జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్

బాధ్యతాయుతమైన సైబర్ అలవాట్లను ప్రోత్సహించడానికి క్వాడ్ సహకారం

Posted On: 08 FEB 2023 2:29PM by PIB Hyderabad

క్వాడ్ దేశాలలో సైబర్ భద్రతను మెరుగుపరచడానికి క్వాడ్ నేషన్స్ పబ్లిక్ క్యాంపెయిన్‌ను ప్రారంభిస్తోంది: క్వాడ్ సైబర్ ఛాలెంజ్. ఇండో-పసిఫిక్ మరియు వెలుపల ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులను ఛాలెంజ్ (https://www.cyberchallenge.tech/) లో చేరడానికి ఆహ్వానిస్తున్నారు. తద్వారా సురక్షితమైన మరియు బాధ్యతాయుతమైన సైబర్ అలవాట్లను ఆచరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నారు. వ్యక్తులు మరియు కమ్యూనిటీల సైబర్ సెక్యూరిటీ అవగాహన మరియు చర్యను బలోపేతం చేయడానికి, అలాగే ప్రతిచోటా ఆర్థిక వ్యవస్థలు మరియు వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చడానికి మరింత సురక్షితమైన మరియు స్థితిస్థాపకంగా ఉండే సైబర్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి కొనసాగుతున్న క్వాడ్ ప్రయత్నాలను ఛాలెంజ్ ప్రతిబింబిస్తుంది.


ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇంటర్నెట్ వినియోగదారులు సైబర్ క్రైమ్ మరియు ఇతర హానికరమైన సైబర్ బెదిరింపులకు లక్ష్యాలు. వీటివల్ల  ప్రతి సంవత్సరం ట్రిలియన్ డాలర్ల నష్టం జరుగుతోంది. అంతే కాకుండా ఇవి సున్నితమైన, వ్యక్తిగత డేటాను కాజేస్తాయి. సాధారణ నివారణ చర్యల ద్వారా అనేక సైబర్ దాడుల నుండి రక్షణ పొందవచ్చు. ఇంటర్నెట్ వినియోగదారులు మరియు ప్రొవైడర్లు కలిసి సైబర్ భద్రతను గణనీయంగా మెరుగుపరచడానికి చిన్న చిన్న చర్యలు తీసుకోవచ్చు. ఈ దశల్లో సాధారణ సెక్యురిటీ అప్‌డేట్స్‌ను ఇన్‌స్టాల్ చేయడం, బహుళ-కారకాల ప్రమాణీకరణ ద్వారా మెరుగైన గుర్తింపు తనిఖీలను ప్రారంభించడం, బలమైన మరియు క్రమం తప్పకుండా మార్చే పాస్‌ఫ్రేజ్‌లను ఉపయోగించడం మరియు ఫిషింగ్ వంటి సాధారణ ఆన్‌లైన్ స్కామ్‌లను ఎలా గుర్తించాలో తెలుసుకోవడం వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ ఛాలెంజ్ వినియోగదారులందరికీ ప్రాథమిక సైబర్ భద్రత సమాచారం మరియు శిక్షణ వంటి వనరులను అందిస్తుంది. ఇందులో కార్పొరేషన్ల నుండి విద్యా సంస్థలు, చిన్న వ్యాపారాలు మరియు గ్రేడ్ స్కూల్ విద్యార్థుల నుండి వృద్ధుల వరకు పాల్గొనవచ్చు. ఏప్రిల్ 10న జరిగే కార్యక్రమాలతో ఇది ముగుస్తుంది. క్వాడ్ భాగస్వాములు ఆన్‌లైన్‌లో మరియు స్మార్ట్ పరికరాలను ఉపయోగిస్తున్నప్పుడు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన వనరులను ప్రతి ఒక్కరికి అందిచేందుకు కృషి చేస్తున్నారు. మరింత సురక్షితమైన, సమర్ధవంతమైన సైబర్‌స్పేస్‌ను పొందడానికి మీరు మరియు మీ సంస్థ ఏమి చేయగలదో తెలుసుకోండి. తద్వారా దేశాలు సమిష్టిగా సైబర్ దాడుల నుండి మెరుగ్గా రక్షించబడతాయి.

భారతదేశంలో ఈ కార్యక్రమం జాతీయ భద్రతా మండలి సెక్రటేరియట్‌తో నేషనల్ సైబర్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ కార్యాలయం ద్వారా సమన్వయం చేయబడుతోంది.


 

***



(Release ID: 1897430) Visitor Counter : 196


Read this release in: English , Urdu , Marathi , Hindi