గనుల మంత్రిత్వ శాఖ
అంతర్జాతీయ సదస్సు మైనింగ్ ఇండాబాలో భారతీయ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన మంత్రి రావ్‌సాహెబ్ పాటిల్ దాన్వే
Posted On:
10 FEB 2023 12:47PM by PIB Hyderabad
ప్రతి ఏడాది దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్‌లో జరిగే మైనింగ్ సదస్సుల్లో మైనింగ్ ఇండాబా అన్నది అత్యంత ప్రాచుర్యం పొందింది. ఈ ఏడాది భారత ప్రభుత్వ ప్రతినిధి బృందం గనులు, బొగ్గు & రైల్వేల శాఖ సహాయమంత్రి శ్రీ రావ్ సాహెబ్ పాటిల్ దాన్వే నేతృత్వంలో ఈ ఏడాది సదస్సులో పాల్గొంది. మధ్యప్రదేశ్ ప్రభుత్వ గనులు&శ్రామిక విభాగం మంత్రి శ్రీ బ్రిజేంద్ర ప్రతాప్ సింగ్ కూడా ఈ సదస్సులో పాల్గొన్నారు. ప్రతినిధి బృందంలో గనులు, బొగ్గు, స్టీల్ మంత్రిత్వ శాఖలు, విదేశాంగ శాఖ / జిఎస్ఐ, ఎఎండి, హెచ్‌సిఎల్, ఎన్ఎఎల్‌సిఒ, ఎన్ఎండిసి, సిఐఎల్, ఎస్ఎఐఎల్, ఎంఒఐఎల్, ఎంఇసిఎల్, ఎన్‌టిపిసి, ఒఎంసి సంస్థలు అధికారులు కూడా ఉన్నారు.
భారతీయ మైనింగ్ & ఖనిజ రంగ శక్తిని ప్రదర్శిస్తూ సదస్సు జరిగిన ప్రదేశంలో ఆకర్షణీయమైన భారతీయ పెవిలియన్‌ను ఏర్పాటు చేశారు. భారతదేశంలో పెట్టుబడి అవకాశాలు అన్న ఇతివృత్తంతో ఏర్పాటు చేసిన ఈ పెవిలియన్‌ను గనులు, బొగ్గు & రైల్వేల శాఖ సహాయ మంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వ గనులు&శ్రామిక విభాగం మంత్రి 6 ఫిబ్రవరి 2023న ప్రారంభించారు. దాని నమూనా, విషయాలను అంతర్జాతీయ ప్రతినిధులు అత్యంతగా ప్రశంసించారు. ఈ సందర్భంగా, ప్రభుత్వం చేపట్టిన పలు చొరవలు, సంస్కరణలను పట్టిచూపే గనుల మంత్రిత్వ శాఖ బ్రోచర్‌ను, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వేలం వేయనున్న ఖనిజ బ్లాకులతో కూడిన బుక్‌లెట్‌ను అక్కడ పంచడం జరిగింది.
సదసు్స సందర్భంగా సౌదీ అరేబియా, నైజీరియా, కాంగో, జాంబియాతో మంత్రిత్వ స్థాయి ద్వైపాక్షిక సమావేశాలు జరిగాయి. భారతీయ ప్రతినిధి బృంద సభ్యులు, వివిధ దేశాలు, సంస్థలకు చెందిన ప్రతినిధుల మధ్య అనేక చర్చలు, సంభాషణలు జరిగాయి. ఈ కార్యక్రమంలో దక్షిణాఫ్రికాలోని భారతీయ హై కమిషనర్, కేప్‌టౌన్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా పాలుపంచుకొని, కేప్ టౌన్‌లో భారత ప్రభుత్వ భాగస్వామ్యాన్ని విజయవంతం చేసేందుకు తోడ్పాటునందించారు. మంత్రి శ్రీ దాన్వే 8 ఫిబ్రవరి రోజున అంతర్జాతీయ శ్రోతలను ఉద్దేశించి ప్రసంగిస్తూ, మైనింగ్, ఖనిజ రంగంలో ప్రభుత్వం చేపట్టిన చొరవలను పట్టి చూపుతూ, భారత్‌లో పెట్టుబడులు పెట్టవలసింది విజ్ఞప్తి చేశారు.
****
(Release ID: 1898148)
Visitor Counter : 143