రైల్వే మంత్రిత్వ శాఖ
2023 జనవరిలో నెల రోజులపాటు మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఆపరేషన్ నార్కోస్, ఆపరేషన్ ఆహత్ నిర్వహించిన రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్
88 కేసుల గుర్తింపు, 4.7 కోట్ల విలువకేసే మాదకద్రవ్యాల స్వాధీనం, 83 మంది అరెస్ట్
మానవ అక్రమ రవాణాదారుల నుంచి 35 మంది బాలురు, 27 మంది బాలికలను కాపాడిన ఆర్పీఎఫ్
Posted On:
08 FEB 2023 2:46PM by PIB Hyderabad
రైల్వే ఆస్తులు, ప్రయాణీకులు, వారుండే ప్రదేశం సంబంధిత అంశాల బాధ్యత రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కు అప్పగించారు. ఇవే కాకుండా జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఇతర బాధ్యతలను కూడా ఆర్పీఎఫ్ కు ఇచ్చారు. దూరప్రాంతాల నుంచి మాదక ద్రవ్యాల రవాణాకు రైలు మార్గం ఎంచుకోవటానికే ప్రాధాన్యం ఇస్తారు. అందుకే భారత ప్రభుత్వం అసిస్టెంట్ సబ్ ఇన్స్ పెక్టర్, అంతకంటే ఎక్కువ హోదా ఉన్న అధికారులు తమ అధికారాలు ఉపయోగించి సోదాలు జరపటం ద్వారా మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకొని వాటిని రవాణా చేసేవారిని అరెస్ట్ చేయాలని ఆదేశించింది. 1984 నార్కోటి డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్ స్టాన్సెస్ యాక్ట్ కింద అరెస్ట్ చేసిన వారిని సంబంధిత అధికారులకు అప్పగించాలని కోరింది.
మానవ అక్రమ రవాణా .. ముఖ్యంగా మహిళలు, పిల్లలను లైంగిక కార్యకలాపాల కోసం, ఇళ్ళలో పణులకోశం, యాచక వృత్తికి, అవయవాల అమ్మకానికి, మాదక ద్రవ్యాల రవాణాకు, బలవంతపు శ్రమ దోపిడీకి వాడుకోవటం లాంటి నేరాలను అత్యంత హఱియమైన మానవ హక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. మనుషుల పేదరికాన్ని ఆసరాగా చేసికొని ఇలాంటి దారుణాలకు ఒడిగడుతున్నారని గుర్తించారు. 2011 మే నెలలో భారత ప్రభుత్వం అంతర్జాతీయ వ్యవస్థీకృత నేరాల మీద ఐక్యరాజ్య సమితి ఒప్పందాన్ని ఆమోదించింది. అందులో మూడు అంశాలలో ఒకటి - మానవ అక్రమ రవాణాను నిరోధించటం.. ముఖ్యంగా మహిళలను, పిల్లలను రవాణా చేయటాన్ని అడ్డుకోవటం. ఆపరేషన్ ఆహత్ కింద బాధితులను గుర్తించి కాపాడటానికి ఆర్పీఎఫ్ కృషి చేస్తోంది.
దీనిమీద దృష్టి సారించే లక్ష్యంతో ఆర్పీఎఫ్ నెలరోజులపాటు ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా డ్రైవ్ చేపట్టింది. రాఈళ్ల ద్వారా మాదకద్రవ్యాల స్మగ్లింగ్ లో నిమగ్నమైన ముఠాలమీద దృష్టి పెట్టిమది. ఇందులో భాగంగా 88 కేసులను ఆర్పీ ఎఫ్ గుర్తించింది. 4.7 కోట్ల రూపాయల విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. మాదక ద్రవ్యాలను అమ్మే 83 మందిని అరెస్ట్ చేశారు. అదే సమయంలో అక్రమ రవాణాకు పాల్పడుతున్న 35 మంది బాలురు, 27 మంది బాలికలను కాపాడారు. వాళ్ళను రవాణా చేస్తున్న 19 మందిని కూడా అదుపులోకి తీసుకుని సంబంధిత అధికారులకు అప్పగించారు.
రైల్వేలు అనేక పనులను వెలుపలి ప్రైవేట్ సంస్థలకు, కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ కారణంగా చాలామంది వెలుపలి వారు రైల్వేతో కలిసి పని చేస్తున్నారు. అందువలన ఎప్పుడైనా ఇలాంటి వెలుపలి వారు అక్రమాలకు, నేరపూరిత కార్యకలాపాలకు పాల్పడినట్టు తేలితే వాళ్ళమీద కూడా కేసులు నమోదు చేస్తున్నారు.
ఆర్పీఎఫ్ లక్ష్య సాధన కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. అదే సమయంలో రైల్వేలో కాంట్రాక్టు పనులు చేపట్టే వారి గత చరిత్రని కూలంకషంగా పరిశీలించే బాధ్యత కూడా సంబంధిత ప్రాంతాల పోలీసుల సాయంతో ఆర్పీఎఫ్ నెరపుతోంది. కాంట్రాక్టర్లు కూడా తప్పనిసరిగా పోలీస్ తనిఖీ పూర్తి చేసుకునేలా నిబంధనలు రూపొందించారు.
***
(Release ID: 1897528)
Visitor Counter : 184