జల శక్తి మంత్రిత్వ శాఖ
2023 ఫిబ్రవరి 13 నుంచి 14 వరకు పూణెలో జరగనున్న నదీ తీర ప్రాంత నగరాల సభ్యుల వార్షిక -ధార సమావేశం
సమావేశాలు రోజున కీలక ఉపన్యాసం ఇవ్వనున్న కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్
Posted On:
12 FEB 2023 1:12PM by PIB Hyderabad
నగరాల మీదుగా ప్రవహిస్తున్న నదుల పరిరక్షణ, అభివృద్ధి కోసం సమగ్ర కార్యాచరణ రూపొందించడానికి నదీ తీర ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు సభ్యులు ( ఆర్‌సిఎ )గా ఏర్పాటైన"ధార " వార్షిక సమావేశం 2023 ఫిబ్రవరి 13,14 తేదీల్లో పూణేలో జరగనున్నది. జాతీయ పట్టణ వ్యవహారాల సంస్థ ( ఎన్ఐయూఏ) సహకారంతో నేషనల్ మిషన్ ఫర్ గంగ (ఎన్ఎంసిజి ) నిర్వహిస్తున్న సమావేశం తొలిరోజున కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ కీలక ఉపన్యాసం ఇస్తారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ కౌశల్ కిషోర్ రెండో రోజున ప్రసంగిస్తారు. దేశంలో నదీ తీరాల వెంబడి ఉన్న 95 నగరాలకు చెందిన కమిషనర్లు, చీఫ్ ఇంజినీర్లు, సీనియర్ శాఖలకు చెందిన సీనియర్ అధికారులు సభ్యులుగా "ధార" ఏర్పాటయింది. సమావేశంలో స్థానిక నీటి వనరుల, యాజమాన్యం పై విస్తృత స్థాయి చర్చలు జరుగుతాయి.
జీ-20 అధ్యక్షత వహిస్తున్న భారతదేశం పట్టణ ప్రాంతాల అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో జరుగుతున్న "ధార" సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.జీ-20 లో భాగంగా ఏర్పాటైన యూ-20 పట్టణ ప్రాంతాల్లో నీటి భద్రత కల్పించే అంశంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని నిర్ణయించింది. దీనికోసం నదుల పాత్ర కీలకంగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రెండు రోజుల పాటు జరిగే "ధార 2023" సమావేశాల్లో నదుల నిర్వహణ అంశాలపై ప్రత్యేకంగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించారు. మొదటి రోజున ' నది సంబంధిత అంశాలపై నిర్వహించిన అధ్యయనాలు-ఫలితాలు' అనే అంశంపై సదస్సు నిర్వహిస్తారు. సరస్సులు, నదులు,చెరువుల పునరుజ్జీవనంతో సహా పట్టణ నదుల నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలు, సమస్య పరిష్కారానికి వినూత్నంగా చేయాల్సిన చర్యలు,వికేంద్రీకృత జల వనరుల నిర్వహణ, నది సంబంధిత ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, భూగర్భ జల వనరుల నిర్వహణ, వరదల నివారణ తదితర అంశాలపై చర్చలు జరుగుతాయి. నదుల నిర్వహణకు సంబంధించి డెన్మార్క్ లో అమలు జరుగుతున్న విధానాలు,నీటి పునర్వినియోగం కోసం ఇజ్రాయెల్‌లో ఉపయోగిస్తున్న విధానాలు, మైదాన ప్రాంతాల్లో వరదల నివారణ కోసం నెదర్లాండ్‌లో అమలు జరుగుతున్న విధానాలు,నదుల పరిరక్షణ కోసం అమెరికా అమలు చేస్తున్న పర్యవేక్షణ విధానం,కాలుష్య నివారణ కోసం జపాన్ అనుసరిస్తున్న విధానాలు, ఆస్ట్రేలియాలో అమలులో ఉన్న సున్నిత నగర ప్రణాళిక లాంటి అంశాలను సదస్సులో చర్చిస్తారు.
