన మీడియా పునరుత్పాదన మొదలైన అంశాల ఆధారంగా ఉంటుంది. డిసెంబర్ 2022తో పోలిస్తే 2023 జనవరిలో ధరలు తగ్గుముఖం పట్టిన కొన్ని సమూహాలు ఇతరత్రా తయారీ విభాగాలైనటెక్స్టైల్స్రసాయన రసాయన సంబంధిత ఉత్పత్తులుయంత్రాలు పరికరాలు మినహా ఫ్యాబ్రికేటెడ్ మెటల్ ఉత్పత్తులురబ్బర్ ప్లాస్టిక్ ఉత్పత్తులు, ధరించే దుస్తులు.. మొదలైనవి.

 

4. WPI ఆహార సూచిక (బరువు 24.38%): ప్రాథమిక ఉత్పత్తులు సమూహం నుండి 'ఆహార ఉత్పత్తులుమరియు తయారు చేసిన ఉత్పత్తుల సమూహం నుండి 'ఆహార ఉత్పత్తుల' తో కూడిన ఆహార సూచిక డిసెంబర్2022లో 170.3 నుండి జనవరి2023లో 171.2కి పెరిగింది. WPI ఆహార సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణం రేటు డిసెంబర్2022లో 0.65% నుండి జనవరి2023లో 2.95%కి పెరిగింది.

5. నవంబర్2022 నెల తుది సూచిక (ఆధార సంవత్సరం: 2011-12=100): నవంబర్2022 నెలలో 'అన్ని నిత్యావసరాలుకోసం తుది టోకు ధర సూచిక మరియు ద్రవ్యోల్బణం రేటు (ఆధారం: 2011-12=100 ) వరుసగా 152.5 మరియు 6.12% వద్ద ఉన్నాయి. జనవరి2023కి సంబంధించిన వివిధ నిత్యావసర వస్తువుల సమూహాలకు సంబంధించిన ఆల్ ఇండియా టోకు ధరల సూచీలు మరియు ద్రవ్యోల్బణ రేట్ల వివరాలు అనుబంధం I లో ఉన్నాయి. గత ఆరు నెలల్లో వివిధ వస్తువుల సమూహాలకు WPI ఆధారంగా వార్షిక ద్రవ్యోల్బణం (Y-o-Y) అనుబంధం IIలో ఉన్నాయి. గత ఆరు నెలల్లో వివిధ నిత్యావసర సమూహాలకు  సంబంధించిన WPI అనుబంధం IIIలో ఉంది.

6. రెస్పాన్స్ రేటు: జనవరి2023కి WPI 84.2 శాతం వెయిటెడ్ రెస్పాన్స్ రేట్‌తో కంపైల్ చేయడం జరిగింది. అయితే నవంబర్2022కి సంబంధించిన తుది సంఖ్య 93.5 శాతం వెయిటెడ్ రెస్పాన్స్ రేట్‌పై ఆధారపడి ఉంటుంది. WPI యొక్క రివిజన్ పాలసీ ప్రకారం WPI యొక్క తాత్కాలిక గణాంకాలు పునర్విమర్శకు లోనవుతాయి. ఈ పత్రికా ప్రకటనఅంశం సూచీలు మరియు ద్రవ్యోల్బణం సంఖ్యలు మా హోమ్ పేజీ http://eaindustry.nic.in లో అందుబాటులో ఉన్నాయి.

7. పత్రికా ప్రకటన విడుదల యొక్క తదుపరి తేదీ: ఫిబ్రవరి2023 నెల యొక్క WPI విలువలు 14/03/2023న విడుదల చేయడం జరుగుతుంది.

గమనిక: DPIIT ప్రతి నెల 14వ తేదీన (లేదా తదుపరి పని దినం) రెఫరెన్స్ నెలలో రెండు వారాల వ్యవధితో భారతదేశంలో టోకు ధరల సూచిక సంఖ్యలను నెలవారీ ప్రాతిపదికన విడుదల చేసింది మరియు సూచికల సంఖ్యలు అలాగే దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన తయారీ యూనిట్లు, సంస్థాగత మూలాల నుండి అందుకున్న డేటాతో సంకలనం చేస్తారు. ఈ పత్రికా ప్రకటనలో జనవరి2023 (తాత్కాలిక)నవంబర్2022 (చివరి) మరియు ఇతర నెలలు/సంవత్సరాల కోసం WPI (బేస్ ఇయర్ 2011-12=100) ఉంది. WPI యొక్క తాత్కాలిక గణాంకాలు 10 వారాల తర్వాత ఖరారు చేయడం జరుగుతుంది. అలాగే ఆ తర్వాత స్తంభింపజేయడం కూడా జరుగుతుంది.

 

అనుబంధం-I

 

జనవరి, 2023 లో ఆల్ ఇండియా హోల్ సేల్ ధరల సూచీలు మరియు ద్రవ్యోల్బణం రేట్లు (ప్రాథమిక సంవత్సరం: 2011-12=100)

నిత్యావసరాలు / ప్రధాన సమూహాలు / సమూహాలు / ఉప-సమూహాలు / వస్తువులు

బరువు

సూచిక

(Jan-23)*

తాజా నెలవారీ

సంచిత ద్రవ్యోల్బణం (YoY)

WPI ఆధారిత ద్రవ్యోల్బణం రేటు (YoY)

2021-2022

2022-2023*

2021-2022

2022-2023*

Jan-22

Jan-23*

అన్ని నిత్యావసరాలు

100

150.6

0.35

0.13

12.78

10.84

13.68

4.73

I. ప్రాథమిక ఉత్పత్తులు

22.62

174.0

-0.53

0.93

9.30

11.48

15.60

3.88

A. ఆహార ఉత్పత్తులు

15.26

176.1

-2.66

0.92

3.31

7.76

10.40

2.38

తృణధాన్యాలు

2.82

188.9

0.43

1.72

0.60

11.23

5.48

15.46

 

***


(Release ID: 1899249) Visitor Counter : 245