కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

బిఎస్ఎన్ఎల్‌, ఎంటిఎన్ఎల్‌ను పున‌రుద్ధ‌ర‌ణ‌కు ప్యాకేజీ

Posted On: 08 FEB 2023 1:43PM by PIB Hyderabad

బిఎస్ఎన్ఎల్‌, ఎంటిఎన్ఎల్ పున‌రుద్ధ‌ర‌ణ‌కు 23.10.2019న ప్ర‌భుత్వం ఆమోదాన్ని తెలిపింది. దీని ఫ‌లితంగా బిఎస్ఎన్ఎల్‌, ఎంటిఎన్ఎల్ లు  ఆర్ధిక సంవ‌త్స‌రం 2020-21 నుంచి ఎబిఐడిటిఎ (వ‌డ్డీ, ప‌న్నులు, త‌రుగుద‌ల‌, రుణ విమోచ‌న‌కు ముందు) సానుకూల‌మ‌య్యాయి. అద‌నంగా, రూ. 1.64 ల‌క్ష‌ల కోట్ల విలువైన పున‌రుద్ధ‌ర‌ణ ప్యాకేజీని బిఎస్ఎన్ఎల్‌కు ఇచ్చేందుకు 27.07,2022న ప్ర‌భుత్వం ఆమోదించింది. బిఎస్ఎన్ఎల్ సేవ‌ల‌ను అప్‌గ్రేడ్ చేయ‌డం కోసం తాజా పెట్టుబ‌డిని ప్ర‌వేశ‌పెట్ట‌డం , స్పెక్ట్రం కేటాయింపు, జ‌మాఖ‌ర్చు ప‌ట్టిపై ఒత్తిడిని త‌గ్గించ‌డం, భార‌త్ బ్రాడ్‌బ్యాండ్ నిగ‌మ్ లిమిటెడ్ (బిబిఎన్‌)ను బిఎస్ఎన్ఎల్‌తో విలీనం చేయ‌డం ద్వారా ఫైబ‌ర్‌నెట్‌వ‌ర్క్‌ను పెంచ‌డం, బిఎస్ఎన్ఎల్‌/ ఎంటిఎన్ఎల్‌కు సావ‌రీన్ గ్యారంటీని ఇవ్వ‌డం వంటి  వాటిపై పున‌రుద్ధ‌ర‌ణ చ‌ర్య‌లు దృష్టి పెట్టాయి. 
గ‌త మూడేళ్ళ‌లో బిఎస్ఎన్ఎల్‌/ ఎంటిఎన్ఎల్  ల్యాండ్ లైన్‌ సేవ‌ల‌కు వ్య‌తిరేకంగా సెంట్ర‌లైజ్డ్ ప‌బ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిట‌రింగ్ సిస్టం (సిపిజిఆర్ఎఎంఎస్ - కేంద్రీకృత ప్ర‌జా ఫిర్యాదుల ప‌రిష్కార‌, ప‌ర్య‌వేక్ష‌ణ వ్య‌వ‌స్థ) గ‌త మూడేళ్ళ‌లో అందుకున్న ఫిర్యాదులు ఈ విధంగా ఉన్నాయి -

సంవ‌త్స‌రం                 ఫిర్యాదుల సంఖ్య 

                                       బిఎస్ఎన్ఎల్                      ఎంటిఎన్ఎల్ 

2020                                2341                                      2025

2021                                1175                                      1219

2022                                524                                         1983

ఈ ఫిర్యాదుల‌ను ప‌రిష్క‌రించేందుకు బిఎస్ఎన్ఎల్‌/ ఎంటిఎన్ఎల్ వేగ‌వంత‌మైన చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి. 
ఈ స‌మాచారాన్ని బుధ‌వారంనాడు లోక్‌స‌భ‌లో అడిగిన ప్ర‌శ్న‌కు స‌మాచార శాఖ స‌హాయ మంత్రి శ్రీ దేవుసింగ్ చౌహాన్ లిఖిత‌పూర్వ‌క స‌మాధానం ద్వారా వెల్ల‌డించారు. 

***
 



(Release ID: 1897532) Visitor Counter : 106


Read this release in: English , Urdu , Tamil