వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
ప్రపంచ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసేందుకు మార్గదర్శకులు, పెట్టుబడిదారులు మరియు వ్యవస్థాపకుల అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను రూపొందించాలని శ్రీ పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు.
ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి ఒక ఉమ్మడి, సహాయక మరియు స్థిరమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ప్రపంచం యొక్క సమిష్టి బాధ్యత: శ్రీ పీయూష్ గోయల్
అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడే బలమైన మూల స్తంభం ఆవిష్కరణ: శ్రీ పీయూష్ గోయల్
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా స్వీకరించే 2 & 3 వ స్థాయి నగరాల మార్కెట్ల నుండి పెరుగుతున్న భాగస్వామ్యం భారతదేశంలోని స్థానిక స్టార్టప్‌లకు ఒక భరోసాను పెంచింది: శ్రీ పీయూష్ గోయల్
మంత్రి ‘సెన్స్’ స్టార్టప్‌ల వృద్ధికి భాగస్వామ్యం, అన్వేషణ, పెంపకం, సేవ, సాధికారత - అనే మంత్రాన్ని అందించారు
నేటి ప్రపంచంలో ఆవిష్కరణలు కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మించినవి, ఎందుకంటే అవి సామాజిక న్యాయం మరియు పర్యావరణ సుస్థిరతను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది: శ్రీ పీయూష్ గోయల్
అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువ-ధర, అవుట్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ మరియు సపోర్ట్ సర్వీసెస్ కోసం తమను తాము గమ్యస్థానంగా మార్చుకోవాలి, గ్లోబల్ టెక్ మరియు ఇన్నోవేషన్ హబ్‌లుగా మారాలి: శ్రీ పీయూష్ గోయల్
Posted On:
28 JAN 2023 12:45PM by PIB Hyderabad
కేంద్ర వాణిజ్యం పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజాపంపిణీ మరియు జౌళి శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ప్రపంచ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మార్గదర్శకులు, పెట్టుబడిదారులు మరియు వ్యవస్థాపకుల అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను రూపొందించాలని పిలుపునిచ్చారు. ఈ నెట్‌వర్క్ స్టార్టప్‌లకు మద్దతివ్వాలి మరియు స్ఫూర్తినివ్వాలి, ఆలోచనలు, ఉత్తమ అభ్యాసాలు, నిధుల యంత్రాంగాలని సులభతరం చేయడానికి, పరిశోధన మరియు అభివృద్ధిలో సహకారాన్ని ప్రోత్సహించడానికి బృందంగా పని చేయాలి. ఈరోజు హైదరాబాద్‌లో జి20కి చెందిన స్టార్టప్ 20 ఎంగేజ్‌మెంట్ గ్రూప్ ప్రారంభ సమావేశ ప్రారంభ సెషన్‌లో ఆయన ప్రసంగించారు.
ప్రపంచంలోని సవాళ్లను పరిష్కరించడానికి ఉమ్మడి, మద్దతు మరియు స్థిరమైన స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ కోసం ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడం ఆయా దేశాల పాత్ర మాత్రమే కాదని, ప్రపంచంలోని అన్ని ప్రాంతాలలో స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలను ఎదిగేలా ప్రపంచవ్యాప్త ప్రయత్నాన్ని పెంపొందించడం ప్రపంచ దేశాల సమిష్టి బాధ్యత అని మంత్రి అన్నారు.
జీ 20కి అతిధేయ దేశంగా ప్రపంచ స్టార్టప్ ఎకోసిస్టమ్ యొక్క పురోగతి సామర్థ్యాన్ని హైలైట్ చేయడం భారతదేశానికి గర్వకారణమని శ్రీ గోయల్ అన్నారు. ఆవిష్కరణలపై భారతదేశం ప్రత్యేక దృష్టి సారించడంలో భాగంగా, స్టార్టప్20 గ్రూప్‌ను తొలిసారిగా భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ క్రింద ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
అమృత్‌కాల్‌లో అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో సహాయపడే బలమైన మూల స్తంభం ఆవిష్కరణ అని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థకు సామాజిక మరియు ప్రజా ప్రయోజనాలకు ఆవిష్కరణలు ఉత్ప్రేరక శక్తిగా ఉన్నాయని ఆయన అన్నారు. "నేటి ప్రపంచంలో ఆవిష్కరణలు కేవలం ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి మించినది, ఎందుకంటే అవి సామాజిక న్యాయం మరియు పర్యావరణ స్థిరత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది" అని ఆయన చెప్పారు.
