హోం మంత్రిత్వ శాఖ
మహిళా భద్రత
Posted On:
07 FEB 2023 4:33PM by PIB Hyderabad
దేశంలో మహిళల భద్రతపై ప్రశ్నకు లోక్‌సభలో ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి శ్రీ అజయ్‌కుమార్ మిశ్రా లిఖితపూర్వక సమాధానమిస్తూ కింది వివరాలను వెల్లడించారు.
భారత రాజ్యాంగంలోని ఏడో విచ్ఛేదం కింద పోలీసు, జనజీవన భద్రత రాష్ట్రాల పరిధిలోని అంశాలు. కాబట్టి శాంతిభద్రతల నిర్వహణ, మహిళలుసహా పౌరుల ప్రాణ-ఆస్తి రక్షణ బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే. అయితే, మహిళలపై క్రూర నేరాల పరిశోధన, దర్యాప్తులో రాష్ట్రాల సామర్థ్యం పెంపు లక్ష్యంగా జిల్లాల్లో 150 దర్యాప్తు విభాగాల (ఐయుసిఎడబ్ల్యూ) ఏర్పాటుకు సహాయం అందించే దిశగా దేశీయ (హోం) వ్యవహారాల మంత్రిత్వశాఖ (ఎంహెచ్‌ఎ) ఒక పథకం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా రెండేళ్ల (2015-16, 2016-17) కాలానికి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య 50:50 నిష్పత్తిలో వ్యయ భాగస్వామ్య ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం ప్రతి యూనిట్‌కు రూ.28 లక్షల వంతున కేటాయించింది. తదనుగుణంగా రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతంవారీగా కేటాయించిన యూనిట్ల సంఖ్య కిందివిధంగా ఉంది:
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు
|
ఏర్పాటైన 'ఐయుసిఎడబ్ల్యూ'ల సంఖ్య
|
ఆంధ్రప్రదేశ్
|
4
|
అరుణాచల్ ప్రదేశ్
|
4
|
అస్సాం
|
6
|
బీహార్
|
8
|
ఛత్తీస్‌గఢ్
|
6
|
గోవా
|
1
|
గుజరాత్
|
7
|
హర్యానా
|
4
|
హిమాచల్ ప్రదేశ్
|
3
|
జమ్ముకశ్మీర్
|
5
|
జార్ఖండ్
|
5
|
కర్ణాటక
|
6
|
కేరళ
|
4
|
మధ్యప్రదేశ్
|
10
|
మహారాష్ట్ర
|
7
|
మణిపూర్
|
2
|
మేఘాలయ
|
2
|
మిజోరం
|
2
|
నాగాలాండ్
|
2
|
ఒడిషా
|
7
|
పంజాబ్
|
5
|
రాజస్థాన్
|
7
|
సిక్కిం
|
1
|
తమిళనాడు
|
7
|
తెలంగాణ
|
2
|
త్రిపుర
|
2
|
ఉత్తర ప్రదేశ్
|
15
|
ఉత్తరాఖండ్
|
3
|
పశ్చిమ బెంగాల్
|
5
|
అండమాన్-నికోబార్ దీవులు
|
1
|
చండీగఢ్
|
1
|
దాద్రా-నాగర్-హవేలీ
|
1
|
దమన్-దియ్యూ
|
1
|
ఢిల్లీ
|
2
|
లక్షద్వీప్
|
1
|
పుదుచ్చేరి
|
1
|
మొత్తం
|
150
|
అయితే, రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటైన యూనిట్ల వివరాలు కేంద్రీయంగా నిర్వహించబడవు. మరోవైపు అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా సహాయ డెస్కుల ఏర్పాటుకు మంత్రిత్వశాఖ ఒక సహాయ పథకం అమలు చేస్తోంది. అందుబాటులోగల సమాచారం ప్రకారం దీనికింద ఇప్పటిదాకా 13,101 పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్కులు ఏర్పాటయ్యాయి.
*****
(Release ID: 1897134)
Visitor Counter : 209