వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
రాష్ట్రంలో ఉన్న నిజాయితీగల ప్రభుత్వం మరియు సురక్షితమైన వాతావరణం గ్లోబల్ ఇన్వెస్టర్లు యూపిలో పెట్టుబడులు పెట్టడానికి కారణంగా ఉన్నాయి: కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్
ప్రగతిశీల రాష్ట్రానికి పునాది వేసినందుకు యూపీ పరిపాలనాయంత్రాంగంతో పాటు ప్రజలను అభినందించిన శ్రీ గోయల్
యూపిలో ఇటీవల పెరుగుతున్న ఎగుమతులు మరియు స్టార్టప్‌ల సంఖ్య పెట్టుబడిదారులకు అపారమైన అవకాశాలను చూపుతోంది: శ్రీ గోయల్
ప్రపంచవ్యాప్తంగా యూపీ వైనరీ ఉత్పత్తులకు మార్కెట్లను తెరవడానికి మరియు పెట్టుబడులను ఆకర్షించడానికి ఎఫ్‌టీఏలు ఉన్నాయి: శ్రీ గోయల్
Posted On:
12 FEB 2023 3:13PM by PIB Hyderabad
ప్రపంచ పారిశ్రామికవేత్తలు ఉత్తరప్రదేశ్‌లో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలోని నిజాయితీ కలిగిన ప్రభుత్వం మరియు సురక్షితమైన వాతావరణం కారణంగా ఉందని కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఈరోజు లక్నోలో జరిగిన యుపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ప్రసంగిస్తూ అన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మనం చూడగలిగే మరియు అనుభూతి చెందుతున్న వేగవంతమైన పురోగతి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యొక్క సమర్థ నాయకత్వానికి కారణమని ఉత్తరప్రదేశ్ పురోగతి అతి వేగంగా ఉందని ఇప్పుడు దానిని ఎవరూ ఆపలేరని ఆయన అన్నారు.
2017లో యూపి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ప్రారంభమైన కథను శ్రీ గోయల్ వివరించారు. 'అప్పట్లో పార్టీ కోసం మేనిఫెస్టో రూపొందించే పని మాకు అప్పగించారు. మేము రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను కలిశాము. అన్ని వర్గాల ప్రజలు మార్పు మరియు సమర్థవంతమైన పరిపాలనను కోరుకున్నారు. అయితే చేయాల్సిన పనులకు కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వస్తాయని ఆలోచించాం. అయితే మేం మేనిఫెస్టోలో ఏది హామీ ఇచ్చామో వాటిని అమలు చేయాల్సిందేనని ప్రధాని స్పష్టం చేశారు.
భూమాఫియా, ఇసుక మాఫియా, మద్యం మాఫియాలను అంతమొందించేందుకు మనం మూడు పనులు చేయాల్సి ఉంటుందని ఆ సమయంలో హోంమంత్రి శ్రీ అమిత్ షా చెప్పారని మంత్రి చెప్పారు. మనం దీన్ని చేయగలిగితే రాష్ట్రంలో వనరుల కొరత ఎప్పటికీ ఉండదని శ్రీ షా అన్నారని శ్రీ గోయల్ తెలిపారు. నిజాయితీ గల ప్రభుత్వం, ప్రజల సంక్షేమం కోసం పని చేసే ప్రభుత్వం, ఎలాంటి తప్పులను సహించని ప్రభుత్వం అవసరమైన ఆదాయాన్ని నిర్ధారించి, రాష్ట్రాన్ని కొత్త స్థాయికి తీసుకువెళ్లగలదని ఇటీవలి సంవత్సరాలలో యుపి పురోగతి సాధించిన తీరు తెలియజేస్తుందని శ్రీ గోయల్ అన్నారు. .
ఈ సమ్మిట్‌లో పెట్టుబడిదారులు అనేక లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు చేసుకున్నారని కేంద్ర వాణిజ్య మంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఇప్పుడు సులభమని, రాష్ట్రంలో నిజాయితీ వ్యవస్థ ఉందని, శాంతిభద్రతలు నెలకొంటాయని, పెట్టుబడిదారులు రాష్ట్ర ప్రజలపై విశ్వాసం ఉంచారని ఇప్పుడు ప్రజలు నమ్ముతున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి నిజాయితీ గల ప్రభుత్వానికి యూపీ ప్రజలు ఓట్లు వేస్తారని తాము నమ్ముతున్నామని ఆయన అన్నారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్ గురించి శ్రీ గోయల్ మాట్లాడుతూ వ్యాపారం చేయడం ఎక్కడ సులభమో అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా ఇది జరుగుతుందని, ఇటీవలి సంవత్సరాలలో భారతదేశం గ్లోబల్ ర్యాంకింగ్‌లో దూసుకుపోయిందని అన్నారు. ప్రధాన మంత్రి పోటీతత్వ మరియు సహకార సమాఖ్యను విశ్వసిస్తున్నారని, అందువల్ల రాష్ట్రాలకు కూడా ర్యాంకింగ్ ఉందని ఆయన సూచించారు. రాష్ట్ర ర్యాంకింగ్స్‌లో యూపీ ఇప్పుడు దేశంలోనే 2వ స్థానంలో ఉందన్నారు.
