ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
స్టార్టప్ హబ్, మెటా ఎక్స్ఆర్ స్టార్టప్ పథకం కోసం 120 స్టార్టప్‌లు,ఆవిష్కర్తలను గుర్తించిన ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
భారతదేశంలోని టైర్ II, III నగరాల నుంచి 30%పైగా స్టార్టప్‌లు యాక్సిలరేటర్ పధకానికి ఎంపిక
గ్రాండ్ ఛాలెంజ్ కోసం ఎంపిక చేసిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లలో 40% దేశంలోని టైర్ II, III నగరాలకు చెందిన వారు
ఎంపిక అయిన మొత్తం ఆవిష్కర్తలు, స్టార్టప్‌లలో 20% వరకు మహిళలు నాయకత్వంలో పనిచేస్తున్న /సహ-నేతృత్వం వహిస్తున్న స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు
Posted On:
27 JAN 2023 1:25PM by PIB Hyderabad
ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్నస్టార్టప్ హబ్, మెటా ఎక్స్ఆర్ స్టార్టప్ కార్యక్రమానికి 120 స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు ఎంపిక అయ్యారు. ఎంపిక చేసిన స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు జాబితాను ఈ రోజు ఇక్కడ విడుదల చేశారు.భారతదేశం అంతటా ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్ ) టెక్నాలజీ స్టార్టప్‌లు, ఆవిష్కర్తలను ఇన్నోవేటర్‌లను గుర్తించి ప్రోత్సహించి అభివృద్ధి చేయడానికి 2022 సెప్టెంబర్ లో ఎక్స్ఆర్ స్టార్టప్ కార్యక్రమం రూపొందింది. ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్, మెటా సంస్థ కార్యక్రమాన్ని అమలు చేస్తాయి.
యాక్సిలరేటర్, గ్రాండ్ ఛాలెంజ్ విభాగాల్లో ఎక్స్ఆర్ స్టార్టప్ పథకం అమలు జరుగుతుంది. అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పర్యావరణ వ్యవస్థ నుమరింత అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో పథకం అమలు జరుగుతుంది. జాతీయ స్టార్టప్ దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభమైంది.
యాక్సిలరేటర్ ప్రోగ్రామ్‌లో ఎంపిక చేసిన స్టార్టప్‌లలో 30% పైగా స్టార్టప్ భారతదేశంలోని టైర్ 2/3 నగరాల్లో పనిచేస్తున్నాయి. గ్రాండ్ ఛాలెంజ్‌లో ఎంపిక చేసిన ఆవిష్కర్తలు, స్టార్టప్‌లలో 40% మంది టైర్ 2/3 నగరాలకు చెందినవారు. కార్యక్రమానికి ఎంపిక అయిన మొత్తం సంస్థలు, ఆవిష్కర్తలలో 20% కంటే ఎక్కువ మంది మహిళా ఆవిష్కర్తలు, మహిళా వ్యవస్థాపకులు/సహ వ్యవస్థాపకులతో స్టార్టప్‌లు ఉన్నారు.
మాట్లాడుతూ, “ఎక్స్ఆర్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు డిజిటల్ పర్యావరణ వ్యవస్థ పై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. మెటావర్స్, భవిష్యత్తు ఇంటర్నెట్ వంటి సాంకేతికతలను రూపొందించడంలో భారతీయ స్టార్టప్‌లు ,ఆవిష్కర్తలు ముఖ్యంగా మెట్రో నగరాలు కాని ప్రాంతాలకు చెందిన స్టార్టప్‌లు ,ఆవిష్కర్తల పాత్ర కీలకంగా ఉంటుంది. మెటా సహకారం గుర్తించిన స్టార్టప్‌లు ,ఆవిష్కర్తలకు అవసరమైన సహకారం అందించి, నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి అవకాశం కలుగుతుంది." అని ఎలక్ట్రానిక్స్ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్ సీఈఓ శ్రీ జీత్ విజయ్ అన్నారు.
ఎక్స్ఆర్ స్టార్టప్ కార్యక్రమంలో పాల్గొన్నమెటా ఇండియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ శ్రీ శివనాథ్ తుక్రాల్ మాట్లాడుతూ, "విద్య, ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయ సాంకేతికత, పర్యాటక రంగం వంటి రంగాల్లో భారతదేశంలో సమూల మార్పులు చోటుచేసుకుంటున్నాయి.వీటిని మరింత అభివృద్ధి చేయడానికి బలమైన స్టార్టప్ రంగం అవసరం ఉంటుంది. పటిష్టమైన సాంకేతిక నైపుణ్యాలకు అదనంగా టైర్ II , III పట్టణాలకు చెందిన స్టార్టప్‌లు, ఆవిష్కర్తలు డిజిటల్ భవిష్యత్తును రూపొందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్‌తో ఎక్స్ఆర్ స్టార్టప్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు, భారతదేశం అంతటా సాంకేతిక స్టార్టప్‌లు , ఆవిష్కర్తల అభివృద్ధికి మరింత సహకారం అందిస్తాయి " అని అన్నారు.
