రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

భారతదేశాన్ని ఎంఆర్‌ఓ హబ్‌గా అభివృద్ధి చేయడానికి ఉమ్మడిగా కృషి చేయాలని పిలుపు నిచ్చిన రక్షణ మంత్రి


నిర్వహణ మరియు సహాయ కార్యక్రమాల్లో స్వదేశీకరణ ఆవశ్యకతను నొక్కి చెప్పిన శ్రీ రాజ్‌నాథ్ సింగ్

ప్రైవేట్ పరిశ్రమకు ఐఏఎఫ్ అవసరాలను తెలియజేయడానికి నిర్వహించిన సెమినార్‌కు హాజరైన రక్షణ మంత్రి

Posted On: 14 FEB 2023 5:52PM by PIB Hyderabad

భారతదేశాన్ని మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్‌హాల్ (ఎంఆర్‌ఓ) హబ్‌గా అభివృద్ధి చేయడానికి ఉమ్మడిగా  కృషి చేయాలని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. మన రక్షణ పరికరాలు మరియు వ్యవస్థలను రక్షించడానికి మరియు మన రక్షణ దళాలను సంరక్షించడానికి ఎంఆర్‌ఓ సేవల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఫిబ్రవరి 14, 2023న ఏరో ఇండియా 2023లో భారత వైమానిక దళం నిర్వహించిన “సస్టెన్స్ ఇన్ ఎంఆర్‌ఓ అండ్ అబ్సోలెసెన్స్ మిటిగ్రేషన్: ఓపి కెపబిలిటి హెన్‌హెన్సర్స్ ఇన్ ఎయిరోస్పెస్ డొమైన్” అనే అంశంపై జరిగిన సెమినార్ ప్రారంభ సెషన్‌లో ఆయన ప్రసంగించారు. స్వదేశీ పరికరాలను ఉపయోగించడం ద్వారా మన రక్షణ దళాల విశ్వాసం మరియు నైతికత బలపడుతుందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభిప్రాయపడ్డారు. భౌగోళిక-రాజకీయ పరిణామాల కారణంగా భారతదేశం తన రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటోందని, జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి మన రక్షణ దళాలకు అత్యుత్తమ పరికరాలు మరియు ప్లాట్‌ఫారమ్‌లను అందుబాటులో ఉంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. పోరాట సంసిద్ధతతో పాటు రక్షణ ఉత్పత్తి మరియు సంసిద్ధతలో ఆత్మనిర్భర్తపై ప్రభుత్వం దృష్టి సారించిందని శ్రీ రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఫలితంగా రక్షణ ఉత్పత్తి రంగంలో భారత్ ముందుకెళ్తోందని వివరించారు.

ఆకాష్ వెపన్ సిస్టమ్, ఎల్‌సిఏ తేజస్, లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ మరియు 15 లైట్ కంబాట్ హెలికాప్టర్ 'ప్రచండ్‌'కు  ఆర్డర్ వంటి ఐఏఎఫ్‌లో స్వావలంబనను అభివృద్ధి చేయడానికి చేపట్టిన పలు కార్యక్రమాలను రక్షణ మంత్రి జాబితా చేశారు. భవిష్యత్తులో సాయుధ దళాలలో 160 ప్రచండ్ హెలికాప్టర్లు ఉంటాయని కూడా ఆయన తెలియజేశారు. సాయుధ బలగాలు ఇతర దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఈ చర్యలు దోహదపడతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. "మనం అత్యుత్తమ పరికరాలు మరియు వ్యవస్థలను కొనుగోలు చేయవలసి ఉన్న నేపథ్యంలో భారత రక్షణ రంగాన్ని బలోపేతం చేయడానికి మన స్వంత పరికరాలు మరియు వ్యవస్థలను అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టాలి" అని ఆయన అన్నారు.

స్వదేశీకరణకు ఊతమివ్వాల్సిన ఆవశ్యకతపై శ్రీ రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ‘బయ్ ఇండియన్- ఐడిడిఎమ్’ కేటగిరీలో కనీసం 50% స్వదేశీ కంటెంట్ అవసరం. ప్రస్తుతం నిర్వహణను కలిగి లేదని పేర్కొన్నారు. సేకరణ ఖర్చుతో పాటు నిర్వహణ మరియు మద్దతు 50% స్వదేశీ కంటెంట్ కలిగి ఉండాలని సూచించారు. రక్షణ ఉత్పత్తుల మొత్తం జీవితకాలంలో వాటి ధరను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని ఆయన ఇంకా సూచించారు. "సేవ మరియు నిర్వహణతో సహా అధిక విలువ కలిగిన రక్షణ పరికరాల లైఫ్ సైకిల్ ధరను కొనుగోలు చేసే సమయంలో ఈ ఉత్పత్తులపై వారి వినియోగించదగిన జీవితకాలం మొత్తం వ్యయం స్పష్టమైన అంచనా కోసం మరియు డబ్బుకు మంచి విలువను పొందేందుకు వీలుగా పరిశీలించాలి" అని ఆయన సూచించారు. ఇది మొత్తం ఆర్థికపరమైన చిక్కులను అర్థం చేసుకోవడానికి మరియు నిర్దిష్ట రక్షణ పరికరాలలో స్వదేశీకరణ స్థాయిని అంచనా వేయడానికి కూడా వీలు కల్పిస్తుందని ఆయన అన్నారు.