స్టార్టప్ ఇండియా ఇనిషియేటివ్ ప్రారంభం 2016లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడంతో భారతదేశం తన స్టార్టప్ ప్రయాణాన్ని ప్రారంభించిందని మంత్రి గుర్తుచేశారు. గత 7 సంవత్సరాలలో, ఇది వ్యవస్థాపకతను పెంపొందించడంలో మరియు కొత్త ఆలోచనలను ప్రోత్సహించడంలో సహాయపడిందని, వృద్ధికి అనుకూలమైన పర్యావరణ వ్యవస్థను సృష్టించడం ద్వారా స్టార్టప్‌లు వృద్ధి చెందడానికి మరియు అభివృద్ధి చెందడానికి సహాయపడిందని ఆయన అన్నారు. వివిధ రంగాల్లో మా స్టార్టప్‌ల సామర్థ్యాలు- అది విద్యుత్ శక్తి కావచ్చు, ఆర్థిక చేరిక కావచ్చు, ఫిన్‌టెక్ ముఖ్యమైన పాత్ర పోషించినా, మహమ్మారిపై మన పోరాటం లో రిమోట్ హెల్త్‌కేర్ మరియు ఫుడ్ డెలివరీ చాలా ముఖ్యమైనప్పుడు కావచ్చు, ఆన్‌లైన్ లెర్నింగ్‌లో కావచ్చు, అది అగ్రి-టెక్‌లో మా పని కావచ్చు, అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి మాకు సహాయపడింది. నేడు అభివృద్ధి చాలాసహజంగా మారుతోంది, వాతావరణ మార్పు నుండి పేదరికం మరియు అసమానత వరకు ప్రపంచం అనేక ప్రపంచ సవాళ్లను ఎదుర్కొంటోందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ఆవిష్కరణలు ఈ సమస్యలకు పరిష్కారం చూపగలదని ఆయన తన దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. భారతీయ స్టార్టప్ సందర్భంలో, మన వ్యవస్థాపకులు ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు తమ సృజనాత్మకత మరియు చాతుర్యాన్ని ఉపయోగిస్తున్నారని మంత్రి అన్నారు. సామాజిక ఆవిష్కరణలను పునర్నిర్వచించడం ద్వారా భారతదేశంలో సమస్యలను పరిష్కరించడానికి మరియు సమ్మిళిత వృద్ధిని నిర్ధారించడానికి కోవిన్, యూ పీ ఐ మరియు ఓ ఎన్ డీ సీ వంటి డిజిటల్ ప్రజా ఆస్తుల ఉదాహరణలను ఆయన ఉదహరించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వేగంగా అందిపుచ్చుకుంటున్న 2 & 3 వ స్థాయి నగరాల నుండి పెరుగుతున్న భాగస్వామ్యం, విజయవంతం కావడానికి కొత్త ఆలోచనలతో భారతదేశంలోని స్థానిక స్టార్టప్‌లకు ఒక కవచంను అందించిందని మంత్రి అన్నారు. జీ-20 ద్వారా, భారతదేశం మన నైపుణ్యాన్ని బదిలీ చేయడానికి ప్రయత్నిస్తోందని, కాబట్టి ఇండియాస్టాక్ గ్లోబల్ స్టాక్ అవుతుందని మరియు ప్రజలు సాంకేతికతను ఉపయోగించే విధానాన్ని మారుస్తుందని, సాంకేతికతను సామాన్యులకు తీసుకెళ్లడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువ-ధర, అవుట్‌సోర్స్ సాఫ్ట్‌వేర్ మరియు సపోర్ట్ సర్వీసెస్ కోసం తమను తాము గమ్యస్థానాలుగా మార్చుకోవాలని, గ్లోబల్ టెక్ మరియు ఇన్నోవేషన్ హబ్‌లుగా మారాలని ఆయన అన్నారు. డబ్ల్యూ ఐ పి ఓ యొక్క గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ లో భారతదేశం 7 సంవత్సరాలలో 41 స్థానాలు భారీగా ఎగబాకి 40వ ర్యాంక్‌కు చేరుకుందని ఆయన హైలైట్ చేశారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా భారతదేశం పాఠశాల స్థాయి నుండి ఇన్నోవేషన్ స్ఫూర్తిని పెంపొందిస్తోందని శ్రీ గోయల్ పేర్కొన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలతో స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి భారతదేశం కూడా క్రియాశీల కార్యక్రమాలను అమలు చేస్తోందని ఆయన అన్నారు. “ఇండో-యుఎస్, ఇండో-యుకె, ఇండో-ఆస్ట్రేలియా భాగస్వామ్యాలు కొన్ని ప్రధాన ఉదాహరణలు, ఇక్కడ మేము లోతైన టెక్ స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం, వృత్త ఆర్థిక వ్యవస్థకు దోహదం చేయడం, ఆరోగ్యం, నీరు, వ్యవసాయం, విద్య, ఆర్థిక ఆసరా మొదలైన ప్రాథమిక అవసరాలను పరిష్కరిస్తాము. ”, అన్నారాయన.