ఉత్తరప్రదేశ్‌లో స్టార్టప్ ఇండియా పురోగతి సంతృప్తికరంగా ఉందని శ్రీ గోయల్ అన్నారు. యూపి 2020లో అభివృద్ధి చెందుతున్న పర్యావరణ వ్యవస్థ రాష్ట్రంగా ఉంది. అయితే 2021 ర్యాంకింగ్‌లో స్టార్టప్ అప్ ఎకోసిస్టమ్‌లో యూపి అగ్రగామిగా ఉందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో 8 వేల 277 స్టార్టప్‌లు ఉన్నాయని వాటిలో రాష్ట్రం 4వ స్థానంలో ఉందన్నారు. "కొన్ని సంవత్సరాల క్రితం ఇది సాధ్యమవుతుందని ఎవరు భావించి ఉండకపోవచ్చని" శ్రీ గోయల్ అన్నారు. ఈ స్టార్టప్‌లను నడుపుతున్న కొంతమంది యువతీ యువకులతో మాట్లాడే అవకాశం తనకు లభించిందని, వారి ఉత్సాహాన్ని మరియు వారి అద్భుతమైన ఆలోచనలను చూడగలిగానని చెప్పారు.
భారతదేశం గత ఏడాది మూడు ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేసిందని ఈ ఏడాది కూడా రెండు లేదా మూడు ఎఫ్‌టిఎలపై సంతకం జరిగే అవకాశం ఉందని శ్రీ గోయల్ చెప్పారు. యూపిలోని బ్రూవరీలు మరియు వైన్ తయారీ కేంద్రాలకు మార్కెట్ యాక్సెస్, పెట్టుబడులు మరియు సాంకేతికతలు లభిస్తాయి కాబట్టి వారు తలుపులు తెరుస్తారని చెప్పారు. “యూపిలో వివిధ రకాల వైన్‌లను ఉత్పత్తి చేయగల ద్రాక్ష మినహా 28 పండ్లు మరియు 4 రకాల పువ్వులు ఉన్నాయని నేను ఈ రోజు ప్రదర్శనలో చూశాను. ఈ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా సిద్ధంగా మార్కెట్‌లను కలిగి ఉంటాయి ”అన్నారాయన.
రేట్లు తగ్గించినప్పటికీ యూపి ఎక్సైజ్ రాబడి మూడు రెట్లు పెరిగిందని శ్రీ గోయల్ తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న నిజాయితీ కలిగిన వ్యవస్థ, మద్యం మాఫియా వెన్ను విరిచడమే ఇందుకు కారణమని ఇది దేశం మొత్తానికి ఉదాహరణ అని చెప్పారు. రాష్ట్రంలో లైసెన్సింగ్ ఆమోదం వేగవంతం కావడం వల్ల రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో దోహదపడింది మరియు ఇది సాఫీగా మరియు పెట్టుబడిదారులకు అనుకూలంగా ఉందని శ్రీ గోయల్ చెప్పారు.
ఎగుమతులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని అన్ని రాష్ట్రాలను ప్రధాన మంత్రి కోరారని ఇందులో యూపీ ముందంజలో ఉందని శ్రీ గోయల్ అన్నారు. వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్‌ను సీరియస్‌గా తీసుకోవడంతో ఇప్పుడు గత 5 సంవత్సరాలలో యూపి నుండి ఎగుమతులు రెట్టింపు అయ్యాయన్నారు. యూపి నుండి టెలికాం పరికరాల ఎగుమతులు 63 రెట్లు పెరిగాయని, ఈ కాలంలో పండ్లు మరియు కూరగాయలు 26 రెట్లు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు.
ఇది నిజంగా అవకాశాల భూమి. ఎందుకంటే మనం సంస్కరణలు అమలు చేస్తున్నాం అదికూడా ఎటువంటి ఒత్తిడి వల్ల కాదు. ఇది అమృత్ కాల్‌లో రాష్ట్రాన్ని మరియు దేశాన్ని ముందుకు తీసుకెళ్తుందని మా నమ్మకం. రాష్ట్రంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు ఈ శిఖరాగ్ర సమావేశం సరైన సమయంలో జరిగిందని చెబుతూ శ్రీ గోయల్ తన ప్రసంగం ముగించారు.
****
(Release ID: 1898538)
Visitor Counter : 193