వ్యవసాయ మంత్రిత్వ శాఖ
పిఎం-కిసాన్ చెల్లింపులు
Posted On:
07 FEB 2023 5:12PM by PIB Hyderabad
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎం-కిసాన్) కింద లబ్ధిదారుల సంఖ్య మొదటి కాలావధి (డిసెంబర్ 2018- మార్చి 2019)లో ఉన్న 3.16 కోట్ల నుంచి 11వ కాలావధి (ఏప్రిల్ 2022- జులై 2023) కి 10.45 కోట్లకు పెరిగింది.
పిఎం-కిసాన్ కింద చెల్లింపులను అందుకునే లబ్ధిదారుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం దిగువన పేర్కొన్న చర్యలను తీసుకుంది -
పిఎం-కిసాన్ పోర్టల్‌లో ఫార్మర్స్ కార్నర్ ద్వారా రైతులకు ప్రత్యేక సౌకర్యాన్ని అందించింది. ఈ సౌలభ్యం ద్వారా రైతులు స్వయంగా నమోదు చేసుకోవచ్చు.
ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను 24 ఫిబ్రవరి 2020న ప్రారంభించింది. ఫార్మర్స్ కార్నర్ ద్వారా అందుబాటులో ఉన్న సౌకర్యాలను యాప్ అందిస్తుంది.
పిఎం కిసాన్ పథకంలో నమోదు చేసుకునేందుకు, తమ డాటాను తాజా పరచుకునేందుకు, తమ చెల్లింపుల స్థితిని ఖచ్చితంగా తెలుసుకోవడంలో రైతులకు తోడ్పడేందుకు సామాన్య సేవా కేంద్రాలకు అధికారాన్ని ఇవ్వడం జరిగింది.
రాష్ట్ర ప్రభుత్వాలు పథకం అమలు కోసం బ్లాక్, జిల్లా, రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులను నియమించాయి.
నమోదు చేసుకున్న లబ్ధిదారుల డాటాను వేగంగా ధ్రువీకరించేందుకు రాష్ట్రాలు/ కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రచారం/ అవగాహన శిబిరాలను నిర్వహించాయి.
అర్హులైన రైతాంగ కుటుంబాలు నమోదును నిర్ధారించడం ద్వారా పథకం సంతృప్తకర ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలను కోరడం జరిగింది.
మంగళవారంనాడు లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు లిఖితపూర్వక రూపంలో సమాధానమిస్తూ కేంద్ర వ్యవసాయ, రైతాంగ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు.
***
(Release ID: 1897222)
Visitor Counter : 209