స్టార్టప్‌ల అభివృద్ధికి శ్రీ గోయల్ ‘సెన్స్’ మంత్రాన్ని అందించారు, అంటే పంపిణీ, అన్వేషణ, పెంపకం, సేవ, సాధికారత. "నేను మన చుట్టూ ఉన్న ఉత్సాహాన్ని చూసినప్పుడు, నేను మారుతున్న ఆలోచనా ధోరణిని పొందుతాను, నేను అత్యవసర భావనను పొందుతాను, స్టార్టప్ 20 చాలా శక్తివంతమైన సంస్థగా మారుతుందని నేను గ్రహించగలను, ఇది ప్రపంచం స్టార్టప్‌లను గుర్తించే మరియు గౌరవించే విధానాన్ని మారుస్తుంది" , అయన చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్టప్‌ల భవిష్యత్తుకు నిజంగా మార్పు తీసుకురావడానికి మాకు సహాయపడే గ్లోబల్ స్టార్టప్ విప్లవానికి జీ 20 నాయకులకు బలమైన కార్యాచరణ సిఫార్సులకు తదుపరి 2 రోజుల్లో చర్చలు పునాది వేస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
స్టార్టప్ 20లో జీ 20 దేశాల నుండి ప్రతినిధులు మరియు పరిశీలకుల దేశాల నుండి తొమ్మిది మంది ప్రత్యేక ఆహ్వానితులు, బహుపాక్షిక సంస్థల నుండి అలాగే భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థ నుండి ప్రతినిధులు పాల్గొంటారు. భారతదేశం అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జీ 20 కింద ఏర్పాటైన గ్రూప్ దాని ప్రారంభ సమావేశాన్ని జనవరి 28-29 వరకు నిర్వహిస్తోంది, రాబోయే సంవత్సరాల్లో జీ 20 దేశాలలో మరియు అంతటా వ్యవస్థాపకత మరియు ఆవిష్కరణల ప్రాధాన్యతలపై విధాన సిఫార్సుల ఉత్పాదక అభివృద్ధిని అంచనా వేసింది. స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడం మరియు స్టార్టప్‌లు, కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, ఇన్నోవేషన్ ఏజెన్సీలు మరియు ఇతర కీలక పర్యావరణ వ్యవస్థ వాటాదారుల మధ్య సమ్మేళనాన్ని పెంపొందించడం కోసం ఈ సమావేశం ప్రపంచ నమూనాను సృష్టిస్తుంది.
జీ 20 షేర్పా శ్రీ అమితాబ్ కాంత్, నీతి ఆయోగ్ సీ ఈ ఓ, స్టార్టప్20 ఇండియా చైర్ డాక్టర్ చింతన్ వైష్ణవ్, ప్రభుత్వ సీనియర్ అధికారులు మరియు ఇతర ప్రముఖులు ప్రారంభ సెషన్‌లో పాల్గొన్నారు.
***
(Release ID: 1894508)
Visitor Counter : 178