పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సుస్థిర అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలను జర్మనీ ప్రతినిధి బృందంతో చర్చించిన శ్రీ భూపేందర్ యాదవ్

Posted On: 30 JAN 2023 12:47PM by PIB Hyderabad

కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ నేతృత్వంలోని భారత ప్రతినిధి బృందం ఈ రోజు న్యూఢిల్లీలో  జర్మన్ ఫెడరల్ పార్లమెంట్ (బుండేస్టాగ్) నుంచి  రాల్ఫ్ బ్రింకాస్ అధ్యక్షతన ఏర్పాటైన జర్మన్-ఇండియన్ పార్లమెంటరీ గ్రూప్ జర్మనీ ప్రతినిధి బృందంతో  ద్వైపాక్షిక చర్చలు జరిపింది. 

Bhupender Yadav, Mission LiFE

 

సుస్థిర అభివృద్ధి సాధించడానికి గల అవకాశాలు,  వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, ఒకసారి వినియోగించే  ప్లాస్టిక్ వల్ల ఎదురవుతున్న సమస్యల పరిష్కారం,  అటవీ నిర్వహణ, వాతావరణ సమతుల్యత లాంటి ప్రధాన అంశాలపై రెండు బృందాల మధ్య చర్చలు జరిగాయని   శ్రీ యాదవ్ తెలిపారు. వాతావరణ మార్పుల వల్ల అడవులపై పడుతున్న  ప్రభావం, పర్యావరణం, వాతావరణ అంశాలపై  ఆఫ్రికా దేశాల మధ్య త్రైపాక్షిక సహకారం, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం లాంటి అంశాలను  జర్మనీ బృందం ప్రస్తావించింది.  ఈ అంశాల్లో రెండు దేశాల కలిసి పనిచేసి    ద్వైపాక్షిక సహకారాన్ని ఏ మేరకు అభివృద్ధి చేయవచ్చు అన్న అంశాన్ని జర్మనీ ప్రతినిధి బృందం లేవనెత్తింది.

జర్మనీ ప్రతినిధి బృందం అడిగిన ప్రశ్నలకు శ్రీ యాదవ్ సమాధానమిస్తూ ప్రధానమంత్రి ప్రారంభించిన మిషన్ లైఫ్  ప్రాధాన్యాన్ని వివరించారు.  ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి  నిర్మూలనకు భారతదేశం  తీసుకుంటున్న చర్యలు, ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయం, అంతరించిపోతున్న జాతులు, అడవుల పరిరక్షణ, అటవీ సర్వే, వ్యవసాయ అడవుల పెంపకం తదితర రంగాల్లో భారతదేశం అమలు చేస్తున్న కార్యక్రమాలను జర్మనీ ప్రతినిధి బృందానికి శ్రీ యాదవ్ వివరించారు. 

 సాంకేతిక పరిజ్ఞానం, జల వనరులు,  వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి, అటవీ రంగాల్లో ద్వైపాక్షిక సహకారం ద్వారా జర్మనీ అందిస్తున్న సహకారానికి  శ్రీ యాదవ్ గుర్తించి ధన్యవాదాలు తెలిపారు.  

 

Bhupender Yadav, Mission LiFE

ఆఫ్రికా దేశాలతో  త్రైపాక్షిక సహకారంపై జర్మనీ ప్రతినిధి వర్గం లేవనెత్తిన సందేహానికి సమాధానం ఇచ్చిన మంత్రి  ఇంధన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆఫ్రికా లో వివిధ ప్రాజెక్టులు చేపట్టిందని  పేర్కొన్నారు. అయితే,  పర్యావరణం, వాతావరణంపై ఆఫ్రికాలో ఏదైనా త్రైపాక్షిక సహకారం కోసం, తొలుత  విదేశాంగ మంత్రిత్వ శాఖను సంప్రదించాల్సి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. .  యొక్క  వసుధైవ కుటుంబకం నినాదం ద్వారా భారతదేశం జీ -20 అధ్యక్ష పదవి నిర్వహించి మార్గనిర్దేశం చేస్తుందన్నారు.  ప్రపంచ దేశాల సమస్యలు కూడా ఇదే విధానమ్మతో  పరిష్కరించాల్సిన అవసరం ఉందని అన్నారు. .

అనేక రంగాల్లో రెండు దేశాల మధ్య  ఉమ్మడి ప్రయోజనాలు ఉన్నాయని, జీవవైవిధ్యం, వాతావరణ మార్పులు, ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వంటి కొత్త రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి గల అవకాశాలు గుర్తించాలని సమావేశం నిర్ణయించింది. 

***


(Release ID: 1894709) Visitor Counter : 277