భద్రతా రంగంలోనే కాకుండా స్వయం ప్రతిపత్తి పరంగా కూడా ఐఏఎఫ్ కొత్త శిఖరాలను అందుకోగలదని రక్షణ మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. స్వావలంబన కలిగిన వైమానిక దళాన్ని నిర్మించే ప్రయత్నాలను ప్రోత్సహిస్తుందని సెమినార్ నిర్వహించడం అభినందనీయమన్నారు. సిరియా మరియు టర్కీలో భూకంపాల సమయంలో ఐఏఎఫ్ అంకితభావాన్ని మరియు దాని పాత్రను మొదటి ప్రతిస్పందనగా మరియు సహాయక చర్యలను కూడా ఆయన ప్రశంసించారు. ఈ ప్రయత్నాలు అంతర్జాతీయ సంబంధాలకు భారతదేశ  సహకారాన్ని మరియు ప్రపంచం పట్ల దాని కర్తవ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని అన్నారు.

ప్రారంభ సెషన్‌లో రక్షణ మంత్రి ఐఏఎఫ్ ఎలక్ట్రానిక్ మెయింటెనెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఇ-ఎంఎంఎస్‌)ని కూడా ప్రారంభించారు. ఇ-ఎంఎంఎస్‌ అనేది ప్రపంచంలో అమలు చేయబడిన అతిపెద్ద మరియు సాంకేతికంగా సంక్లిష్టమైన డిజిటల్ ఎంటర్‌ప్రైజ్ అసెట్ మేనేజ్‌మెంట్ సొల్యూషన్‌లలో ఒకటి. ఐఏఎఫ్‌కు చెందిన ఇన్నోవేషన్ మరియు స్వదేశీకరణ అవసరాల సంకలనాలు మరియు ఐఏఎఫ్ మెయింటెనెన్స్ జర్నల్ కూడా విడుదల చేయబడ్డాయి. అంతకుముందు ప్రారంభ సెషన్‌లో ఎయిర్‌స్టాఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి స్వాగత ప్రసంగం చేశారు. లెగసీ ఫ్లీట్‌ల అప్‌గ్రేడేషన్ మరియు పోషణ కోసం ఎంఎస్ఎంఈలు మరియు స్టార్టప్‌ల సహకారాన్ని ఆయన హైలెట్ చేశారు. ఐఏఎఫ్ సామర్థ్యాన్ని పెంపొందించడం మరియు సాంకేతికతలను సమీకరించడం, ఆర్ అండ్ డి కేంద్రాలను ఏర్పాటు చేయడం మరియు సాయుధ దళాల భవిష్యత్తు అవసరాలను తీర్చడానికి ఆచరణీయ వ్యాపార ప్రణాళికలను రూపొందించడం వంటి ఐఏఎఫ్ లక్ష్యాలలో అవకాశాలను తీసుకోవాలని ఆయన ఏరోస్పేస్ మరియు రక్షణ పరిశ్రమను కోరారు. పార్ట్ టెస్టింగ్ మరియు ఔట్‌సోర్సింగ్ ద్వారా ఓవర్‌హాల్‌కు భారీ సంభావ్యత ఉందని కూడా ఆయన వివరించారు. ఐఏఎఫ్ సుమారు 65,000 విడిభాగాల జీవితాలను ఎలా విజయవంతంగా స్వదేశీకరించిందో కూడా ఆయన ప్రస్తావించారు.

ఐఏఎఫ్ స్వదేశీకరణ మరియు ఆర్‌ఓహెచ్ అవసరాలపై రెండవ సెషన్ దృష్టి సారించింది. 'ఎంఆర్‌ఓకు స్కోప్, వాడుకలో లేని తగ్గింపు & మరమ్మతు సాంకేతికత అభివృద్ధి, సర్టిఫికేషన్ ప్రక్రియ, ఎంఆర్‌ఓ అవకాశాలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై పరిశ్రమ దృక్పథం మరియు షెల్ఫ్ టెక్నాలజీలో వాణిజ్యపరంగా అవకాశాలు మరియు సవాళ్లు ఈ సదస్సులో చర్చనీయాంశాలుగా ఉన్నాయి.

ఐఏఎఫ్ ఆదాయ స్వదేశీకరణ మరియు మరమ్మత్, ఓవర్‌హాల్ (ఆర్‌ఓహెచ్) అవసరాలను ప్రైవేట్ సంస్థకు తెలియజేయడానికి ఈ సెమినార్ జరిగింది. ఆత్మనిర్భర్ భారత్ సాధన కోసం ప్రణాళికలను రూపొందించడానికి పరిశ్రమ మరియు ఐఏఎఫ్‌కు ఇది ఒక వేదికను అందించింది. ఆర్మీ స్టాఫ్ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, హర్యానా ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ చౌతాలా, రక్షణ మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, రక్షణ దళాలు, డిపిఎస్‌యులు, డిఆర్‌డిఓ, ప్రైవేట్ పరిశ్రమలు (భారత కంపెనీలతో సహకరిస్తున్న విదేశీ ఓఈఎంలతో సహా), ఐఏఎఫ్  సిబ్బంది మరియు ప్రతినిధులు వివిధ ఆపరేషనల్ మరియు మెయింటెనెన్స్ డైరెక్టరేట్లు కూడా సదస్సులో పాల్గొన్నారు.

***


(Release ID: 1899248) Visitor Counter : 168


Read this release in: English , Urdu , Hindi , Punjabi