* జీ-20 అధ్యక్షత వహిస్తున్న భారతదేశం అమలు చేయనున్న విధానాలకు అనుగుణంగా "ధార " సమావేశాల నిర్వహణ
* సదస్సు 2వ రోజున యోగాపై ప్రత్యేక కార్యక్రమం, ముల్లా ముత్తా నది సందర్శన
* ముల్లా ముత్తా నదిలో కాలుష్య నివారణ కోసం అమలు చేయనున్న ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూణే లో 2022 మార్చి నెలలో శంకుస్థాపన చేశారు.
* 2021లో 30 నగరాలు సభ్యులుగా ఆర్ఏసి ఏర్పాటయింది.ప్రస్తుతం ఆర్‌సిఎ లో 95 నగరాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.
* పట్టణ ప్రాంతాల్లో ఉన్న నదుల అభివృద్ధి, పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి సాధన కోసం నదుల వినియోగం అంశాలపై నగరాల మధ్య అవగాహన కల్పించి, సమాచార మార్పిడి కోసం 2021లో ఆర్ఏసి ఏర్పాటయింది.
* పట్టణ నదుల నిర్వహణ కోసం నిర్వహించిన అధ్యయనాలు, సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన పరిష్కారాలను ధారా 2023లో సభ్య నగరాల మునిసిపల్ కమీషనర్‌లు చర్చిస్తారు.
*స్థానిక నదుల నిర్వహణను మెరుగుపరచడానికి నగరాలు అనుసరించే సాంకేతిక పరిష్కారాల సంకలనాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా "ధార 2023" నిర్వహణ
* నగరాల్లో నదీ నిర్వహణలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలు సవాళ్లపై దృష్టి సారించి "ధార 23" పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
సదస్సు రెండో రోజున ప్రతినిధులు యోగా కార్యక్రమంలో పాల్గొని ముల్లా ముత్తా నది తీరాన్ని సందర్శిస్తారు. ముల్లా ముత్తా నదిలో కాలుష్య నివారణ కోసం అమలు చేయనున్న ప్రాజెక్టుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూణే లో 2022 మార్చి నెలలో శంకుస్థాపన చేశారు. జాతీయ నది పరిరక్షణ ప్రణాళిక కింద చేపట్టిన ప్రాజెక్టు లో 990.26 కోట్ల రూపాయల ఖర్చుతో 396 ఎంఎల్డీ సామర్ధ్యంతో 11 మురుగునీటి శుద్ధి ప్లాంట్‌లను ఏర్పాటు అవుతాయి.
రెండు రోజుల పాటు జరిగే సదస్సులో మహారాష్ట్ర ముఖ్య కార్యదర్శి శ్రీ మనుకుమార్ శ్రీవాస్తవ, ఎన్ఎంసిజి డైరెక్టర్ జనరల్ శ్రీ జి. అశోక్ కుమార్, మహారాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీమతి సోనియా సేథి, గృహ నిర్మాణం,పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీమతి డి . తారా తదితరులు పాల్గొంటారు.
పట్టణ ప్రాంతాల నదుల యాజమాన్యం అంశంపై మున్సిపల్ కమిషనర్లు చర్చలు జరిపి పరిష్కరణ మార్గాలను సూచించడానికి "ధార 2023" అయ్యింది. ఆర్‌సిఎ ప్రతినిధులు ( కమీషనర్లు/ అదనపు కమిషనర్ లు),కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు, ఎన్ఈయూఏ, ఎన్ఎంసీజీ ప్రతినిధులు, విద్యార్థులు, జాతీయ స్థాయి నిపుణులు, స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రైవేటు రంగ ప్రతినిధులు, ఆర్థిక సంస్థల ప్రతినిధులు సమావేశాలకు హాజరవుతారు.
కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడం, పట్టణ నదుల నిర్వహణకు సంబంధించిన ప్రాధాన్యతలను నిర్ణయించడానికి ఎంపిక చేసిన రాష్ట్రాల (ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, తెలంగాణ మరియు తమిళనాడు)ముఖ్య కార్యదర్శులు (పట్టణాభివృద్ధి) ప్రత్యేకంగా సమావేశం అవుతారు. తమ నగరాల్లో నదులు, నీటి వనరులకు సంబంధించి చేపట్టిన పనులను ఆర్ఏసి సభ్యులు వివరిస్తారు.
