వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
గోధుమలు, ఆటా ధరలను తగ్గించడానికి కేంద్రం కీలక నిర్ణయం
ఓపెన్ మార్కెట్ డిస్పోజల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు విక్రయానికి విడుదల
ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రీయ భండార్, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్సీసీఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (నాఫెడ్), రాష్ట్ర సహకార/ సమాఖ్యలు మొదలైన వాటికి స్టాక్ విక్రయం
Posted On:
10 FEB 2023 2:43PM by PIB Hyderabad
దేశీయ లభ్యతను పెంపొందించడానికి మరియు పెరుగుతున్న ఆహార ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ చర్యలు తీసుకుంటుందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియు ప్రజాపంపిణీ శాఖ సహాయ మంత్రి శ్రీమతి సాధ్వి నిరంజన్ జ్యోతి ఈరోజు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ధరలను తగ్గించడానికి బఫర్ నుండి ఆహార నిల్వలను విడుదల చేయడం, స్టాక్ పరిమితులను విధించడం, హోర్డింగ్‌ను నిరోధించడానికి.. ఎంటిటీలు ప్రకటించిన స్టాక్‌లను పర్యవేక్షించడం, దిగుమతి సుంకం హేతుబద్ధీకరణ, దిగుమతి కోటాలో మార్పులు వంటి వాణిజ్య విధాన సాధనాల్లో అవసరమైన మార్పులు, వస్తువుల ఎగుమతులపై పరిమితులు మొదలైన చర్యలు ఉన్నాయి. దేశం ఆహార భద్రతను నిర్వహించడానికి మరియు పెరుగుతున్న ఆహార ధాన్యాల ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం 13 మే 2022న, గోధుమల ఎగుమతి విధానాన్ని ఉచితంగా నుండి నిషేధించబడిన కేటగిరీకి సవరించింది. ఆటా (గోధుమ పిండి) ఎగుమతులు అంతర్-మంత్రిత్వ కమిటీ (ఐఎంసీ) సిఫారసులకు లోబడి ఉంటాయి. దీనికి తోడు బ్రోకెన్ రైస్ ఎగుమతి నిషేధించబడింది. బాయిల్డ్ రైస్ మినహా బాస్మతియేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకం విధించబడింది. 9 సెప్టెంబర్, 2022 నుంది ఇది అమలులోకి తేబడింది. ఓపెన్ మార్కెట్ డిస్పోజల్ స్కీమ్ (ఓఎంఎస్ఎస్) కింద 30 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలను విడుదల చేయాలని నిర్ణయించారు. గోధుమలు మరియు ఆటా ధరలను తగ్గించడానికి. వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రీయ భండార్, నేషనల్ కన్స్యూమర్ కోఆపరేటివ్ ఫెడరేషన్ (ఎన్.సి.సి.ఎఫ్), నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లకు (నాఫెడ్) రాష్ట్ర సహకార సంస్థలు/ సమాఖ్యలు మొదలైన వాటికి ఈ స్టాక్ను విక్రయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దేశీయ లభ్యతను పెంపొందించడానికి మరియు పప్పుల ధరలను నియంత్రించడానికి, కందులు మరియు పెసర్ల దిగుమతిని 31.03.2024 వరకు 'ఉచిత కేటగిరీ' కింద ఉంచారు. మసూర్‌పై దిగుమతి సుంకం 31.03.2024 వరకు సున్నాకి తగ్గించబడింది.
నిత్యవసర వస్తువుల చట్టం- 1955 ప్రకారం తనిఖీలు..
కంది పప్పు నిల్వలను ఉంచుకోవడం మరియు అనధికారికంగా స్టాక్ను ఉంచుకోవడం వంటి వాణిజ్య పద్ధతులను నివారించడానికి ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది. నిత్యవసర వస్తువుల చట్టం- 1955, ప్రకారం కందిపప్పు స్టాక్‌హోల్డర్లు తమతమ స్టాక్లను బహిర్గతం చేయడాన్ని అమలు చేయడానికి మరియు స్టాక్‌లను పర్యవేక్షించడానికి, వాస్తవాలను ధ్రువీకరించేందుకు తనిఖీలు చేపట్టి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశాలను జారీ చేసింది. ధరల మద్దతు పథకం (పీఎస్ఎస్) మరియు ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ (పీఎస్ఎఫ్) బఫర్ నుండి శెనగలు మరియు పెసర పప్పు స్టాక్‌లు నిరంతరం మార్కెట్‌లో ధరలను తగ్గించేలా విడుదల చేయబడతాయి. సంక్షేమ పథకాల కోసం రాష్ట్రాలకు కూడా సరఫరా చేయబడతాయి.
ఉల్లి ధరలలో అస్థిరతను స్థిరీకరించడానికి, ప్రభుత్వం ధరల స్థిరీకరణ నిధి (పీఎస్ఎఫ్) కింద రబీ-2022 పంట నుండి రికార్డు స్థాయిలో 2.51 లక్షల మెట్రిక్ టన్నులను సేకరించడం జరిగింది. సెప్టెంబర్, 2022 మరియు జనవరి, 2023లో ప్రధాన వినియోగ కేంద్రాలలో విడుదల చేసింది.
సుంకాలు, సెస్ తగ్గింపు..
వంట నూనెలధరలను నియంత్రించడానికి, ప్రభుత్వం ముడి పామాయిల్, క్రూడ్ సోయాబీన్ ఆయిల్ మరియు క్రూడ్ సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై ప్రాథమిక దిగుమతి సుంకాన్ని సున్నాకి తగ్గించింది. ఈ నూనెలపై అగ్రి-సెస్‌ను 5 శాతానికి తగ్గించింది. శుద్ధి చేసిన సోయాబీన్ నూనె మరియు శుద్ధి చేసిన పొద్దుతిరుగుడు నూనెపై ప్రాథమిక సుంకం 32.5% నుండి 17.5%కి తగ్గించబడింది. శుద్ధి చేసిన పామాయిల్‌లపై ప్రాథమిక సుంకం 17.5% నుండి 12.5%కి తగ్గించబడింది. శుద్ధి చేసిన పామాయిల్‌ల దిగుమతిని కూడా ప్రభుత్వం ‘ఉచిత’ కేటగిరీ కింద చేర్చింది..
****
(Release ID: 1898157)
Visitor Counter : 205