పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

దేశంలో 2019 నుంచి పనిచేస్తున్న ఆరు గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు


నెలవారీ ప్రాతిపదికన నిర్దిష్ట రూట్లలో విమాన ఛార్జీల పర్యవేక్షణ కోసం టారిఫ్ మానిటరింగ్ యూనిట్ ఏర్పాటు ప్రకటించిన పరిధికిమించి విమానయాన సంస్థలు విమాన ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు

Posted On: 09 FEB 2023 3:27PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాల నిర్మాణానికి సంబంధించిన సవివరమైన మార్గదర్శకాలు, విధానాలు, దశల వివరాలు అందించడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్స్ (జిఎఫ్ఎ) పాలసీ, 2008 ను రూపొందించింది. జీఎఫ్ఏ పాలసీ ప్రకారం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ప్రాజెక్టు ప్రతిపాదకుడు రెండు దశల్లో అనుమతులు పొందాల్సి ఉంటుంది. విమానాశ్రయం నెలకొల్పడానికి ఎయిర్ పోర్ట్ డెవలపర్ లేదా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వం తొలుత 'సైట్ క్లియరెన్స్'అనుమతి పొంది 'సూత్రప్రాయ' ఆమోదం కోసం నిర్దేశిత ఫార్మాట్ లో పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు (ఎంవోసీఏ) ప్రతిపాదన పంపాల్సి ఉంటుంది.
దేశంలో 2019 నుంచి ఇంతవరకు  గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఏర్పాటు అయ్యాయి. వీటిలో కలబురగి (ప్రాజెక్టు వ్యయం రూ.175.57 కోట్లు), ఓర్వకల్ (కర్నూలు) (ప్రాజెక్టు వ్యయం రూ.187 కోట్లు), సింధుదుర్గ్ (ప్రాజెక్టు వ్యయం రూ.520 కోట్లు), ఇటానగర్ (ప్రాజెక్టు వ్యయం రూ.646 కోట్లు), కుషినగర్ (ప్రాజెక్టు వ్యయం రూ.448 కోట్లు), మోపా (ప్రాజెక్టు వ్యయం రూ.2870 కోట్లు) వంటి 6 గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాలు ఉన్నాయి.
జిఎఫ్ఎ పాలసీ 2008 ప్రకారం మధ్యప్రదేశ్ రాష్ట్రం డాబ్రా (గ్వాలియర్) వద్ద గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడానికి ఎంఓసిఎ 'సూత్రప్రాయ' ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని సింగ్రౌలి లో కొత్త గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ఎంఓసీఏ మొదటి దశ క్లియరెన్స్ అంటే సైట్ క్లియరెన్స్మంజూరు చేసింది. మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్, రేవా, జబల్ పూర్ విమానాశ్రయాల విస్తరణ కార్యక్రమాలను ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టింది.
విమానయాన రంగంపై నియంత్రణ తొలగించిన తర్వాత మార్కెట్ ఆధారితంగా విమాన ఛార్జీలు ఉంటాయి. విమాన ఛార్జీలను ప్రభుత్వం నిర్ణయించదు. ప్రభుత్వానికి  విమాన ఛార్జీలు  విషయంలో నియంత్రణ కూడా లేదు. మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా  విమాన టికెట్ ధరలు సాధారణంగా మారుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అనుసరిస్తున్న విధానానికి అనుగుణంగా ధర బహుళ స్థాయిలలో (బకెట్లు లేదా రిజర్వేషన్ బుకింగ్ డిజిగ్నేటర్ (ఆర్బిడి)} ఉంటుంది. డైనమిక్ ఛార్జీల విధానం వల్ల ప్రయాణ తేదీకి సమీపంలో కొనుగోలు చేసిన టికెట్ల ధర కంటే ముందుగా కొనుగోలు చేసిన టిక్కెట్లు ధర తక్కువగా ఉంటుంది.
నిర్వహణ వ్యయం, సేవల లక్షణాలు, సహేతుకమైన లాభం, సాధారణంగా అమల్లో ఉన్న టారిఫ్ తో సహా అన్ని సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్, 1937లోని రూల్ 135  సబ్-రూల్ (1) నిబంధనల ప్రకారం విమానయాన సంస్థలు సహేతుకమైన టారిఫ్ నిర్ణయించవచ్చు.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) పరిధిలో టారిఫ్ మానిటరింగ్ యూనిట్ పనిచేస్తుంది. ఇది నెలవారీ ప్రాతిపదికన కొన్ని మార్గాల్లో విమాన ఛార్జీలను పర్యవేక్షిస్తుంది. విమానయాన సంస్థలు వారు ప్రకటించిన పరిధికి మించి విమాన ఛార్జీలు వసూలు చేయకుండా చర్యలు అమలు చేస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ రూల్స్ 1937 లోని రూల్ 135కి చెందిన  సబ్ రూల్ (2)కు విమానయాన సంస్థలు కట్టుబడి పని చేయాల్సి ఉంటుంది.
   పార్లమెంటు సభ్యులకు దేశంలో  పౌర విమానాశ్రయాలు/ సివిల్ ఎన్క్లేవ్ లో కల్పించవలసిన ప్రోటోకాల్ / మర్యాద / సౌకర్యానికి సంబంధించి బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బిసిఎఎస్) 02.12.2021 న  సర్క్యులర్ నంబర్ 09/2021 ను జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం వీఐపీలు తమ ప్రయాణ సమయంలో సౌకర్యవంతంగా ఉండేందుకు విమానాశ్రయంలో విమాన యాన సంస్థలు ప్రోటోకాల్ అధికారిని నియమించాల్సి ఉంటుంది. పార్లమెంటు సభ్యులకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి విమానయాన ఆపరేటర్లు, ఎయిర్ పోర్ట్ ఆపరేటర్లు, భద్రత బిసిఎఎస్ పాత్రను కూడా సర్క్యులర్ పేర్కొంది.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి జనరల్ (డాక్టర్) వీకే సింగ్ (రిటైర్డ్) లోక్ సభలో ఈ రోజు ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ వివరాలు తెలిపారు.

***



(Release ID: 1897747) Visitor Counter : 177