నది-సంబంధిత ప్రాజెక్టులను అమలు చేయడానికి అవసరమైన నిధుల సమీకరణ కోసం ఏర్పటయ్యే సదస్సులో నది-సంబంధిత ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్న వివిధ జాతీయ , అంతర్జాతీయ నిధులపై దృష్టి సారిస్తుంది.ఈ సదస్సులో ప్రపంచ బ్యాంకు , ఏజెన్సీ ఫ్రాంకైస్ డి డెవలప్‌మెంట్ (AFD), డెన్మార్క్ ఎంబసీ, డిపార్ట్‌మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (DFID), KfW డెవలప్‌మెంట్ బ్యాంక్, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA) ఇతర ప్రైవేటు సంస్థల ప్రతినిధులు పాల్గొంటారు. సాంకేతిక, ఆవిష్కరణ రంగాలకు సంబంధించి జరిగే చర్చల్లో నదుల యాజమాన్యం, నిర్వహణకు సంబంధించి అందుబాటులో ఉన్న సరికొత్త అత్యాధునిక సాంకేతికతల ప్రదర్శన రూపంలో చర్చిస్తుంది. సమాచార సేకరణ పర్యవేక్షణ, నది తీర ప్రాంత అభివృద్ధి, పర్యావరణహిత నిర్మాణ సామగ్రి, ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణ, యాప్‌లు,ఐటీ -సంబంధిత ఆవిష్కరణలకు సంబంధించిన అంశాలను సమావేశంలో చర్చిస్తారు.
వివిధ వర్గాల నుంచి ఎంపిక చేసిన చెందిన విద్యార్థులు పట్టణ నదుల నిర్వహణపై తమ ఆలోచనలను ‘యూత్ ఫర్ రివర్స్’ సదస్సులో వివరిస్తారు.
ఆర్‌సిఎ సభ్యులు తమ నగరాల్లో పట్టణ నదుల నిర్వహణ కోసం ప్రగతిశీల విధానాలు అమలు చేసేలా చూడాలన్న లక్ష్యంతో "ధార 2023" ను నిర్వహిస్తున్నారు.లో నది నిర్వహణకు సంబంధించిన అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, సవాళ్లు పరిష్కారానికి ఆచరణ సాధ్యమైన సూచనలను "ధార 2023" అందిస్తుంది. సూచనలు, సలహాలు ఆధారంగా సమర్థవంతమైన కార్యాచరణ ప్రణాళికను ఎన్ఈయూఏ రూపొందిస్తుంది. . ఈ నగరాలు తమ స్థానిక నదుల నిర్వహణను మెరుగుపరచడానికి అనుసరించాల్సిన సాంకేతిక పరిష్కార మార్గాల అభివృద్ధిపై "ధార 2023" దృష్టి సారిస్తుంది.
రివర్ సిటీస్ అలయన్స్ ( ఆర్‌సిఎ)2021లో 30 నగరాలతో ప్రారంభమైంది . ప్రస్తుతం 95 నగరాలు ఆర్‌సిఎ సభ్యులుగా ఉన్నాయి. ఆర్‌సిఎను నవంబర్ 2021న శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ భారతదేశంలోని నదీ నగరాల కోసం అర్బన్ నదుల స్థిరమైన నిర్వహణ కోసం సమాచారాన్ని రూపొందించడానికి, చర్చించడానికి మరియు మార్పిడి చేయడానికి ఒక ప్రత్యేక వేదికగా ప్రారంభించారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ఏర్పడిన ఆర్‌సిఎ రెండు మంత్రిత్వ శాఖలు- జలశక్తి మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కలిసి సాధించిన విజయాలకు నిదర్శనం.నెట్‌వర్కింగ్, సామర్ధ్య పెంపుదల, సాంకేతిక సహకారం అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ సమావేశాలను నిర్వహిస్తారు.
***
(Release ID: 1898667)
Visitor Counter : 218