నౌకారవాణా మంత్రిత్వ శాఖ
నదుల్లో క్రూయిజ్ ప్రయాణాల ప్రచారానికి ‘గంగా విలాస్ క్రూయిజ్’ ప్రారంభం
- వారణాసి నుండి అస్సాంలోని డిబ్రూఘర్ వరకు మొదటి అతి పొడవైన రివర్ క్రూయిజ్ సేవలు
Posted On:
07 FEB 2023 2:28PM by PIB Hyderabad
2022 మే 14-15వ తేదీలలో కేంద్ర ఓడ రేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ తొలి ఇన్‌క్రెడిబుల్ ఇండియా ఇంటర్నేషనల్ క్రూయిజ్ కాన్ఫరెన్స్-2022ను ముంబయి నగరంలో నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రపంచంలోని ప్రముఖ క్రూయిజ్ ఆపరేటర్లు పాల్గొన్నారు. జల మార్గాలలో డ్రాఫ్ట్, నావిగేషనల్ ఎయిడ్ల నిర్మాణం మరియు ప్లాన్ చేసిన జెట్టీల నిర్ధారణకు విషయమై ఇన్‌ల్యాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐడబ్ల్యుఏఐ) ప్రణాళికలు ఈ సమావేశంలో పంచుకోబడ్డాయి. నదీ క్రూయిజ్ వ్యవస్థకు ప్రోత్సాహం కల్పించేందుకు మెస్సర్స్ హెరిటేజ్ రివర్ జర్నీస్ ప్రై.లి. లిమిటెడ్., మెస్సర్స్ అంటారా రివర్ క్రూయిజ్, మెస్సర్స్ జె.ఎం. బక్సీ అండ్ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదిరాయి.
జలమార్గాలపై జరిగిన క్షేత్రస్థాయి పని -
- 13.01.2023 నుండి ఇండో-బంగ్లాదేశ్ ప్రోటోకాల్ రూట్ ద్వారా వారణాసి నుండి అస్సాంలోని దిబ్రూగఢ్ వరకు మొదటి అతి పొడవైన రివర్ క్రూయిజ్ సర్వీసు ప్రారంభించబడింది.
ii. గంగా, బ్రహ్మపుత్ర, కేరళ బ్యాక్ వాటర్స్, ఒడిశా మొదలైన అనేక నదీ విహారయాత్రలలో బుకింగ్‌లలో పెరుగుదల కనిపించింది.
ఎం.వి. గంగా విలాస్ క్రూయిజ్ సర్వీసు మెస్సర్స్ అంటారా రివర్ క్రూజ్ ద్వారా నిర్వహించబడుతోంది. అంటారా రివర్ క్రూజ్ ఇది ఒక ప్రైవేట్ ఆపరేటర్ సంస్థ . ఎం.వి. గంగా విలాస్ ప్రైవేట్ ఆపరేటర్ ద్వారా కొనుగోలు చేయబడింది. ఐడబ్ల్యుఏఐ చట్టం, 1985 ప్రకారం షిప్పింగ్ & నావిగేషన్ కోసం నేషనల్ వాటర్‌వేస్ (ఎన్.డబ్ల్యుల) అభివృద్ధి మరియు నియంత్రణకు ఐడబ్ల్యుఏఐ బాధ్యత వహిస్తుంది. ఇంకా, కార్గో నౌకల కోసం అభివృద్ధి చేయబడిన టెర్మినల్స్‌తో సహా మౌలిక సదుపాయాలు నది క్రూజ్‌లకు కూడా ఉపయోగించబడుతున్నాయి. క్రూయిజ్‌ల కోసం నిర్దిష్ట వ్యయం చేయబడలేదు.
ఐడబ్ల్యుఏఐ రివర్ క్రూయిజ్ టూరిజం కోసం సాంకేతిక సదుపాయాలను అందించే సంస్థగా పనిచేస్తోంది. ఐడబ్ల్యుఏఐ ద్వారా ఆయా నౌకలకు సురక్షితమైన నావిగేషన్ కోసం పైలటేజీ మరియు ఎస్కార్టింగ్ అందించబడింది. ఈ సమాచారాన్ని కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ రాజ్యసభకు ఇచ్చిన ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.
*****
(Release ID: 1897129)