రూ. గ్రాంట్‌తో ఎక్స్ఆర్ సాంకేతికతతో పనిచేస్తున్న 40 ప్రారంభ-దశ స్టార్ట్-అప్‌లకు యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ సహకారం అందిస్తుంది. ఒక్కొక్కరికి 20 లక్షల రూపాయలను గ్రాంటుగా అందిస్తారు. గ్రాండ్ ఛాలెంజ్ కింద విద్య,నైపుణ్యం, ఆరోగ్య సంరక్షణ,వినోదం, అగ్రిటెక్ పర్యావరణ రంగం, పర్యాటక రంగులకు చెందిన సంస్థలకు సహకారం లభిస్తుంది.
పరిశోధన, అభివృద్ధి దశ నుంచి పని చేయదగిన ఉత్పత్తులు, సేవలను అభివృద్ధి చేయడం వరకు ఆవిష్కర్తలకు సహకారం అందిస్తారు. మొదటగా 80 మంది ఆవిష్కర్తలు బూట్‌క్యాంప్‌కు హాజరవుతారు. మొత్తం 16 మంది ఆవిష్కర్తలకు ఒక్కొక్కరికి. 20 లక్షల రూపాయలను గ్రాంటుగా సమకూరుస్తారు. కనీస ఆచరణీయ ఉత్పత్తి (MVP)/ నమూనాలను అభివృద్ధి చేయడంలో వారికి సహాయపడటానికి మరింత సహకారం అందుతుంది.
వినియోగదారులను గుర్తించడం, కస్టమర్ కనెక్షన్‌లను ఏర్పాటు చేయడం, భాగస్వామ్య అవకాశాలు ఎక్కువ చేయడంతో పాటు నిధుల సేకరణలో స్టార్ట్-అప్‌లు మరియు ఇన్నోవేటర్‌లకు యాక్సిలరేటర్ , గ్రాండ్ ఛాలెంజ్ సహకారం అందిస్తాయి.
కార్యక్రమాన్ని ఐఐటీ ఢిల్లీ (నార్త్ జోన్)లో ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ (FITT), ఐఐఐటీ హెచ్ (సౌత్ జోన్), అటల్ ఇంక్యుబేషన్ సెంటర్‌లో సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ (CIE) SMUTBI (ఈస్ట్ జోన్), గుజరాత్ యూనివర్సిటీ స్టార్టప్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కౌన్సిల్ (GUSEC) (వెస్ట్ జోన్)సహా అమలు భాగస్వాముల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం అమలు జరుగుతుంది.
ఎంపిక స్టార్టప్‌లు, ఆవిష్కర్తల పూర్తి జాబితా ఇక్కడ ఉంది
స్టార్టప్ హబ్ గురించి:
నిధులు సమకూర్చడానికి నూతన పథకాలు, కార్పొరేట్ స్టార్టప్ ప్రోగ్రామ్‌లు, స్టార్టప్‌ల కోసం అంతర్జాతీయ విస్తరణ కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా భారతదేశం అంతటా స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను నిర్మించడం మరియు బలోపేతం చేయడం లక్ష్యంగా ఎలక్ట్రానిక్స్,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ స్టార్టప్ హబ్ పనిచేస్తోంది. స్టార్టప్ హబ్ 4000కు పైగా స్టార్టప్‌లు ఉన్నాయి. 51స్టార్టప్‌లకు స్టార్టప్ హబ్ అందిస్తోంది. 476 రిజిస్టర్డ్ ఇంక్యుబేటర్‌లు, 26 ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెంటర్‌లు , 22 యాక్సిలరేటర్‌లు మరియు 400కి పైగా మెంటార్‌లను స్టార్టప్ హబ్ కలిగి ఉంది.
Meta Platforms Inc గురించి
Meta వ్యక్తులు కనెక్ట్ అవ్వడానికి, కమ్యూనిటీలను కనుగొనడానికి మరియు వ్యాపారాలను పెంచుకోవడానికి సహాయపడే సాంకేతికతలను రూపొందిస్తుంది. 2004లో ఫేస్‌బుక్ ప్రారంభించినప్పుడు, అది ప్రజలు కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చింది. మెసెంజర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు వాట్సాప్ వంటి యాప్‌లు ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి మరింత శక్తినిచ్చాయి. ఇప్పుడు, సామాజిక సాంకేతికతలో తదుపరి పరిణామాన్ని రూపొందించడంలో సహాయపడటానికి Meta 2D స్క్రీన్‌లను దాటి ఆగ్మెంటెడ్ మరియు వర్చువల్ రియాలిటీ వంటి లీనమయ్యే అనుభవాల వైపు కదులుతోంది.
(Release ID: 1894266)
Visitor Counter : 215