సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

నేడు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక మహోత్సవం వందేభారతం కార్యక్రమం ఆకర్షణీయంగా నిలిచింది.


రిపబ్లిక్ డే లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క రంగురంగుల దృశ్య ప్రదర్శన 'నారీ శక్తి' థీమ్‌ను ప్రదర్శించింది .

Posted On: 26 JAN 2023 3:26PM by PIB Hyderabad

ఈ రోజు న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో జరిగిన జాతీయ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క సాంస్కృతిక మహోత్సవం వందేభారతం కార్యక్రమం ఆకర్షణీయంగా నిలిచింది. జాతీయ స్థాయి పోటీలో ఎంపికైన 479 మంది కళాకారులు 'నారీ శక్తి' అనే అంశంపై యావత్ దేశం ముందు ప్రదర్శించారు. గ్రాండ్ పరేడ్ సందర్భంగా, కళాకారులు తమ శక్తివంతమైన మరియు అర్ధవంతమైన ప్రదర్శన ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు మరియు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ యొక్క నిజమైన స్ఫూర్తితో భారతదేశం యొక్క విభిన్న సాంస్కృతిక మరియు కళాత్మక వారసత్వాన్ని బయటకు తీసుకువచ్చారు.

 

వందే భారతం కార్యక్రమానికి సంగీతం రాజా భవతారిణి మరియు అలోకనంద దాస్ గుప్తా స్వరపరిచారు మరియు కూర్పు హిందుస్థానీ, కర్నాటిక్ మరియు సమకాలీన జాజ్ అంశాల మేలు కలయిక.

 

ఈ రోజు కర్తవ్య పథ్‌లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో 'శక్తి రూపేన్ సంస్థితా' టైటిల్‌తో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క రంగుల దృశ్య కావ్యం కూడా ప్రదర్శించబడింది. ఈ  దృశ్య కావ్యం దేవత యొక్క 'శక్తి' రూపంపై ఆధారపడి ఉంటుంది. ఈ ప్రదర్శన ద్వారా దేవతలను స్తుతించే అనేక జానపద నృత్యాలు ఒకే వేదికపై సంగమించాయి.

 

కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో 'వందే భారతం నృత్యోత్సవం' నిర్వహించబడుతుంది. ఇది అఖిల భారత నృత్య ఉత్సవం, ఈ నృత్య ప్రదర్శన ద్వారా ప్రపంచం మొత్తానికి జాతి చైతన్యాన్ని ప్రతిబింబించే లక్ష్యంతో, ప్రజలలో 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని ప్రచారం చేస్తుంది. దీని రెండవ ఎడిషన్ కోసం దేశంలోని నలుమూలల నుండి కళాకారులు పోటీ పడ్డారు. అక్టోబర్ 15, 2022న ప్రారంభమైన ఈ పోటీలో మూడు దశలు ఉన్నాయి, అవి రాష్ట్రం, జోనల్ మరియు జాతీయం. పాల్గొనడానికి సూచించిన వయోపరిమితి 17 నుండి 30 సంవత్సరాలు. పోటీ యొక్క గ్రాండ్ ఫినాలే 19 మరియు 20 డిసెంబర్ 2022 న న్యూ ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించబడింది.

***



(Release ID: 1893993) Visitor Counter : 126