కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
ఫిబ్రవరి 2-4 తేదీల్లో జోధ్‌పూర్‌లో జరిగిన మొదటి ఉపాధి కార్యవర్గ సమావేశం గురించి శ్రీ భూపేందర్ యాదవ్ మీడియాకు వివరించారు.
Posted On:
30 JAN 2023 5:30PM by PIB Hyderabad
2023 ఫిబ్రవరి 2-4 తేదీల్లో జోధ్‌పూర్‌లో జరగనున్న మొదటి ఉపాధి కార్యవర్గ సమావేశం గురించి కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ ఈరోజు మీడియాకు వివరించారు. ఈ ఏడాది ప్రతిష్టాత్మకమైన జీ 20 శిఖరాగ్ర సమావేశానికి భారతదేశం ఆతిథ్యం ఇస్తోందని, అంతర్జాతీయ ఆర్థిక సహకారం కోసం ఇది ప్రధాన వేదిక అని అన్నారు. ఈ సమావేశ ప్రాముఖ్యత ఏమిటంటే, జీ 20 దేశాలు ప్రపంచ జీ డీ పీ లో 85%, ప్రపంచ వాణిజ్యంలో 3/4 వంతు మరియు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతుల వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సమావేశ వివరాలను తెలియజేస్తూ, జీ 20 భారత అధ్యక్షతన ఉపాధి వర్కింగ్ గ్రూప్ అందరికీ బలమైన, స్థిరమైన, సమతుల్యమైన మరియు ఉద్యోగ సంపన్నమైన వృద్ధి కోసం ప్రాధాన్యత కలిగిన కార్మికులు, ఉపాధి మరియు సామాజిక సమస్యలను పరిష్కరించే లక్ష్యం తో జరుగుతోంది అని శ్రీ యాదవ్ అన్నారు.
సమావేశాలు ఈ క్రింది విధంగా జరుగుతాయి
1వ ఈ డబ్ల్యూ జీ మీట్ జోధ్‌పూర్, 2వ - 4వ తేదీ ఫిబ్రవరి '23
2వ ఈ డబ్ల్యూ జీ గౌహతి 3వ - 5వ ఏప్రిల్ '23
3వ ఈ డబ్ల్యూ జీ జెనీవా 1వ - 2వ తేదీ జూన్ '23
4వ ఈ డబ్ల్యూ జీ ఇండోర్ 19 - 20 జూలై '23
చర్చలు జరిగే మూడు నేపథ్య అంశాలు
ప్రపంచ నైపుణ్య అంతరాలను పరిష్కరించడం
గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ వాణిజ్య ఉపాధి మరియు సామాజిక భద్రత
సామాజిక భద్రత యొక్క స్థిరమైన ఆర్థిక నిర్వహణ
నైపుణ్య గిరాకీ ని అంచనా వేయడానికి అంతర్జాతీయ నైపుణ్య అంతరాల మ్యాపింగ్ పోర్టల్, సాధారణ వర్గీకరణలతో కూడిన నైపుణ్యాలు మరియు అర్హతల సమన్వయం కోసం ఒక ఫ్రేమ్‌వర్క్ వంటి ఫలితాలను ఆశిస్తూ చర్చలు ఉంటాయి.
గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ కార్మికులకు సామాజిక రక్షణ కవరేజీని విస్తరించడం, గిగ్ మరియు ప్లాట్‌ఫారమ్ పనిని అంచనా, జాతీయ గణాంక సామర్థ్యాలను మెరుగుపరచటం కోసం సమర్థవంతమైన డేటా సేకరణలో సహాయం, ప్రత్యామ్నాయ విధాన ఎంపికలు, సామాజిక బీమా మరియు పన్ను-ఫైనాన్స్డ్ ఆధారిత పథకాలు, సామాజిక భద్రత మరియు స్థిరమైన ఫైనాన్సింగ్ కోసం ప్రాధాన్యతా విధానం, ఆర్థిక వెసులబాటు ఆధారంగా సంక్షేమ అర్హతలపై సిఫార్సుల పై చర్చిస్తారు.
భారతదేశం 19 దేశాలు, యూరోపియన్ యూనియన్ మరియు 9 అతిథి దేశాలు మరియు 9 ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సంస్థల నుండి 73+ ప్రతినిధులకు ఆతిథ్యం ఇస్తోంది.
కీలకమైన చర్చలతో పాటు, మొదటి రోజున ప్రపంచ నైపుణ్య అర్హతల సమన్వయం, సాధారణ నైపుణ్యాలు వర్గీకరణల పై ఫ్రేమ్‌వర్క్‌ల కోసం చర్చించడానికి ఒక ప్యానెల్ డిస్కషన్ నిర్వహించబడింది.
ఐ ఎల్ ఓ, ఓ ఈ సీ డీ మరియు ఐ ఎస్ ఎ వంటి అంతర్జాతీయ సంస్థలు, నీతి ఆయోగ్ మరియు ఎం ఎస్ డీ ఈ, ఈ పీ ఎఫ్ ఓ వంటి భారతీయ సంస్థలు కూడా ఈ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటాయి. కీలక రంగాలపై తమ జోక్యాలను పంచుకోవడానికి జీ 20 నుండి సభ్య దేశాలు కూడా ఆహ్వానించబడ్డాయి.
****
(Release ID: 1894835)
Visitor Counter : 251