గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ

గిరిజన సంక్షేమానికి దర్పణం పట్టిన గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన శకటం


ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో నాణ్యమైన విద్య ద్వారా సాధించిన గిరిజన సంక్షేమాన్ని ప్రదర్శించిన శకటం

Posted On: 26 JAN 2023 7:51PM by PIB Hyderabad

దేశ  గిరిజన వారసత్వాన్ని, గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న చర్యలు, ఎస్ టీ విద్యార్థుల కోసం  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో అందిస్తున్న  నాణ్యమైన విద్య ద్వారా గిరిజన సంక్షేమానికి జరుగుతున్న కృషికి అద్దం పట్టే విధంగా  ఈరోజు జాతీయ గణతంత్ర దినోత్సవ పరేడ్‌లో గిరిజన మంత్రిత్వ శాఖ తన శకటాన్ని ప్రదర్శించింది. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా  జరిగిన  పరేడ్‌లో దేశ  సాంస్కృతిక వారసత్వం, సాధించిన ఆర్థిక పురోగతి  బలమైన అంతర్గత మరియు బాహ్య భద్రతను ప్రతిబింబించే విధంగా ఇరవై మూడు శకటాలు పాల్గొన్నాయి.  రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల నుంచి పదిహేడు, వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాలు నుంచి ఆరు శకటాలు  కర్తవ్య పద్ లో జరిగిన పరేడ్‌లో పాల్గొన్నాయి.

 

 

ఈ సంవత్సరం పరేడ్‌లో  గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన అందరి దృష్టిని ఆకర్షించింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ (ఈఎంఆర్ఎస్ ) పథకం పై ప్రత్యేకంగా రూపొందిన శకటం  మొదటిసారిగా గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దర్శనం ఇచ్చింది.వివిధ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలు సిద్ధం చేసిన శకటాలను నిపుణుల కమిటీ పరిశీలించి ప్రదర్శనకు ఎంపిక చేసింది.  ఇతివృత్తం,ప్రదర్శించిన తీరు, సాంకేతిక అంశాల ప్రాతిపదికగా ఎంపిక ప్రక్రియ జరిగింది. రాష్ట్రాల ప్రతినిధులతో కమిటీ సభ్యులు అనేక సార్లు వివిధ అంశాలపై చర్చలు జరిపి శకటాలను ఎంపికలో తుది నిర్ణయం తీసుకున్నారు. 

 

 

ఈఎంఆర్ఎస్  పథకం కింద గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ  ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది.  ప్రాచీన భారతదేశంలో గురుకులాల కాలంలో ప్రకృతి ఒడిలో విద్యను అందించిన విధంగా దేశంలోని మారుమూల ప్రాంతాల్లో నివసించే గిరిజన ప్రజలకు అన్ని ఆధునిక సౌకర్యాలతో నాణ్యమైన విద్య అందించాలన్న లక్ష్యంతో మంత్రిత్వ శాఖ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పింది.

బాలికల విద్యకు ప్రాధాన్యత ఇస్తూ బాలురతో పాటు బాలికలు కూడా విద్యను అభ్యసించే విధంగా  గిరిజన మంత్రిత్వ శాఖ అమలు చేస్తున్న బాలికా విద్యకు ప్రతీక అయిన “నారీ శక్తి” ని శకటం ముందు భాగంపై ప్రదర్శించారు. విద్య ద్వారా ఉన్నత శిఖరాలకు చేరాలన్న  గిరిజన విద్యార్థుల ఆకాంక్షను కూడా శకటం ప్రదర్శించింది. విద్యకు ప్రతి రూపం అయిన పెన్నును  ఏకలవ్యుని ఆయుధమైన  విల్లు  బాణం ఆకారంలో శకటంపై అమర్చారు. గిరిజన విద్యార్థులు తమ భవిష్యత్తును ఏ విధంగా ఊహించుకుంటున్నారు కలలను సాకారం చేసుకోవడానికి చేస్తున్న కఠోర శ్రమకు ఇది నిదర్శనంగా కనిపిస్తుంది. విద్యార్థులకు  ఉపాధ్యాయులు అందిస్తున్న జ్ఞానం, విజ్ఞాన వ్యాప్తికి నిదర్శనంగా శకటం  వెనుక భాగంలో  జ్ఞాన వృక్షం కనిపిస్తుంది. ఉపాధ్యాయుల నుంచి పొందిన   జ్ఞానం  వ్యాప్తి చూడాలన్నది ఈఎంఆర్ఎస్ లక్ష్యాలలో ఒకటి. సహజ వనరుల పరిరక్షణకు అమలు జరుగుతున్న చర్యలను కూడా శకటంలో పొందుపరిచారు. 

***



(Release ID: 1894028) Visitor Counter : 162